కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే.. | Indian bowlers approach & effort commendable: Harbhajan | Sakshi
Sakshi News home page

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..

Published Mon, Jun 12 2017 6:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..

లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల అద్వితీయ ప్రదర్శనే కారణమని భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ నెం 1 జట్టు అయిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేయడం బౌలర్ల ప్రతిభకు నిదర్శనమని కొనియాడాడు. పేస్‌ బౌలర్లలో తొలి 10 ఓవర్లలో ఎక్కువ డాట్‌ బాల్స్‌ రాబట్టారిని దీంతో సఫారీలు ఒత్తిడి గురయ్యారని భజ్జీ ఐసీసీకి రాసిన కాలమ్‌లో వివరించాడు. ఈ క్రెడిట్‌ యువ బౌలర్‌ బూమ్రాకేనని, ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక మరో పేసర్‌ భువనేశ్వర్‌, స్పిన్నర్లు కూడా తమ వంతు రాణించారన్నాడు. భజ్జీ భారత బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్‌ ఇచ్చాడు. దావన్‌, కోహ్లీల బ్యాటింగ్‌ అద్భతమన్నాడు. చేజింగ్‌లో కోహ్లి రాణిస్తాడనే విషయం మరోసారి నిరూపించాడని భజ్జీ పేర్కొన్నాడు.

 కోహ్లి, డివిలియర్స్‌ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేర్వేరని భజ్జీఅభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్‌లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది భారత్‌ గెలుపుకు ఒక కారణమని తెలిపాడు. దక్షిణాఫ్రికా చిన్న చిన్న తప్పిదాలు చేసిందని అదే వారి కొంపముంచిందన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు కావడం చాల అరుదని అలాంటిది డివిలియర్స్‌, మిల్లర్‌ రనౌట్లు టీం ఇండియాకు బూస్ట్‌నిచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు.  దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఊహించలేదని.. కానీ నా అంచనాలు తప్పని రుజువయ్యాయని బజ్జీ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement