సాధనలో రహానే, కెప్టెన్ కోహ్లీ
సాక్షి, స్పోర్ట్స్ : టెస్ట్ సిరీస్ చేజారినప్పటికీ చివరి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకున్న టీమిండియా విక్టరీ కైవసం చేసుకుంది. ఇప్పుడు పరిమిత ఓవర్ల సమరానికి సిద్ధమైపోయింది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా డర్బన్‌లో నేడు సఫారీలతో.. భారత్ తొలి వన్డే ఆడనుంది. అయితే సఫారీ గడ్డపై భారత రికార్డును పరిశీలిస్తున్న విశ్లేషకులు గెలుపు అవకాశాలపై పెదవి విరిచేస్తున్నారు.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా.. సౌతాఫ్రికా బౌలర్లను వారి సొంత పిచ్‌లపై ఎదుర్కోవటం చాలా కష్టంతో కూడుకున్న పనే. 1992 నుంచి ఇప్పటిదాకా సఫారీ గడ్డపై ప్రొటీస్‌తో టీమిండియా 28 మ్యాచ్‌ల్లో తలపడింది. అందులో 21 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా గెలుపొందగా.. భారత్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. డర్బన్‌లో ఇరు జట్లు 7 వన్డేలు ఆడగా.. ఆరు మ్యాచ్‌లు ఓడిపోగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించిన తర్వాత భారత్ గెలుపొందే అవకాశాలు చాలా తక్కువ అని వారంటున్నారు.
కానీ, 2013 వరల్డ్ కప్‌లో ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించిన విషయాన్ని మరికొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ రౌండర్లు విజృంభిస్తే టీమిండియా గెలుపు సాధ్యమయ్యే పనేనన్న అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. పైగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ జట్టుకు దూరం కావటం భారత్ బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తే టీమిండియా గెలుపు కైవసం చేసుకోగలదని.. అయితే అందుకు 45 శాతం పైగా మాత్రమే అవకాశాలు ఉన్నాయని మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment