బెంగళూరు: ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, ఓడిపోతామనుకుంటున్న వాళ్లు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో సోమవారం(ఏప్రిల్29)జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
ఫేక్ వీడియోలను గుర్తిస్తే బీజేపీ కార్యకర్తలు ముందుగా వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మోదీ కోరారు. కాగా,ఐదేళ్ల క్రితం జరిగిన బాలాకోట్ దాడులకు సంబంధించి ప్రధాని కీలక విషయం వెల్లడించారు. దాడుల సమాచారాన్ని ముందుగా పాకిస్థాన్‌కు చెప్పిన తర్వాతే బయటికి వెల్లడించామని తెలిపారు.
పాకిస్థాన్‌కు ఈ విషయమై ఫోన్ చేస్తే వాళ్లు తన ఫోన్ తీయలేదన్నారు. పాకిస్థాన్‌కు సమాచారం వెళ్లేవరకు మీడియాకు విషయం వెల్లడించవద్దని ఆర్మీ అధికారులను తాను కోరినట్లు చెప్పారు. తనకు వెనుక నుంచి దాడి చేయడంపై నమ్మకం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment