చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు.
అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్‌లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు.
అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్‌తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్‌కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
What just happened? 👀
— FanCode (@FanCode) March 30, 2024
.
.#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov
Comments
Please login to add a commentAdd a comment