భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ | Harbhajan and Geeta Basra congratulated by sachin and kohli | Sakshi
Sakshi News home page

భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ

Published Fri, Jul 29 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ

భజ్జీకి కంగ్రాట్స్ : సచిన్, కోహ్లీ

తండ్రిగా ప్రమోషన్ లభించిన టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్కు అభినందల వెల్లువ మొదలైంది. హర్భజన్‌ సింగ్‌ తండ్రి అయిన సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భజ్జీ, గీతా బస్రా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పాపాజీ, మమ్మిజీలకు కంగ్రాట్స్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. వారి జీవితంలో అంతా మంచి జరగాలని, అందరి ఆశీస్సులు ఆ జంటకు ఉంటాయని తన పోస్ట్ లో సచిన్ రాసుకొచ్చాడు.

'భజ్జీ దంపతులు చాలా సంతోషంగా ఉండాల్సిన సమయం. హర్భజన్, గీతా దంపతులకు అభినందనలు. మీ జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని' విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. గీతా బస్రా లండన్లోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించగా ఈ దంపతులకు క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement