Andre Russell: ఆఖ‌రి ఐదు మ్యాచ్‌ల్లో మా త‌డాఖా ఏంటో చూపిస్తాం.. | KKR VS RR: Andre Russell Vows To Play The Last Five Games As Five Finals | Sakshi
Sakshi News home page

Andre Russell: ఆఖ‌రి ఐదు మ్యాచ్‌ల్లో మా త‌డాఖా ఏంటో చూపిస్తాం..

Published Mon, May 2 2022 6:06 PM | Last Updated on Mon, May 2 2022 9:00 PM

KKR VS RR: Andre Russell Vows To Play The Last Five Games As Five Finals - Sakshi

photo courtesy: IPL

ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో గ‌తేడాది ర‌న్న‌ర‌ప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ పేల‌వ‌ ప్రదర్శన చేస్తోంది. ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు, 6 ప‌రాజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్ర‌ద‌ర్శ‌న గ‌త ఐదు మ్యాచ్‌ల్లో మ‌రీ దారుణంగా ఉంది. ఆ జ‌ట్టు చివ‌రిగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓట‌మిపాలై ప్లే ఆఫ్స్ ఆవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 


ఈ నేప‌థ్యంలో ఇవాళ (మే 2) రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగ‌బోయే కీల‌క మ్యాచ్‌కు ముందు కేకేఆర్ తమ‌ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్‌‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫ్యాన్స్‌కు సందేశమిచ్చాడు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో తాము ఆడాల్సిన చివరి ఐదు మ్యాచ్‌ల‌ను ఐదు ఫైనల్స్‌గా భావిస్తామ‌ని, ఈ మ్యాచ్‌ల్లో త‌మ త‌డాఖా ఏంటో ప్ర‌త్య‌ర్ధుల‌కు చూపిస్తామ‌ని శ‌ప‌థం చేశాడు. తాము ఫ్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాల ఇంకా సజీవంగానే ఉన్నాయ‌ని, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు చివ‌రివ‌ర‌కు త‌మ పోరాటం సాగిస్తామ‌ని పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో త‌మ‌ను ఉత్సాహపరుస్తూ అండ‌గా నిలిచిన‌ అభిమానులకు రసెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదిలా ఉంటే, కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో నిల‌వాలంటే.. వారు ఆడ‌బోయే త‌దుప‌రి ఐదు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. శ్రేయ‌స్ సేన త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో కఠినమైన ప్రత్యర్థుల‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్‌, ఆత‌ర్వాత ప‌టిష్ట‌మైన లక్నో సూపర్ జెయింట్స్‌ (రెండు మ్యాచ్‌లు), సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జ‌ట్ల‌తో కేకేఆర్ త‌ల‌ప‌డాల్సి ఉంది. 

చ‌ద‌వండి: రాజ‌స్థాన్‌పై కేకేఆర్ ప్ర‌తీకారం తీర్చుకునేనా..? గ‌త రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement