
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ వద్ద గల జిల్లా జైలులో ఓ జీవితఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వెంకట్ (65) తన మనుమడిని చంపిన కేసులో ఈ నెల 9వ తేదీన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న వెంకట్.. మంగళవారం సాయంత్రం జైలులోని బాత్‌రూమ్‌లో టవల్‌తో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.