కాలేజీ చదువు వదిలేసి.. రూ.660 కోట్ల భారీ మోసం | Us Court Sentenced 24 Year Old Australian Cryptocurrency Fraudsters | Sakshi
Sakshi News home page

Cryptocurrency: పెట్టుబడుల పేరుతో వందమందిని బకరాల్ని చేశాడు

Published Fri, Sep 17 2021 2:02 PM | Last Updated on Fri, Sep 17 2021 2:28 PM

Us Court Sentenced 24 Year Old Australian Cryptocurrency Fraudsters - Sakshi

ఓ యువకుడు 'తాను కాలేజీ చదివే రోజుల్లో అందరిలా కాకుండా.. ఒంటి మీద కోటు నలగకుండా..కోటీశ్వరుడు అవ్వాలని అనుకున్నాడు. ఆ అత్యాశతోనే కాలేజీ మానేసి క్రిప్ట్రో కరెన్సీ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. 'హెడ్జ్‌ ఫండ్‌' స్కామ్‌తో పెట్టుబడి దారుల్ని వందల కోట్లలో మోసం చేశాడు. ఆ మోసం వెలుగులోకి రావడంతో కోర్టు నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధించింది. 


ఆస్ట్రేలియాకు చెందిన  24ఏళ్ల స్టెఫెన్‌ క్విన్‌ డబ్బులు సంపాదించేందుకు అడ్డదార్లు తొక్కాడు. మధ్యలో చదువు మానేసి 2017లో ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు వచ్చాడు. ఇక్కడ న్యూయార్క్‌ సిటీలో 'వర్జిల్ సిగ్మా ఫండ్ ఎల్పీ' పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ ధరకే క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయోచ్చని నమ్మించాడు. అంతేకాదు క్రిప్టోకరెన్సీపై ట్రేడింగ్‌ నిర్వహించేందుకు 'టెంజిన్' అనే స్పెషల్‌ ట్రేడింగ్‌ అల్గారిథంను డెవలప్‌ చేశాడు. ఆ అల్గారిథంతో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లో బిటక్‌ కాయిన్‌ కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించాడు. 2017లో వర్జిల్ సంస్థ 500 శాతం వార్షిక రాబడిని పొందిందని చెప్పుకున్నాడు. 2018లో క్విన్‌ గురించి వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ సైతం కథనాల్ని ప్రచురించింది.

 

అ పబ్లిసిటీని క్యాష్‌ చేసుకోవాలని ఇన్వస్టర్లకు లాభాల్ని అందించే సంస్థ తన దేనంటూ సుమారు 100 మంది నుంచి సుమారు (90మిలియన్లు) రూ. 660 కోట్లు పెట్టుబడులు పెట్టించాడు. ఆ డబ్బును తన వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నాడు.పెట్టుబడిదారులకు లాభాలు వస్తున్నాయని నమ్మించేందుకు ఫేక్‌ డాక్యుమెంట్లు క్రియేట్‌ చేసి  క్రిప్టోకరెన్సీలతో సంబంధం లేని రియల్ ఎస్టేట్, బ్యాంకులు ఇచ్చిన రుణాల్ని చెల్లించలేక మూలన పడిన సంస్థల్ని కొనుగోలు చేశాడు.   

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం..''ఇన్వెస్టర్లు పెట్టుబడుల గురించి అడిగినప్పుడు..తమ సంస్థ పెట్టుబడులు పెట్టిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయనిఫేక్‌ డాక్యుమెంట్లు చూపించి తప్పించుకునేవాడు. చివరికి ఇన్వెస్టర్లు నిందితుడు స్టెఫెన్‌ క్విన్‌పై అనుమానం రావడంతో కోర్ట్‌ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన  న్యూయార్క్ సౌత్రన్‌ డిస్ట్రిక్‌ కోర్ట్‌ జడ్జ్‌ వాలెరీ కాప్రోనీ నిందితుడికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. నిందితుడు పక్కా ప్లాన్‌తో పెట్టుబడిదారుల్ని మోసం చేసినట్లు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

చదవండి : బిట్‌ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్‌ కరెన్సీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement