కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్‌ బొమ్మై ప్రమాణ స్వీకారం | Basavaraj Bommai To Take Oath As Karnataka CM At 11am Tomorrow | Sakshi
Sakshi News home page

కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్‌ బొమ్మై ప్రమాణ స్వీకారం

Published Tue, Jul 27 2021 10:23 PM | Last Updated on Tue, Jul 27 2021 10:23 PM

Basavaraj Bommai To Take Oath As Karnataka CM At 11am Tomorrow - Sakshi

బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే.

జనతా దళ్‌ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్‌ బెల్లాద్‌, బసన్నగౌడ పాటిల్‌, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement