మాజీ మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష | Former Union minister Dilip Ray Sentenced 3 year imprisonment Coal Scam | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రికి మూడేళ్లు జైలు శిక్ష

Published Mon, Oct 26 2020 12:17 PM | Last Updated on Mon, Oct 26 2020 12:34 PM

Former Union minister Dilip Ray Sentenced 3 year imprisonment Coal Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సోమవారం ఢిల్లీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 1999లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో రే దోషిగా తేలారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు నిందితుల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దిలీప్‌ రే ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దిలీప్‌ రేతో పాటు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఇద్దరు సీనియర్‌ అధికారులు ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ, నిత్యనంద్‌ గౌతమ్‌, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సీటీఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్‌లకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి శిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నిబంధనలను ఉల్లంఘించి సీటీఎల్‌కు బొగ్గు మైనింగ్‌ ప్రాంతాన్ని కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. సొంత ప్రయోజనాల కోసమే నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్‌ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్‌కు కేటాయించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

చదవండి: బొగ్గు స్కాంలో దోషిగా తేలిన మాజీమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement