హీరో రాజ్‌ తరుణ్‌ తండ్రికి మూడేళ్ల జైలు | Hero Raj Tarun Father Sentenced To 3 Years In Jail | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 8:46 AM | Last Updated on Sat, Apr 21 2018 9:13 AM

Hero Raj Tarun Father Sentenced To 3 Years In Jail - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌హీరో రాజ్‌ తరుణ్‌ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. బ్యాంక్‌ ఉద్యోగి అయిన బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు.

2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 9.85 లక్షల రూపాయల లోన్‌ తీసుకున్నారు. బ్యాంక్‌ అధికారుల తనిఖీల్లో నకిలీ బంగారం బయటపడటంతో మేనేజర్‌ గరికిపాటి సుబ్రహ్మణ్యం.. బసవరాజుపై గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసుపై మేజిస్ట్రేట్‌ సన్నీపర్విన్‌ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. రాజ్‌ తరుణ్‌ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement