సాక్షి, తుమకూరు(కర్ణాటక): ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నాడు చూడు.. చాలా చెడ్డోడు. మా జిల్లా మంత్రి మాదుస్వామి కూడా అలాంటివాడే. తుమకూరు జిల్లాను మొత్తం పాడు చేస్తున్నాడు అని స్థానిక బీజేపీ ఎంపీ జీ.ఎస్. బసవరాజు విమర్శించారు. గురువారం పాలికే ఆఫీసు ప్రాంగణంలో స్మార్ట్ సిటీ పథకంలో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో మంత్రి బైరతి బసవరాజు పాల్గొనగా ఆయన వద్ద ఎంపీ ఫిర్యాదు చేశారు.
తరువాత ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మంత్రి మాదుస్వామికి, కొరియా అధ్యక్షుడు కిమ్‌కి తేడా లేదు. ఇద్దరూ స్వార్థపరులు అని అన్నారు. మాదుస్వామి మంత్రి అయిన్పపటి నుంచి మా జిల్లా మొత్తం పాడైపోతోందని ఆరోపించగా, ఇలాంటివి ఇక్కడ మాట్లాడవద్దు, బాగుండదు అని మంత్రి బైరతి బసవరాజు నచ్చజెప్పజూశారు. మంత్రి ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసీటు కూడ రాదు.
నోరు తెరిస్తే చాలు కొట్టండి. చంపండి అంటాడు అని ఎంపీ విమర్శలను కొనసాగించారు. కాగా, రాష్ట్రంలో అనేక జిల్లాలో మంత్రులు– బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఇటువంటి విభేదాలే ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment