పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ వెంకటేష్, ద్విచక్రవాహనదారుడు బసవరాజు తీవ్రంగా గాయపడ్డారు.
హిందూపురం అర్బన్ : పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ వెంకటేష్, ద్విచక్రవాహనదారుడు బసవరాజు తీవ్రంగా గాయపడ్డారు. టైల్స్ బండలను వేసుకుని వేగంగా పరిగికి వెళ్తున్న వెంకటేష్ ఆటోకు కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అదే రోడ్డులో ఎదురుగా ద్విచక్రవాహనంలో వస్తున్న బసవరాజు ఆటోను ఢీకొన్నాడు.
దీంతో అతని తలకు బలమైన గాయాలై అపస్మాకర ‡స్థితిలో పడిపోయాడు. క్షతగాత్రుల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బసవరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.