
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. చివరిదైన ఆరో వన్డేలో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ వన్డే సిరీస్‌లో జట్టులో చోటు దక్కని ఆటగాళ్లను నామమాత్రమైన ఆరో వన్డేలో బరిలోకి దించి అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరగనుంది.
భారత్‌కు గత 25 ఏళ్లలో సాధ్యం కాని వన్డే సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కొహ్లి సైతం రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించడమే ఉత్తమం అంటున్నాడు. ఇప్పటికే 4-1తో టీమిండియా వన్డే సిరీస్ కైవసం చేసుకోగా,
కొందరు ఆటగాళ్లు వరుస షెడ్యూళ్లతో అలసిపోయారు. దీంతో వన్డే సిరీస్ అనంతరం సఫారీ జట్టుతోనే ప్రారంభం కానున్న 3 ట్వంటీ20ల సిరీస్ నేపథ్యంలో కొందరు సీనియర్ ఆటగాళ్లకు ఆరో వన్డేలో విశ్రాంతి
ఇవ్వనున్నారు. అయితే ఎవరికీ విశ్రాంతి ఇవ్వనున్నారో మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించలేదు. ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 18న ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment