అశ్విన్ స్థానంలో హర్భజన్! | Ashwin suffers side strain, Harbhajan in as cover | Sakshi
Sakshi News home page

అశ్విన్ స్థానంలో హర్భజన్!

Published Mon, Oct 12 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

అశ్విన్ స్థానంలో హర్భజన్!

అశ్విన్ స్థానంలో హర్భజన్!

కాన్పూర్: తొలి వన్డేలో గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వెటరన్ ఆటగాడు హర్భజన్‌ను తీసుకున్నారు. రెండో వన్డేకు ముందు అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. టి20 సిరీస్‌లో ఆడిన భజ్జీకి వన్డే జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. తొలి వన్డేలో కేవలం 4.4 ఓవర్లు మాత్రమే వేసిన అశ్విన్ ఫీల్డింగ్ చేస్తూ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన బోర్డు వెంటనే హర్భజన్‌కు కబురు పెట్టింది. మరోవైపు అశ్విన్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండే విషయం పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరమే తేలనుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి అతనికి ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో బోర్డు వైద్య బృందం నిర్ణయించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement