
Bharat Arun Appointed As KKR Bowling Coach: టీమిండియా మాజీ ఆటగాడు, జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. కైల్ మిల్స్ స్థానంలో కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా అరుణ్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు. అరుణ్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని వెంకీ పేర్కొన్నాడు. అరుణ్ నియామకాన్ని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ స్వాగతించాడు. కాగా, రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని హయాంలో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ పేసర్లు అరుణ్ కోచింగ్‌లో రాటు దేలారు.
59 ఏళ్ల అరుణ్ టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, నాలుగు వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో ఇయాన్ సారధ్యంలోని కేకేఆర్ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సీఎస్‌కే చేతుల్లో చతికిలబడడంతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మరోవైపు ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో విండీస్ యోధుడు ఆండ్రీ రస్సెల్, టీమిండియా యువ సంచలనం వెంకటేశ్ అయ్యర్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకున్న కేకేఆర్.. జట్టు కెప్టెన్ మోర్గాన్, కీలక ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, పాట్ కమిన్స్‌లను వేలానికి వదిలేసింది.
చదవండి: ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే!