sangakkara
-
కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపా..
న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా పనిచేశాడు. చదవండి: ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణ డౌటే.. -
వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?
కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
2011 ఫైనల్ ఫిక్సయింది!
కొలంబో: శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్ పోరు ఫిక్సయిందన్నారు. దీనిపై అప్పటి లంక సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణలపై ఆధారాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం’ అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రి ఆరోపణలపై జయవర్ధనే ట్విట్టర్లో స్పందించాడు. ‘ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా’ అని చురకలంటించాడు. ఆ ఫైనల్లో అతను సెంచరీ సాధించాడు. అప్పటి సారథి సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్ చేశాడు. ‘మాజీ మంత్రి వద్ద ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి, అవినీతి నిరోధక విభాగానికి సమర్పిస్తే విచారణ చేపట్టేందుకు వీలవుతుంది’ అని అన్నాడు. -
భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే: సంగక్కర
భారత్‌తో గురువారం జరిగే చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచించాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన లంక సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్‌పై కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ప్రస్తుతం యువకులతో కూడిన శ్రీలంక జట్టును నేను ఇష్టపడుతున్నాను. పాక్‌పై సునాయాసంగా నెగ్గి ఊపు మీదున్న భారత్‌పై గెలవాలంటే అంత సులువేమీ కాదు. అటు మాథ్యూస్ ఆడేది అనుమానంగా ఉండటంతో పాటు తరంగపై నిషేధం ఉండడం జట్టును ఇబ్బంది పెట్టేదే’ అని సంగక్కర అన్నాడు. -
శ్రీలంక బౌలర్లను తప్పుబట్టిన సంగక్కర
లండన్: చాంపియన్స్ ట్రోఫిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటుకు కారణమైన శ్రీలంక బౌలర్లను ఆ దేశ మాజీ కెప్టెన్ సంగక్కర తప్పుబట్టాడు. స్లో ఓవర్ రేటు కారణంగా శ్రీలంక తాత్కలిక కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచ్‌లు నిషేదం విదించిన విషయం తెలిసిందే. సీనియర్ బౌలర్లు ఉన్న స్లో ఓవర్ రేటు ఎందుకు వేయాల్సి వచ్చిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ లసిత్ మలింగా, మరో ఇద్దరూ స్సిన్నర్లు ఉన్నా 39 నిమిషాలు మ్యాచ్ ఆలస్యం కావడం ఆహ్వానించదగిన విషయం కాదని ఐసీసీకి రాసిన కాలమ్‌లో సంగక్కర అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ వేగంగా జరిగేందుకు వికెట్ కీపర్, ఫీల్డర్లు కూడా భాగమవ్వాలని సూచించాడు. ఇక దూకుడ మీద ఉన్న భారత్‌ను శ్రీలంక సగర్వంగా ఎదుర్కోవాలన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయం పొందడంతో గురువారం భారత్‌తో జరిగే మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారింది. ఆత్మస్థైర్యంతో సానుకూలంగా భారత్ ఎదుర్కోవాలని సంగక్కర శ్రీలంక ఆటగాళ్లకు సూచించాడు. పాక్‌పై విజయం సాధించి ఊపు మీద ఉన్నభారత్ను ఎదుర్కోవడం అంత సులువు కాదని సంగక్కర అభిప్రాయపడ్డాడు.భారత్ పై గెలవాలంటే 10 ఓవర్లలోపే వికెట్లు తీయాలన్నాడు. ఇక భారత్ బౌలింగ్‌కు అప్రమత్తంగా ఉండాలని, ఈ మధ్య కాలంలో భారత్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని సంగక్కర హెచ్చరించాడు. ముఖ్యంగా పేస్ విభాగం పటిష్టంగా ఉందని, ఇక స్పిన్ వారి అదనపు బలమన్నాడు. ఉపుల్ తరంగపై నిషేదం, కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్‌పై సందిగ్థత నెలకోవడంతో శ్రీలంకకు సానుకూల పరస్థితులు కనబడటం లేదని సంగక్కర పేర్కొన్నాడు. -
భారత్‌ను అభినందించండి: ఆసీస్ మాజీ కెప్టెన్
బెంగళూరు: రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై భారత్ అద్భుతమైన విజయం నమోదు చేయడంతో ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు కోహ్లి సేనపై ట్వీట్లతో ప్రశంసలు కురిపించారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అశ్విన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అశ్విన్ జీనియస్ అని, ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోశించడం గొప్ప విషయం అన్నారు. భారత్ గొప్ప విజయం సాధించందని, జట్టుకు క్లార్క్ అభినందనలు తెలిపారు. భారత్‌లోని అతని అభిమానులందరిని ట్వీట్లతో భారత జట్టును అభినందించాలని సూచించారు. వాటే మ్యాచ్, వాటే సీరీస్ అని ట్వీట్టర్లో పేర్కొన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగాక్కర గ్రేట్ ఫైట్ అని, సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా కోహ్లి సహచరులకు ఉత్సాహం కల్పించడం గొప్ప విషయమని ట్వీట్ చేశారు. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ మధ్యకాలంలో ఇది ఒక గొప్ప విజయమని, జట్టుకు అభినందనలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఛాంపియన్లని భారత జట్టును ప్రశంసిస్తూ ఒక ఫోటోను ట్వీట్ చేశారు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆసీస్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
సచిన్ లేడు.. ద్రవిడ్ ఉన్నాడు!
