గిద్దలూరు : రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి ఓ ఉద్యోగిపై నోరు పారేసుకున్నారు. తమకు వేతనాలు పెంచాలని కోరిన ఒక వీఆర్ఏని ఆయన దూషించిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం రాత్రి జరిగింది. తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని వీఆర్ఏలు తమకు వేతనాలు పెంచాలని కోరారు.
అందుకు బదులిచ్చిన మంత్రి ఇప్పుడిస్తున్న వేతనాలకు రెండింతలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వెంటనే అక్కడున్న శేఖర్ అనే వీఆర్ఏ ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించగా... 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. పోలీసులు వీఆర్ఏలను వెనక్కు నెట్టేశారు.
నోర్ముయ్... స్టుపిడ్....
Published Mon, Jan 13 2014 8:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement