PC: IPL.com
ఐపీఎల్-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం(ఏప్రిల్ 28) తలపడనుంది. ఈ క్రమంలో కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ నెట్స్‌తో తీవ్రంగా శ్రమిస్తోన్నాడు. అయితే రస్సెల్ నెట్స్‌లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో కుర్చీను విరగ్గొట్టాడు. రస్సెల్ కొట్టిన భారీ షాట్‌కు కుర్చీ బద్దలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియాను కేకేఆర్ ఇనస్ట్రాగామ్‌లో షేర్ చేసింది. "రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం వేచి ఉండండి" అంటూ క్యాప్షన్ జతచేసింది.
ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ 227 పరుగులు సాధించాడు. దీంట్లో 12 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా అతడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరుకు 10 వికెట్లు పడగొట్టాడు.ఇక కేకేఆర్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. కేవలం 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
చదవండి: IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment