భారత్‌ను అభినందించండి: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ | Ashwin is a genius, says michael Clarke | Sakshi
Sakshi News home page

భారత్‌ను అభినందించండి: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

Published Tue, Mar 7 2017 9:42 PM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

భారత్‌ను అభినందించండి: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ - Sakshi

భారత్‌ను అభినందించండి: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

బెంగళూరు:  రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై భారత్‌ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్‌లతో ప్రశంసలు కురిపించారు. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్‌ జీనియస్‌ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్‌ గొప్ప విజయం సాధించందని, జట్టుకు క్లార్క్‌ అభినందనలు తెలిపారు. భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్‌లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్‌, వాటే సీరీస్‌ అని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగాక్కర గ్రేట్‌ ఫైట్‌ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్‌ చేశారు. భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.  బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రియల్‌ ఛాంపియన్‌లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్‌ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఆసీస్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement