బౌలింగ్ కోచ్‌గా ఉండేందుకు సిద్ధమే!
న్యూఢిల్లీ: అవకాశమిస్తే భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తెలిపాడు. ‘భారత బౌలింగ్ కోచ్ అనేది బాధ్యతాయుతమైన పని. ఇప్పటికైతే ఆ ఆలోచన లేకున్నా అవకాశం వస్తే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నా కెరీర్‌లో చేసిన పనే అక్కడా చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా నా సలహాలు కావాలనుకుంటే ఇవ్వడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఇక ఈ విషయమై బీసీసీఐతో మాట్లాడానా? లేదా? అనే విషయం ఇప్పుడు చెప్పలేను’ అని 38 ఏళ్ల జహీర్ తెలిపాడు. భారత్ తరఫున 92 టెస్టు మ్యాచ్‌లాడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు.