బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడు: రవిశాస్త్రి | Ravi Shastri wants Bharat Arun as bowling coach, prefers Zaheer Khan as consultant | Sakshi
Sakshi News home page

బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడు: రవిశాస్త్రి

Published Thu, Jul 13 2017 5:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడు: రవిశాస్త్రి

బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడు: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కోచ్‌ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బౌలింగ్‌ కోచ్‌ ఎంపిక పట్ల హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్‌ కోచ్‌గా తీసుకోవాలని రవిశాస్త్రి భావిస్తున్నాడు. గతంలో భారత బృందానికి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలనే పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడటానికి హెడ్‌ కోచ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.  ఈ సందర్భంగా రవిశాస్త్రి బౌలింగ్‌ కోచ్‌ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రవిశాస్త్రి మాట్లాడారు. 'జహీర్‌ ఉత్తమైన బౌలర్‌. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ బౌలింగ్‌  కోచ్‌గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం లేదని' అన్నారు. అనుభవం లేకపోతే ఏంజరుగుతుందో కోచ్‌గా పనిచేసిని కుంబ్లే విషయంలో చూశాం' అని పేర్కొన్నాడు. కానీ భరత్‌ అరుణ్‌ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందన్నాడు. జహీర్‌ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అది సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. ఒక వేళ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా పనిచేయాలని సూచించాడు. అదే విధంగా జహీర్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన​ కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ఖాన్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement