ర్యాలీల హోరు
వరంగల్,
తెలంగాణ విజయోత్సవ ర్యాలీలు హోరెత్తుతున్నారుు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన రాజకీయ పక్షాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారుు. తెలంగాణ బిల్లు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి ఘనస్వాగతం పలుకుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగుతున్నారుు. మంగళవారం హన్మకొండలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రధాన నేతలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను సమీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ర్యాలీ జరిగింది. తాజా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ సిరిసిల్ల రాజయ్య జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండలో ర్యాలీలు నిర్వహించారు. నగరంలో కాజీపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ వరంగల్ మహేశ్వరీగార్డెన్‌స వరకు కొనసాగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరాన్ని మూడురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు. మహేశ్వరీగార్డెన్‌సలో భారీ సభ నిర్వహించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.