మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే....బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్ మురకివాడల్లో పెరిగింది. ఆమెను 1994లో పాస్టర్ ఆండర్సన్ డో కార్మో కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మురికివాడల్లోని డజన్ల కొద్ది పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ఆదర్శంగా నిలిచారు. బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో కూడా ఈ జంట మంచి పేరుగాంచారు. అంతేగాదు శాంటోస్ 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది కూడా. ఐతే ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాల కఠినంగా వ్యవహరిస్తుంటాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదీగాక ఆమె ఎప్పుడైతే రాజకీయవేత్తగా ఎదగడం ప్రారంభమైందో అప్పటి నుంచి శాంటోస్ తన భర్తను హతమార్చేందుకు యత్నించింది. ఇలా ఆమె అతన్ని సుమారు 6 సార్లు విషప్రయోగం చేసి హతమార్చేందుకు యత్నించింది. ఇక చివరికి తన బంధువు సాయంతో ఆయుధాన్ని కొనుగోలు చేసి మరీ 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు యత్నించింది. ఐతే ఆ సమయంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాలేదు.
ఆమె ఇటీవల 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోవడంతో పోలీసులు ఈ కేసును చేధించే మార్గం సుగమం అయ్యింది.తదనంతర విచారణలో ఆమె తన కుటంబ సభ్యులు, పిల్లల సాయంతో తన భర్తను హతమార్చినట్లు తేలింది. దీంతో బ్రెజిల్ కోర్టు ఆమెకు 50 ఏళ్లు జైలు శిక్షవిధించింది. ఆమెకు ఈ హత్యలో సహకరించి తన కుమార్తెకి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో ఆమెకు ఆయుధం కొనుగోలు చేసి సాయం అందించిన బంధువుకి కూడా ఏడాది క్రితమే జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment