'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు' | Dravid and Zaheer are my choice of Indian coach: Harbhajan | Sakshi
Sakshi News home page

'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'

Published Thu, May 19 2016 4:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'

'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'

మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను భారత క్రికెట్ కోచ్ గా  నియమిస్తే బాగుంటుందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో  లాభం జరుగుతుందనేది  తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు

కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా  విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు.  అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement