ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్‌ హిట్టర్‌.. వీడియో వైరల్‌! | Andre Russell Buys New Mercedes Benz AMG Car After IPL 2022 Video | Sakshi
Sakshi News home page

Andre Russell: ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్‌ హిట్టర్‌.. అప్పుడే కలలు నిజమవుతాయంటూ వీడియో!

Published Sat, Jun 11 2022 2:07 PM | Last Updated on Sat, Jun 11 2022 2:15 PM

Andre Russell Buys New Mercedes Benz AMG Car After IPL 2022 Video - Sakshi

ఖరీదైన కారు కొన్న ఆండ్రీ రసెల్‌(PC: Andre Russell Instagram))

IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్‌ హిట్టర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌-2022 నేపథ్యంలో కేకేఆర్‌ రసెల్‌ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో అతడు 12 ఇన్నింగ్స్‌లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్‌) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్‌లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్‌రౌండర్‌. 

ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్‌ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్‌ బెంజ్‌ ఏమ్‌జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్‌ గేల్‌, డారెన్ సమీ, సూర్యకుమార్‌ యాదవ్‌ తదితరులు ఈ ఆల్‌రౌండర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా రసెల్‌ కొన్న ఈ స్టైలిష్‌ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్‌.. పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన విండీస్‌ జట్టులో లేకపోవడం గమనార్హం.   

చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement