టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం'కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మానవ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష ఖరారు కావడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని కాపాడాలంటూ ప్రెసిడెంట్ అబ్ధుల్‌ను వేడుకుంది. ‘‘ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏ పాపం చేసింది. చచ్చిపోతుంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. దయ చూపించండి. నేను జైలుకెళితే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది. నావైపు తప్పు లేదు కాబట్టే మాట్లాడుతున్నాను కేసును పునఃవిచారణ చేసి తనకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర‍్యంతరమైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హనీన్‌కు కోర్ట్ జైలు శిక్ష విధించడంతో ఆమె అభిమానులు విచారం వ‍్యక్తం చేస‍్తున్నారు. ప్రెసిడెంట్ అబ్ధుల్ తన కోరికను మన్నించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా,ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడవు. అందుకే హనీన్ హోసంను ఆ దేశ ప్రభుత్వం ఈ శిక్ష విధించిందనే వాదానలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment