మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంకకు ఆతిథ్య బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన శ్రీలంకను బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అజేయ అర్దసెంచరీతో (53), తౌహిద్ హ్రిదోయ్ అజేయమైన 32 పరుగులతో బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ (36), సౌమ్య సర్కార్ (26) కూడా ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు మతీశ పతిరణ ఖాతాలోకి వెళ్లాయి.
అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క భారీ స్కోర్ కూడా నమోదు కాలేదు. అవిష్క ఫెర్నాండో 0, కుశాల్ మెండిస్ 36, కమిందు మెండిస్ 37, సమరవిక్రమ 7, అసలంక 28, మాథ్యూస్ 32 నాటౌట్, షనక 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment