
ముద్దు పెట్టుకున్న కేసులో పదేళ్ల జైలు..
అమీర్‌పేట: పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని ముద్దు పెట్టుకున్న కేసులో నిందితుడికి కోర్టు 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించిందని ఎస్‌ఆర్‌నగర్ ఇన్స్‌పెక్టర్ పి.సతీష్ తెలిపారు. వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్‌యాక్ట్ కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరళించారు.
నాంపల్లి సిటీసివిల్ కోర్టులో విద్యార్థి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వచ్చారు. 1వ తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.