
ప్రతీకాత్మక చిత్రం
ఖమ్మం లీగల్: బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్ సోమవారం తీర్పు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్‌నగర్ ఎస్టీ కాలనీకి చెందిన పింగళి గణేష్ (చింటు) కిరాణా దుకాణానికి 2020 నవంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు నాలుగేళ్ల బాలిక వెళ్లింది.
(చదవండి: అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..)
ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో బాలికకు చింటు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కడుపునొప్పితో ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చింటూను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనలు విన్నాక నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.