US Crime News: A Couple1 Billion Dollar Solar Investment Scam Sentenced 11 Years - Sakshi
Sakshi News home page

వేల కోట్ల సోలార్‌ స్కామ్‌: భర్తకి 30 ఏళ్లు.. భార్యకి 11 ఏళ్ల జైలు శిక్ష!

Published Wed, Jun 29 2022 11:33 AM | Last Updated on Wed, Jun 29 2022 1:06 PM

A Couple1 Billion Dollar Solar Investment Scam Sentenced 11 Years  - Sakshi

లాస్‌ ఏంజెల్స్‌: యూఎస్‌లోని భార్యభర్తలిద్దరు సోలార్‌ పిరమిడ్‌ స్కామ్‌కి పాల్పడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. సోలార్‌ జనరేటర్ల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని చెప్పి దాదాపు 20 మంది పెట్టుబడిదారులును మోసం చేశారని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పాలెట్‌ కార్పస్‌ అనే 51 ఏళ్ల మహిళ తన భర్త జెఫ్‌తో కలిసి దాదాపు 7 వేల కోట్ల రూపాయిల స్కామ్‌ తెరలేపారని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కార్పస్‌కి 11 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది.

అంతకముందు ఆమె భర్తకి ఇదే స్కాంలో సుమారు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ జంట ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ స్కాంలో ఈ జంట సుమారు 17 మంది పెట్టుబడుదారుల నుంచి రూ. 7 వేల కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్లో ​కొంత భాగాన్ని ఈ జంట తమ విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

(చదవండి: తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement