బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ను నియమించాలి
న్యూఢిల్లీ: మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌ను భారత్ బౌలింగ్ కోచ్‌గా నియమించాలని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్ లు ఉండగా బౌలింగ్ కోచ్ స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం జహీర్ ఖాన్‌కు ఉందని బజ్జీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ బెస్ట్ ఆప్షన్ అని ఇది నా అభిప్రాయమని’ బజ్జీ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్-10 లో జహీర్‌ఖాన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ సీజన్ లోఐపీఎల్100 వికెట్ల క్లబ్బులో చేరిన జహీర్ 11 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్ల పడగొట్టాడు. అయితే భారత జట్టుకు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో జట్టు ప్రధాన కోచ్ కుంబ్లే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అనంతరం జహీర్ కోచ్‌గా చేయడానికి సిద్దం అని చాల సార్లు ప్రకటించాడు. 2011 ప్రపంచ కప్ భారత జట్టు విజయంలో జహీర్ కీలకపాత్ర పోశించాడు. 92 టెస్టులు ఆడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు. ఇక 311 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు.