
PC: IPL.com
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్ లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రస్సెల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అఖరి ఓవర్ వేసిన రస్సెల్.. 5 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
కాగా ఈ మ్యాచ్‌లో రస్సెల్ కేవలం ఒకే ఒక ఓవర్ మాత్రమే వేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను రస్సెల్ సాధించాడు. గతంలో కేకేఆర్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2019లో రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక ఓవర్ వేసి మూడు వికెట్లు సాధించాడు.
చదవండి: IPL 2022: నో బాల్ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఎమన్నాడంటే..?
Brilliant catch by Rinku Singh in his first match.
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 23, 2022
Andre Russell at his best! pic.twitter.com/Xp0n3aIg7v