ind-aus test
-
వార్నర్‌పై ప్రతీకారం తీర్చుకున్న హర్భజన్
బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మాటల యుద్దమే కాదు.. ట్వీట్టర్ వార్ నడుస్తుంది. ఆసీస్, భారత్ ఆటగాళ్లు పరస్పరం తమ అభిప్రాయాలను ట్వీట్టర్లో పేర్కొంటున్నారు. బెంగళూరు టెస్టులో భారత్ సంచలన విజయం నమోదు చేయడంతో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్‌కు కౌంటర్ ట్వీట్ చేశాడు. పూణే టెస్టులో భారత ఓటమిని గుర్తు చేస్తూ వార్నర్ చేసిన ట్వీట్‌కు ప్రతికారంగా బజ్జీ ఫోటోతో బదులిచ్చాడు. హర్భజన్ సింగ్ గతంలో ఇప్పుడున్న ఆసీస్ జట్టు బలహీనమైనదని, భారత్ ఖచ్చితంగా 4-0 క్లీన్ స్వీప్చేస్తుందని తెలిపాడు. అయితే భారత్ అనుహ్యంగా పుణే టెస్టులో 333 పరుగులు తేడాతో ఓడిపోవడంతో వార్నర్, ఆసీస్ అభిమానులు బజ్జీ అన్న మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో బజ్జీ ‘వెల్డెన్ మై బాయిస్, ఇదే ఊపుతో రెండు టెస్టుల్లో విజయం సాధించాలి’ అని ఓ ఫోటోతో రివేంజ్ ట్వీట్ చేశాడు. IND-1 AUS-1 welldone my boys @BCCI time 2 go up in th series -
స్మిత్‌ది కాదు.. తప్పునాదే : హ్యాండ్స్కాంబ్
బెంగళూరు: రెండో టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుటైన తీరు.. అనంతరం చెలరేగిన వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ అన్నాడు. స్మిత్ రివ్యూ కోసం సలహా అడిగినప్పుడు తనే డ్రెస్సింగ్ గది వైపు చూడాలని చెప్పానన్నాడు. డీఆర్ఎస్ నిబందనలు తెలియకపోవడం వల్లే అలా చేశానని, మంచి ఆటకు పెడర్ధాలు తీయవద్దని ఈ వివాదంపై ట్వీట్ చేశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే మైదానం నుంచి వెళ్లకుండా హ్యాండ్స్ కాంబ్తో చర్చించిన తర్వాత డ్రెస్సింగ్ గది వైపు చేతులతో సైగ చేశాడు. ఈ విషయంలో స్మిత్ పై సర్వత్రా విమర్శలు రావడంతో తన వల్ల తప్పిదం జరిగిందని హ్యాండ్స్ కాంబ్ వెల్లడించాడు. స్మిత్ హద్దులు దాటాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీకి, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయంపై స్మిత్ తన తప్పును అంగీకరించిన విషయం తెలిసిందే. I referred smudga to look at the box... my fault and was unaware of the rule. Shouldn't take anything away from what was an amazing game! — Peter Handscomb (@phandscomb54) 7 March 2017 -
భారత్‌ను అభినందించండి: ఆసీస్ మాజీ కెప్టెన్
బెంగళూరు: రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై భారత్ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్లతో ప్రశంసలు కురిపించారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్ జీనియస్ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్ గొప్ప విజయం సాధించందని, జట్టుకు క్లార్క్ అభినందనలు తెలిపారు. భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్, వాటే సీరీస్ అని ట్వీట్టర్లో పేర్కొన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగాక్కర గ్రేట్ ఫైట్ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్ చేశారు. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఛాంపియన్లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆసీస్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.