basavaraju
-
మా మంత్రి వల్ల జిల్లా నాశనం
సాక్షి, తుమకూరు(కర్ణాటక): ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు చూడు.. చాలా చెడ్డోడు. మా జిల్లా మంత్రి మాదుస్వామి కూడా అలాంటివాడే. తుమకూరు జిల్లాను మొత్తం పాడు చేస్తున్నాడు అని స్థానిక బీజేపీ ఎంపీ జీ.ఎస్. బసవరాజు విమర్శించారు. గురువారం పాలికే ఆఫీసు ప్రాంగణంలో స్మార్ట్ సిటీ పథకంలో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో మంత్రి బైరతి బసవరాజు పాల్గొనగా ఆయన వద్ద ఎంపీ ఫిర్యాదు చేశారు. తరువాత ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మంత్రి మాదుస్వామికి, కొరియా అధ్యక్షుడు కిమ్‌కి తేడా లేదు. ఇద్దరూ స్వార్థపరులు అని అన్నారు. మాదుస్వామి మంత్రి అయిన్పపటి నుంచి మా జిల్లా మొత్తం పాడైపోతోందని ఆరోపించగా, ఇలాంటివి ఇక్కడ మాట్లాడవద్దు, బాగుండదు అని మంత్రి బైరతి బసవరాజు నచ్చజెప్పజూశారు. మంత్రి ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసీటు కూడ రాదు. నోరు తెరిస్తే చాలు కొట్టండి. చంపండి అంటాడు అని ఎంపీ విమర్శలను కొనసాగించారు. కాగా, రాష్ట్రంలో అనేక జిల్లాలో మంత్రులు– బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఇటువంటి విభేదాలే ఉన్నట్లు సమాచారం. -
Karnataka Politics: ఇంజనీరు రిపేర్ చేస్తాడా?
రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన యెడ్డీనే స్థానిక బీజేపీ నేతలు ఇబ్బంది పెట్టగా, సౌమ్యుడిగా పేరున్న బొమ్మై వీరితో ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. యెడ్డీ ఆశీస్సులతో పాటు, పార్టీ లో సీనియర్ నేతల మద్దతుందని బొమ్మై చెప్పారు. గతంలో సదానంద గౌడను యెడ్డీ మద్దతుతోనే సీఎం చేశారు. కానీ హైకమాండ్ ఆశించినట్లు గౌడ రాణించలేకపోయారు. సీఎంగా దిగినంత మాత్రాన యెడ్డీ ఊరికే ఉండరు. రాజకీయాల్లో యాక్టివ్గానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారులు సైతం బీజేపీలోనే కొనసాగుతారు. వీరిలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్రను సూపర్ సీఎంగా పిలిచేవారు. తండ్రి సీఎంగా దిగిపోయినా, విజయేంద్ర హవా కొనసాగించే యత్నాలు సాగించవచ్చు. యెడ్డీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్ ఎంతవరకు బొమ్మైకి సహకరిస్తారో తెలీదు. అరవింద్.. యెడ్డీ స్థానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ అధిష్టానం బొమ్మైను ఎంచుకుంది. వీరితో పాటు సీఎం పోస్టు ఆశించిన పలువురు ఆశావహులను బుజ్జగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బొమ్మైపై ఉంది. ఈ మెకానికల్ ఇంజనీరు యెడ్డీ వర్గాన్ని, అసమ్మతి వర్గాన్ని సముదాయించుకుంటూ సొంత పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తారో, లేదో వేచిచూడాల్సిందే! –నేషనల్ డెస్క్, సాక్షి 50%కి పైగా 2 ఏళ్ల లోపే... కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. కన్నడనాట సీఎంల పదవీకాలం వివరాలిలా ఉన్నాయి. పదవీకాలం సీఎంలు 0–1 ఏళ్లు 9 మంది 1–2 7 2–3 6 3–4 3 4–5 3 5+ 3 -
Karnataka Politics: కర్ణాటక కొత్త బాస్ బొమ్మై
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ సోమప్ప బొమ్మై(61)ని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. బీజేపీ హైకమాండ్ ఆదేశంతో సీఎం యడియూరప్ప సోమవారం ఉదయం రాజీనామా చేయడం తెలిసిందే. కొత్త సీఎం ఎంపిక వ్యవహారం పర్యవేక్షణకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డిని హైకమాండ్ నియమించింది. వీరిద్దరూ కలిసి రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి అరుణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటిల్, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఆపద్ధర్మ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో యడ్డీ కేబినెట్లో హోం, న్యాయవ్యవహారాల మంత్రిగా ఉన్న బొమ్మై పేరు ఖరారు చేశారు.అనంతరం మంగళవారం సాయంత్రం బెంగళూరులోని క్యాపిటల్ హోటల్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి లాంఛనంగా బొమ్మైని ఎన్నుకున్నారు. తదనంతరం బొమ్మై, యడియూరప్ప ఆశీస్సులు అందుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సీనియర్‌నేత సీటీ రవి, పలువురు మంత్రులు రేసులో ఉన్నా బొమ్మైకి యడియూరప్ప గట్టి మద్దతు ఇవ్వడం కలసి వచ్చింది. రేసులో పలువురు ఉన్నప్పటికీ ఉత్తర కర్ణాటక, లింగాయత్ వర్గానికే సీఎం పీఠం కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్ భావించింది. సీఎంగా ఎన్నికవగానే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుతా: బొమ్మైకరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రాధాన్యమిస్తానని కర్ణాటక కొత్త సీఎంగా ఎన్నికైన బసవరాజ బొమ్మై చెప్పారు. వరదలు, కరోనాతో బాధలు పడ్డ ప్రజలకు ఊరటనిస్తానన్నారు. ఇటీవల కాలంలో కర్ణాటకలో కరోనా భారీగా విజృంభించింది. ఇదే సమయంలో వరదలు సంభవించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, మాజీ సీఎం యడియూరప్పకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. వీరి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. బొమ్మైను సీఎంగా ఎంపిక చేయడంతో ఆయన సొంత నియోజకవర్గం సిగ్గాన్లో సంబరాలు అంబురాన్నంటాయి. -
కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
-
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
దళపతి కేశవరావు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నూతన ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న, 1992 నుంచి 25 ఏళ్లపాటు పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించిన సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అనారోగ్యం, వయోభారం దృష్ట్యా కేంద్ర కమిటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పీపుల్స్‌వార్ గ్రూపులో ఉన్న అనేక పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి 2004 సెప్టెంబర్ 21న మావోయిస్టు పార్టీగా ఏర్పడగా నూతన పార్టీకి గణపతే నాయకత్వం వహించాలని అప్పటి పార్టీలన్నీ ప్రతిపాదించాయి. దీంతో గణపతి అప్పుడు కార్యదర్శిగా నియమితులయ్యారు. పీపుల్స్‌వార్ గ్రూప్ ద్వారా 14 రాష్ట్రాలను ప్రభావితం చేసిన మావోయిస్టు పార్టీకినాయకత్వ బాధ్యతలు వహించిన గణపతి.. ఉద్యమం నడపడంలో నిష్ణాతుడిగా పేరు సంపాదించారు. అన్ని రాష్ట్రాల కమిటీలను వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ 8 రాష్ట్రాల్లోనే కార్యకలాపాలు సాగిస్తుండటం, కార్యకలాపాలు సైతం ఆశించినట్లుగా లేకపోవడంతో పార్టీ కుదేలైనట్లు పోలీసు వర్గాలు ప్రకటిస్తూ వచ్చాయి. మరోవైపు గణపతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం పార్టీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ వచ్చింది. దీంతో స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ ఐదో సమావేశంలో గణపతి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేశవరావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ బాధ్యతలను కేశవరావు పర్యవేక్షించనున్నారు. మావోయిస్టు పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కేశవరావు పరిష్కరిస్తారని కమిటీ ఆశిస్తోంది. అదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త నియామకాలపై ఆయన దృష్టి పెడతారా అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరీ కేశవరావు? గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బస్వరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ. మావోయుస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న వివిధ పేర్లు ఇవి.æ కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతిదగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. సూరపనేని జనార్దన్ తర్వాతి తరంవాడైన కేశవరావు... వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కాలేజీలో 1974లో ఇంజనీరింగ్ చదివారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. కేశవరావుది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అ«ధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గెరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయు«ధ శిక్షణలోనూ ఆయన సిద్ధహస్తుడు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా. మావోయుస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆరు నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్టయ్యారు. ఆయన తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కేశవరావేనని అంచనా. కేశవరావుపై కేంద్రం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు పార్టీలో వ్యవస్థ ఇలా... 1. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ప్రధాన కార్యదర్శి కేశవరావు బాధ్యుడిగా ఉంటారు. సెంట్రల్ కమిటీలో ప్రస్తుతం 19 మంది సభ్యులుంటే అందులో 13 మంది ఏపీ, తెలంగాణలకు చెందినవారే ఉన్నారు. 2. సెంట్రల్ కమిటీ కింద సెంట్రల్ మిలిటరీ కమిషన్, పోలిట్‌బ్యూరో ఉంటాయి. 3. మిలిటరీ కమిషన్‌కు ఇప్పటివరకు కేశవరావు బాధ్యత వహించారు. పోలిట్‌బ్యూరోకు సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి, మిలిటరీ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్నవారు ఇద్దరూ కలసి బాధ్యత వహిస్తారు. (పోలిట్‌బ్యూరోలో మొత్తం 9 మంది సభ్యులుంటారు.) 4. ఈ మూడు విభాగాల కింద తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల పార్టీ రీజనల్ విభాగాలు, స్పెషల్ జోనల్ కమిటీలు, రీజనల్ కమిటీలు, డివిజనల్ కమిటీలు, ఏరియా కమిటీలు, స్థానిక గెరిల్లా దళాలతో కూడిన అంచెలంచెల వ్యవస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది. -
దళపతిగా గణపతి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల నాగేశ్వరరావు) పదవీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియరైన బసవరాజు (నంబాళ్ల కేశవరావు)ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఆయన ఎన్నికపై ఇదివరకే కేంద్ర కమిటీలో చర్చజరగగా నేడు (బుధవారం) ప్రధాన కార్యదర్శిగా బసవరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన గణపతి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది. 1992 జూన్‌లో మావోయిస్టు పార్టీకి గణపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పార్టీ కష్టకాలములో ఉన్న సమయంలో కీలక బాధ్యతలు స్వీకరించిన గణపతి.. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. ఆ సమయంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య కమిటీకి నాయకత్వం వహిస్తూ సమస్యలు పరిష్కరించగలిగే స్థితిలో లేరు. ఆ సమయంలో కేంద్రకమిటీలో అంతర్గత సవాళ్లు, కొన్ని అవకాశవాద ముఠాలు పార్టీని చీల్చడానికి ప్రయత్నించాయి. వాటిన్నింటిని తిప్పికొట్టేందుకు కేంద్ర కమిటీ గణపతిని ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 1998లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్, సీపీఐ (ఎంఎల్, యూనిట్) విలీనమై సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌గా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో పార్టీ అనేక రాష్ట్రాలకు విస్తరించి మరింత బలంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పడిన నూతన కమిటీకి గణపతి నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2000 నాటికి మిలటరీ పంథాను అభివృద్ధి చేసుకుని ప్రజావిముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకుంది. అనేక పరిణామాల నేపథ్యంలో 2004లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీపీఐ)లు విలీనమై సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించింది. రెండు పార్టీలు విలీనం కావడంతో భారత విప్లవోద్యమంలో మావోయిస్టు పార్టీ మహా స్రవంతిగా మారింది. ఈ పార్టీలో ఎంతో కీలకమైన నేతలతో సహా, నక్సల్బరీ తరం నాయకులు కూడా ఉన్నారు. 1992 నుంచి 2018 వరకు దాదాపు 26 ఏళ్లు గణపతి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహించిన కాలమంతా ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేంద్ర నాయకత్వంలో పురోగమించింది. ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా బసవరాజును కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఆయన 17 ఏళ్లకు పైగా కేంద్రకమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్భందం మరోవైపు విప్లవ బాటలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లటం నూతన నాయకత్వం ముందు ఉన్న పరీక్ష అని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. -
హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు
టాలీవుడ్ యంగ్‌హీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. బ్యాంక్ ఉద్యోగి అయిన బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. 2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి 9.85 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు. బ్యాంక్ అధికారుల తనిఖీల్లో నకిలీ బంగారం బయటపడటంతో మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం.. బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసుపై మేజిస్ట్రేట్ సన్నీపర్విన్ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు. -
ఆటో బోల్తా : ఇద్దరికి గాయాలు
హిందూపురం అర్బన్ : పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ వెంకటేష్, ద్విచక్రవాహనదారుడు బసవరాజు తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ బండలను వేసుకుని వేగంగా పరిగికి వెళ్తున్న వెంకటేష్ ఆటోకు కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అదే రోడ్డులో ఎదురుగా ద్విచక్రవాహనంలో వస్తున్న బసవరాజు ఆటోను ఢీకొన్నాడు. దీంతో అతని తలకు బలమైన గాయాలై అపస్మాకర ‡స్థితిలో పడిపోయాడు. క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బసవరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ర్యాలీల హోరు
వరంగల్, తెలంగాణ విజయోత్సవ ర్యాలీలు హోరెత్తుతున్నారుు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన రాజకీయ పక్షాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారుు. తెలంగాణ బిల్లు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి ఘనస్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగుతున్నారుు. మంగళవారం హన్మకొండలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రధాన నేతలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ర్యాలీ జరిగింది. తాజా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ సిరిసిల్ల రాజయ్య జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండలో ర్యాలీలు నిర్వహించారు. నగరంలో కాజీపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ వరంగల్ మహేశ్వరీగార్డెన్స వరకు కొనసాగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరాన్ని మూడురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు. మహేశ్వరీగార్డెన్సలో భారీ సభ నిర్వహించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.