స్మిత్‌ది కాదు.. తప్పునాదే : హ్యాండ్స్‌కాంబ్
బెంగళూరు: రెండో టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుటైన తీరు.. అనంతరం చెలరేగిన వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ అన్నాడు. స్మిత్ రివ్యూ కోసం సలహా అడిగినప్పుడు తనే డ్రెస్సింగ్ గది వైపు చూడాలని చెప్పానన్నాడు. డీఆర్‌ఎస్ నిబందనలు తెలియకపోవడం వల్లే అలా చేశానని, మంచి ఆటకు పెడర్ధాలు తీయవద్దని ఈ వివాదంపై ట్వీట్ చేశాడు.
ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే మైదానం నుంచి వెళ్లకుండా హ్యాండ్స్ కాంబ్‌తో చర్చించిన తర్వాత డ్రెస్సింగ్ గది వైపు చేతులతో సైగ చేశాడు. ఈ విషయంలో స్మిత్ పై సర్వత్రా విమర్శలు రావడంతో తన వల్ల తప్పిదం జరిగిందని హ్యాండ్స్ కాంబ్ వెల్లడించాడు. స్మిత్ హద్దులు దాటాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీకి, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయంపై స్మిత్ తన తప్పును అంగీకరించిన విషయం తెలిసిందే.
I referred smudga to look at the box... my fault and was unaware of the rule. Shouldn't take anything away from what was an amazing game!
— Peter Handscomb (@phandscomb54) 7 March 2017