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు చోటు దక్కలేదు. తాజాగా సంగక్కర విడుదల చేసిన క్రికెట్ ఎలెవన్‌లో భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ ఒక్కడికే స్థానం దక్కింది. భారత్ 'ఏ' టీమ్ కోచ్ గా ఉన్న మిస్టర్ 'డిపెండబుల్'కు సంగక్కర రెండో స్థానం కట్టబెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మన్ మాథ్యూ హేడన్ కు తన జాబితాలో అగ్రస్థానం ఇచ్చాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్ ఉన్నారు. ఎడమ చేతి బ్యాట్సమన్లలో 'ఆల్ టైమ్ ఫేవరేట్' బ్రియన్ లారా కూడా ఈ లిస్టులో చోటు దక్కింది. ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు స్థానం సంపాదించారు. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. సోమవారం న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ప్రకటించిన ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. సంగక్కర క్రికెట్ ఎలెవన్ టీమ్ మాథ్యూ హేడెన్, రాహుల్ ద్రావిడ్, బ్రియన్ లారా, రికీ పాంటింగ్, అరవింద్ డిసిల్వా(కెప్టెన్), జాక్వలెస్ కల్లిస్, ఆడమ్ గిల్‌క్రిస్ట్(వికెట్ కీపర్),షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్, చమిందా వాస్ -
ధోని సరికొత్త రికార్డు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్, ఫాల్కనర్లను స్టంపింగ్ రూపంలో పెవిలియన్ కు పంపిన ధోని.. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యధిక స్టంపింగ్స్(140) చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు సాధించాడు. తద్వారా అంతకుముందు శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగాక్కర అంతర్జాతీయ కెరీర్ లో నెలకొల్పిన 139 స్టంపింగ్స్ రికార్డు చెరిగిపోయింది. తొలుత యువరాజ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్రీజ్ ను వదిలి కొద్దిగా ముందుకు వెళ్లి బంతిని హిట్ చేయబోయి ధోనికి దొరికిపోగా, ఆ తరువాత ఫాల్కనర్ ను తన ప్యాడ్లతో బంతిని వికెట్లపైకి తోసి ధోని సక్సెస్ అయ్యాడు. ధోని చేసిన ఆ రెండు స్టంపింగ్స్ తో నే మ్యాచ్ ఆసీస్ చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోయింది. రెండో ట్వంటీ 20లో ఆసీస్ పై టీమిండియా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0 తేడాతో దక్కించుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) దాటిగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరులో సహకరించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 20.0ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులకే చాపచుట్టేసి ఓటమి చెందింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది. -
సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ:ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సంగక్కర ఒక గొప్ప క్రికెటర్ అని, అతని సేవలను శ్రీలంక క్రికెట్ జట్టు కోల్పోవడం ఒక తీరని లోటేనని మోదీ కొనియాడారు. శ్రీలంక క్రికెట్ ను ఉన్నత స్థాయిలో నిలిపిన సంగక్కర అందరకీ ఆదర్శప్రాయమన్నారు. శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే తో సంయుక్తంగా మీడియా సమావేశానికి హాజరైన మోదీ.. సంగక్కరను మరోసారి గుర్తుచేసుకుంటూ ఈ విధంగా స్పందించారు. 'క్రికెట్ లో గొప్ప ఆటగాళ్లలో సంగక్కర ఒకడు. అతను శ్రీలంకకు అందించిన సేవలు మరువలేనివి. వికెట్ కీపర్ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ గా అమోఘమైన రికార్డును సంగా సొంతం చేసుకున్నాడు. సంగాను క్రికెట్ ఫీల్డ్ లో చూసే అవకాశాన్ని మనమందరం కోల్పోతున్నాం' అని మోదీ ప్రశంసించారు. -
నిలబెట్టే ‘ఇంజినీర్’
ఏడాది కాలంగా అశ్విన్ నిలకడ భారత్ ప్రధానాస్త్రంగా ఎదుగుదల క్రీడా విభాగం శ్రీలంకతో సిరీస్‌లో అశ్విన్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయభ్రాంతులకు గురి చేశాడు. తొలి టెస్టులో 6, 4 వికెట్లు... రెండో టెస్టులో 2, 5 వికెట్లు... మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లతో విజయంలో కీలక పాత్ర. ఈ సిరీస్‌లో సంగక్కరతో పాటు తిరిమన్నెను కూడా అతను నాలుగు సార్లు అవుట్ చేశాడు. ముఖ్యంగా ఎడమచేతి వాటం ఆటగాళ్లు అశ్విన్ బంతుల్ని ఆడలేకపోయారు. సిరీస్ అనంతరం లంక దిగ్గజం సనత్ జయసూర్య మాట్లాడుతూ...‘మా జట్టు సాధారణంగా స్పిన్‌ను బాగా ఆడుతుంది. కానీ స్పిన్ బౌలింగ్ కూడా ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అశ్విన్ చూపించాడు’ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో కలిపి అశ్విన్ 38 వికెట్లు తీశాడు. ప్రాక్టీస్...ప్రాక్టీస్... కెరీర్ ఆరంభంలో సంప్రదాయ ఆఫ్ బ్రేక్ బంతులపైనే దృష్టి పెట్టిన అశ్విన్ తర్వాత వైవిధ్యం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఆర్మ్ బాల్, క్యారమ్ బాల్ టాప్ స్పిన్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఐసీసీ ప్రకారం నిషేధం బారిన పడకుండా ప్రస్తుతం క్రికెట్లో ఉన్న అసలైన ఆఫ్‌స్పిన్నర్‌గా అతను కితాబందుకున్నాడు. అందు కోసం దూస్రాను పక్కన పెట్టేసినా... పరిమిత ఓవర్ల మ్యాచ్‌లతో పోలిస్తే టెస్టుల కోసం అతను తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న అతను శ్రీలంక సిరీస్ కోసం ప్రత్యేకంగా తన సొంత అకాడమీలో సాధన చేశాడు. ‘గత ఏడాది కాలంగా నేను టెస్టుల కోసం ఎంతో కష్టపడ్డాను. టెస్టు మ్యాచ్‌లంటే చిన్న పిల్లల ఆట కాదు. ఆటకు సంబంధించి ప్రతీ చిన్న అంశంపై కూడా పట్టు సాధించాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలని ప్రయత్నించా. అది ఈ సిరీస్‌లో ఫలితాన్ని ఇచ్చింది’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో స్పిన్, బౌన్స్, పేస్... ఇలా మూడు రకాలుగా భిన్నంగా స్పందించిన మూడు వేదికలపై కూడా అతను రాణించడం విశేషం. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇటీవలి తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని అతను చెప్పుకున్నాడు. అత్యుత్తమ దశ భారత అత్యుత్తమ ఓపెనింగ్ బౌలర్ ఎవరు... గత ఐదేళ్లలో ప్రపంచ క్రికెట్లో రెండో అత్యుత్తమ ఓపెనింగ్ బౌలర్ ఎవరు... ఈ రెండింటికి సమాధానం ఒక్కటే. అది ఒక స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కావడం విశేషం. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. 14 ఇన్నింగ్స్‌లలో ఓపెనింగ్ బౌలింగ్ చేసిన అశ్విన్ 21.48 సగటుతో 45 వికెట్లు తీశాడు. నాటి అమర్ సింగ్, కపిల్‌దేవ్‌ల కాలంనుంచి ఇటీవలి పంకజ్ సింగ్ వరకు కూడా ఇదే బెస్ట్. గత ఐదేళ్లలో స్టెయిన్ (20.69) తర్వాత ఒక ఆరంభ బౌలర్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. పేసర్లను వెనక్కి తోసి కొత్త బంతితో కూడా అద్భుతాలు చేయగల అశ్విన్ విలువేమిటో ఇది చూపిస్తుంది. బంతి పాతబడినా, కొత్తదైనా అతను మాయ చేయగలడనేది నిజం. ‘30 టెస్టులు కూడా ఆడక ముందే దాదాపు 150 వికెట్లు తీయడం గొప్ప ప్రదర్శన. ఇలాగే ఆడితే అతను దిగ్గజాలలో ఒకడిగా నిలుస్తాడు’ అని స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ అభిప్రాయ పడ్డారు. సింగిల్ హ్యాండ్ ఒకప్పుడు అనిల్ కుంబ్లే, ఆ తర్వాత హర్భజన్ సింగ్‌లాగే ఇప్పుడు అశ్విన్ భారత జట్టు ప్రధానాయుధం. లంక సిరీస్‌లో లోయర్ ఆర్డర్ వికెట్లతో మరో వైపు మిశ్రా అండగా నిలిచినా... ఇతర సిరీస్‌లలో అశ్విన్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. స్పిన్ వికెట్టే కాదు, కాస్త బౌన్స్ ఉన్నా... మంచి ఫలితం రాబట్టగల నైపుణ్యం అశ్విన్‌లో ఉంది. ఇటీవల ఆస్టేలియాలో జరిగిన సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో 12 వికెట్లు తీసిన అతను ఆ తర్వాత వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాడు. ‘ప్లేయర్ విత్ బ్రెయిన్’ అనేది అతని సన్నిహితులు అశ్విన్ తెలివితేటల గురించి చెప్పే మాట. నిజంగానే అంతర్జాతీయ మ్యాచ్‌లనుంచి ఐపీఎల్ వరకు కీలక సమయాల్లో ఒత్తిడికి తలవంచకుండా అతను అనేక సార్లు తీసిన వికెట్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాయి. కుంబ్లేలాగే తన ఇంజినీరింగ్ విద్య అప్పుడప్పుడు ఆటలోనూ అక్కరకు వచ్చిందని ఈ చెన్నై బౌలర్ సరదాగా చెబుతాడు. అశ్విన్ టెస్టు క్రికెట్లో అడుగు పెట్టి నాలుగేళ్లు కూడా కాలేదు. అతను వచ్చాక భారత్ ఐదు సిరీస్‌ల్లో గెలిచింది. అందులో నాలుగింటిలో అతనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్. భారత్ తరఫున నాలుగు లేదా ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ సిరీస్ గెలిచిన మిగతా ఐదుగురు ఆటగాళ్లు కనీసం 100 టెస్టులు ఆడారు. అశ్విన్ కెరీర్ వయసు ఇంకా 28 టెస్టులే. ఈ గణాంకాలు చాలు అతను భారత టెస్టు విజయాల్లో ఎంత కీలక ఆటగాడో చెప్పడానికి. ఇప్పటి వరకు సొంతగడ్డపైనే చెలరేగుతూ వచ్చిన అశ్విన్... తాజాగా శ్రీలంకలోనూ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత టెస్టు జట్టును ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒంటిచేత్తో నిలబెడుతున్నాడు. బ్యాటింగ్‌లోనూ బహు బాగు శ్రీలంకతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ చేసిన అర్ధ సెంచరీ జట్టు భారీ స్కోరుకు ఉపయోగపడింది. ఈ ఆఫ్ స్పిన్నర్ బ్యాటింగ్ జట్టుకు ఎంతో అండగా మారుతోంది. టెస్టుల్లో 32.44 సగటుతో అతను 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేయడం అతని బ్యాటింగ్ బలాన్ని చూపిస్తుంది. ఈ నైపుణ్యమే కోహ్లి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేలా ప్రోత్సహిస్తోంది. అశ్విన్ బ్యాటింగ్ శైలిని ముచ్చటగా కొంత మంది కామెంటేటర్లు వీవీఎస్ అశ్విన్ అంటూ మెచ్చుకున్నారు. నెట్స్‌లో కూడా బౌలింగ్‌కు ముందే అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. పేస్, స్పిన్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగల అశ్విన్ జూనియర్ క్రికెట్ తరహాలో ఏదో ఒక రోజు టాప్-4లో బ్యాటింగ్ చేయడమే తన లక్ష్యమని చెప్పుకోవడం విశేషం. టాప్-20లోకి ఇషాంత్, పుజారా దుబాయ్: శ్రీలంకతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన భారత ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజారా ఐసీసీ టెస్టు ర్యాం కింగ్స్‌లో టాప్-20లోకి చేరుకున్నారు. బౌలర్ల జాబితాలో మూడు స్థానాలు మెరుగు పర్చుకున్న ఇషాంత్ 18వ స్థానంలో నిలిచాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో నాలుగు స్థానాలు ముందుకు వచ్చిన పుజారా 20వ స్థానంలో నిలిచాడు. అతను టాప్-20లోకి రావడం కెరీర్లో ఇదే తొలిసారి. కోహ్లి 11వ స్థానానికి దిగజారడంతో భారత్‌నుంచి ఒక్కరూ కూడా టాప్-10 జాబితాలో లేరు. సవాల్ సిద్ధంగా ఉంది అశ్విన్ తన 28 టెస్టుల కెరీర్లో 15 సొంతగడ్డపైనే ఆడాడు. ఇక్కడే 24.12 సగటుతో 95 వికెట్లు తీశాడు. అయితే రానున్న దక్షిణాఫ్రికా సిరీస్ అతనికి చాలెంజ్. గతంలో భారత్‌లో పర్యటించిన అన్ని టెస్టు జట్లలోకి దక్షిణాఫ్రికా పటిష్టం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో తన ఏకైన టెస్టు ఆడిన అశ్విన్ 42 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునే సమయం వచ్చింది. రెండో స్పిన్నర్‌గా ఎవరు ఉన్నా... అశ్విన్ ప్రదర్శనపైనే జట్టు ఆధారపడుతుంది. 2012లో అశ్విన్ వైఫల్యం (4 టెస్టుల్లో 14 వికెట్లు) ఇంగ్లండ్ చేతిలో భారత్‌కు సొంతగడ్డపై ఓటమిని మిగిల్చింది. ఈ సారి అలాంటి భంగపాటు ఎదురు కాకుండా అశ్విన్ చెలరేగాలి. లేకపోతే దక్షిణాఫ్రికాను భారత్ ఓడించడం చాలా కష్టం. -
సంగక్కరకు అత్యున్నత పదవి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన కాసేపటికే శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరకు అత్యున్నత పదవి వరించింది. ఇంగ్లండ్‌లో శ్రీలంక హైకమిషనర్‌గా సంగక్కరను నియమించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ మేరకు ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సంగా రిటైరయిన సంగతి తెలిసిందే. భారత్‌తో ఈ రోజు ముగిసిన కొలంబో టెస్టే అతనికి చివరిది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సంగక్కర వీడ్కోలు సభలో పాల్గొన్న సిరిసేన ఈ నియామకాన్ని ప్రకటించారు. 15 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్‌కు సంగా అపార సేవలు అందించాడు. -
విజయంతో ఒకరు.. పరాజయంతో మరొకరు
ప్రపంచ క్రికెట్లో ఇద్దరు యోధుల శకం ముగిసింది. అత్యుత్తమ కెప్టెన్‌గా, బాట్స్‌మన్‌గా మన్నలందుకున్న ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. నిన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్.. ఈ రోజు శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర. తమ చివరి టెస్టు మ్యాచ్‌లో క్లార్క్ విజయంతో.. సంగా పరాజయంతో నిష్ర్కమించారు. చివరి మ్యాచ్ ఫలితాలను పక్కనబెడితే.. ఈ ఇద్దరూ తమ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా చెరగని ముద్ర వేశారు. చివరి మ్యాచ్‌లో ఈ ఇద్దరూ దిగ్గజాలకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో స్వాగతం పలికారు. ఇంతకుముందే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలిగిన సంగా, క్లార్క్‌లు.. టెస్టు క్రికెట్లోనూ బ్యాట్‌ను పక్కనపెట్టేశారు. కాకతాళీయమే అయినా అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెప్పేశారు. పోరాట యోధుడు సంగా: సంగా ఒక పరుగుల యంత్రం. 38 ఏళ్ల సంగా దశాబ్దమన్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముకగా నిలిచాడు. 134 టెస్టుల్లో 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడం విశేషం. ఇక 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. తన కెరీర్లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్లో లోటు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. మేటి సారథి మైకేల్ క్లార్క్: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాక స్వల్ప కాలంలోనే క్లార్క్ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. 34 ఏళ్ల క్లార్క్ 115 టెస్టుల్లో 8643 పరుగులు చేశారు. ఇందులో 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). ఇక 245 వన్డేలాడిన క్లార్క్ 7981 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్లార్క్ తన కెరీర్లో రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగస్వామి అయ్యాడు. పాంటింగ్ తర్వాత ఆసీస్ సారథిగా బాధ్యతలు తీసుకున్న క్లార్క్.. సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం తన కెరీర్లో అత్యంత మధుర క్షణం. -
రహానే తెలివైన బ్యాట్స్‌మన్
అనిల్ కుంబ్లే రెండో టెస్టు మూడు, నాలుగో రోజుల్లో భారత ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శనే వచ్చింది. ఈ ఆటతో చివరి టెస్టుకు 1-1తో వెళ్లగలిగే అవకాశం చిక్కింది. నిజానికి భారత జట్టు తొలి టెస్టులోనే నెగ్గాల్సింది. ఇప్పుడు కోహ్లి బృందానికి ఇంతకన్నా మంచి తరుణం లేదు. మరోవైపు ఆదివారం శ్రీలంక క్రికెట్ తమ దిగ్గజ ఆటగాడి ఆటను చివరిసారిగా చూసేసింది. సంగక్కర తన దేశం తరఫున చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. అయితే కెరీర్లో ఆఖరి టెస్టును విజయంతో ముగించడం అనుమానమే. అయితే మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మైకేల్ క్లార్క్ ఆసీస్ ఓదార్పు విజయంతో కెరీర్‌కు ముగింపు పలికాడు. ఇక నాలుగో రోజు ఆటలో భారత బ్యాటింగ్ మూడో స్థానంలో ఓ కొత్త అధ్యాయానికి సంకేతాలు పంపినట్టయ్యింది. దీంతో రహానే స్థానంపై కొద్దికాలమైనా చర్చలకు తెర పడతాయోమే. ఎందుకంటే అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు మరో సెంచరీ సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రహానే తన అంతర్జాతీయ కెరీర్లో ఇంగ్లండ్, ఆసీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఇలా ఏ దేశంలో ఆడినా పరిస్థితులను చాలా త్వరగా అర్థం చేసుకోగలిగాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానం అటు ఇటూ ఎలా మార్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాణిస్తున్నాడు. సరైన సమయంలో ఓ యువ బ్యాట్స్‌మన్ మూడో స్థానంలో ఆడి శతకం చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. మొత్తానికి ఈ నాలుగు రోజుల బాధ్యతాయుతమైన ఆటతీరును భారత ఆటగాళ్లు వృథా చేసుకోరాదు. ఓ యూనిట్‌గా తొలి ఇన్నింగ్స్‌లో చాలా ఓపిక ప్రదర్శించారు. ఇదే రీతిన చివరి రోజు కూడా చూపితే విరాట్ కోహ్లి తన ఖాతాలో తొలి కెప్టెన్సీ విజయాన్ని అందుకుంటాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌ను కోహ్లి, మ్యాథ్యూస్, స్టీవ్ స్మిత్ రూపంలో నూతన జనరేషన్ తమ చేతుల్లోకి తీసుకోవడంతో మున్ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
ఈసారి వదలొద్దు!
చేజేతులా తొలి టెస్టును జారవిడుచుకున్న భారత్‌కు లంక గడ్డపై గెలిచేందుకు మరో అవకాశం వచ్చింది. రహానే సూపర్ బ్యాటింగ్‌కు తోడు అశ్విన్ స్పిన్ మాయాజాలంతో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. లంక విజయానికి ఇంకా 341 పరుగులు అవసరంకాగా, భారత్ విజయానికి 8 వికెట్లు మాత్రమే చాలు. పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తుం డటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోవద్దని కోహ్లి సేన పట్టుదలతో ఉంది. కొలంబో: అజింక్యా రహానే (243 బంతుల్లో 126; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో రెండో టెస్టులో భారత్... శ్రీలంక ముందు 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి కరుణరత్నే (25 బ్యాటింగ్), కెప్టెన్ మ్యాథ్యూస్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 70/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 91 ఓవర్లలో 8 వికెట్లకు 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానేకు తోడు విజయ్ (133 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లలో ప్రసాద్, కౌశల్ చెరో 4 వికెట్లు తీశారు. నమన్ ఓజా, కరుణ్లకు పిలుపు కండరాల గాయంతో తొలిటెస్టుకు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్‌కి రెండో టెస్టు సందర్భంగా మళ్లీ గాయం తిరగబెట్టింది. ఫలితంగా ఈ నెల 28 నుంచి జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండటంలేదు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా కండరాల గాయంతో మూడో టెస్టుకు దూరమ య్యాడు. వీరిద్దరి స్థానాల్లో నమన్ ఓజా, కరుణ్ నాయర్లను మూడో టెస్టుకోసం ఎంపిక చేశారు. నాలుగు రోజుల పాటు మంచి క్రికెట్ ఆడాం. ఇక ఐదో రోజు మరింత ఓపికగా ఉండాలి. ఇది చాలా కీలకం. ఎందుకంటే పిచ్ బాగా నెమ్మదైంది. కాబట్టి మంచి భాగస్వామ్యాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్క సెషన్ మేం బాగా ఆడగలిగితే మ్యాచ్ గెలిచినట్లే. నాలుగో రోజు మంచి భాగస్వామ్యాలను ఏర్పర్చడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాం. విజయ్ బాగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ గురించి చాలా చర్చించుకున్నాం. రోహిత్, నా మధ్య నెలకొన్న భాగస్వామ్యం కూడా చాలా కీలకమైంది. -రహానే (భారత బ్యాట్స్‌మన్) సెషన్ 1 ఆ ఇద్దరి ఆధిపత్యం... ఈ సెషన్లో మొదటి గంట ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రహానే, విజయ్‌లు ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... తర్వాత బ్యాట్లు ఝళిపించారు. ఈ క్రమంలో 36వ ఓవర్లో విజయ్ 104 బంతుల్లో 11వ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆ వెంటనే రహానే 118 బంతుల్లో 8వ అర్ధశతకం సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్‌కు 13.4 ఓవర్లలో 68 పరుగులు సమకూరాయి. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 46వ ఓవర్లో కౌశల్ విడగొట్టాడు. విజయ్ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన కెప్టెన్ కోహ్లి (10) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో లంచ్‌కు కొద్ది ముందు అవుటయ్యాడు. అయితే రోహిత్ శర్మ (34), రహానే మరో వికెట్ పడకుండా 179/3 స్కోరుతో లంచ్‌కు వెళ్లారు. ఓవర్లు: 27; పరుగులు: 109; వికెట్లు: 2 సెషన్ 2 కొనసాగిన జోరు... వీలైనంత త్వరగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో లంచ్ తర్వాత రహానే, రోహిత్ వేగంగా ఆడారు. కానీ లంక బౌలర్ కౌశల్ రౌండ్ ది వికెట్‌తో ఈ జోడిని కట్టడి చేశాడు. దీంతో రన్‌రేట్ ఓవర్‌కు మూడు పరుగుల కంటే తక్కువగా నమోదైంది. ఈ క్రమంలో 67వ ఓవర్లో రహానే 212 బంతుల్లో కెరీర్లో 4వ శతకం పూర్తి చేశాడు. ఇదే ఓవర్లో భారత్ 300 స్కోరునూ అందుకుంది. తర్వాత ఈ ఇద్దరు అటాకింగ్‌కు దిగినా... మూడు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరు అవుటయ్యారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ దశలో బిన్నీ (17)తో జతకలిసిన సాహా (13 నాటౌట్) కొద్దిసేపు ఆడిన తర్వాత కాలిపిక్క కండరం పట్టేయడంతో రిటైర్‌హర్ట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అశ్విన్ (19)... బిన్నీకి చక్కని సహకారం అందిస్తూ మరో వికెట్ పడకుండా సెషన్ ముగించాడు. ఓవర్లు: 26; పరుగులు: 104; వికెట్లు: 2 సెషన్ 3 అశ్విన్ అదుర్స్... టీ తర్వాత తొలి బంతికే బిన్నీ అవుట్‌కాగా... మిశ్రా (10) బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో ఎండ్‌లో అశ్విన్ రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో భారత్‌కు 400 పరుగుల స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఏడో వికెట్‌కు 28 పరుగులు జోడించాక అశ్విన్ వెనుదిరిగాడు. ఈ దశలో సాహా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చినా... 89వ ఓవర్లో మిశ్రాను ప్రసాద్ బోల్తా కొట్టించాడు. ఉమేశ్ (4 నాటౌట్), సాహాలు కొద్దిసేపు ఆడిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లంకను అశ్విన్ దెబ్బతీశాడు. ఉమేశ్‌తో కలిసి బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ మూడో ఓవర్లోనే సిల్వ (1)ను వెనక్కిపంపాడు. దీంతో లంక స్కోరు 8/1గా మారింది. సంగక్కర (18) నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేసినా... మళ్లీ అశ్విన్‌కే వికెట్‌ను సమర్పించుకున్నాడు. కరుణరత్నేతో కలిసి రెండో వికెట్‌కు అతను 25 పరుగులు జోడించాడు. సాహా స్థానంలో రాహుల్ కీపింగ్ చేశాడు. మ్యాథ్యూస్, కరుణరత్నేలు మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఓవర్లు: 9; పరుగులు: 42; వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 21; పరుగులు: 72; వికెట్లు: 2 (శ్రీలంక) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 393 ఆలౌట్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 306 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 82; రాహుల్ (బి) ప్రసాద్ 2; రహానే (సి) చండిమల్ (బి) కౌశల్ 126; కోహ్లి ఎల్బీడబ్ల్యు (బి) కౌశల్ 10; రోహిత్ (సి) ముబారక్ (బి) కౌశల్ 34; బిన్నీ (సి) తిరిమన్నే (బి) ప్రసాద్ 17; సాహా నాటౌట్ 13; అశ్విన్ (సి) చండిమల్ (బి) ప్రసాద్ 19; మిశ్రా (సి) ముబారక్ (బి) ప్రసాద్ 10; ఉమేశ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (91 ఓవర్లలో 8 వికెట్లకు) 325 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1-3; 2-143; 3-171; 4-256; 5-262; 6-283; 7-311; 8-318. బౌలింగ్: ప్రసాద్ 15-0-43-4; హెరాత్ 29-4-96-0; చమీరా 14-0-63-0; మ్యాథ్యూస్ 2-1-1-0; కౌశల్ 31-1-118-4. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సిల్వ (సి) బిన్నీ (బి) అశ్విన్ 1; కరుణరత్నే బ్యాటింగ్ 25; సంగక్కర (సి) విజయ్ (బి) అశ్విన్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 72. వికెట్ల పతనం: 1-8; 2-33. బౌలింగ్: అశ్విన్ 10-5-27-2; ఉమేశ్ 2-0-10-0; ఇషాంత్ 4-0-18-0; మిశ్రా 5-1-13-0. -
సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్
♦ నేటినుంచి రెండో టెస్టు ♦ సంగక్కరకు ఇదే ఆఖరి మ్యాచ్ ♦ ఉత్సాహంగా మ్యాథ్యూస్ సేన ♦ ఒత్తిడిలో కోహ్లి అండ్ కో క్రికెట్ ప్రపంచానికి మరో దిగ్గజం వీడ్కోలు పలుకుతున్న వేళ ఇది. దశాబ్దంన్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచి అత్యుత్తమ విజయాలు అందించిన సంగ చివరి సారి మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపుతో అతని కెరీర్‌కు ఘనమైన ముగింపు పలకాలని సహచరులు భావిస్తున్నారు. మరో వైపు తొలి టెస్టులో అంది వచ్చిన విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ సొంతం చేసుకునేందుకు ఆశలు మిగిలి ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. కొలంబో : దూకుడుగా ఆడతారా లేక జాగ్రత్తగా ఇన్నిం గ్స్ నడిపిస్తారా...స్పిన్‌పై ఎదురు దాడి చేస్తారా లేక పేస్పై ప్రతాపం చూపిస్తారా... ఏమైనా చేయండి కానీ మ్యాచ్ నెగ్గాలి. రెండో టెస్టుకు ముందు భారత జట్టు ఆలోచనా తీరు ఇది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయంతో షాక్ తిన్న టీమిండియా తమ పరువు నిలబెట్టుకునేందుకు బరి లోకి దిగుతోంది. మరో వైపు సంగక్కరకు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న శ్రీలంక కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటినుంచి (గురువారం) భారత్, శ్రీలంకల రెండో టెస్టు కోసం ఇక్కడి సారా ఓవల్ మైదానం సిద్ధమైంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోతుంది. బిన్నీకి చోటుందా! భారత జట్టు ప్రధానంగా రెండు మార్పులతో ఆడే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ గాయంతో సిరీస్‌కు దూరం అయ్యాడు. అయితే ఏడాదిన్నరగా అంతే జోరు చూపించిన విజయ్... గాయం నుంచి కోలుకొని మ్యాచ్‌కు సిద్ధం కావడం శుభ పరిణామం. రాహుల్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. బుధవారం విజయ్ నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఎన్ని విమర్శలు వచ్చినా కెప్టెన్ కోహ్లి, శాస్త్రి తమ నమ్మకాన్ని కొనసాగిస్తూ రోహిత్‌కు మూడో స్థానంలో మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక హడావిడిగా పిలిపించిన స్టువర్ట్ బిన్నీకి తుది జట్టులో స్థానం లభించవచ్చు. సారా ఓవల్ వికెట్ పేస్‌కు కాస్త అనుకూలిస్తుంది. పైగా గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఘోర వైఫల్యం దృష్ట్యా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు జట్టుకు అవసరం. కాబట్టి హర్భజన్ సింగ్ స్థానంలో బిన్నీ రావచ్చు. ఇక మరో సారి అశ్విన్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది. ప్రదీప్ అవుట్ మరో వైపు లంక ఓపెనర్లు కరుణరత్నే, కౌశల్ సిల్వ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అయితే చాన్నాళ్లుగా నిలకడగా రాణించిన వీరిద్దరిపై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకముంచింది. ఇక తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న సంగక్కర మరో సారి తనకిష్టమైన మైదానంలో (50.29 సగటుతో 855 పరుగులు) చిరస్మరణీయ ఆటతీరు కనబరుస్తాడా చూడాలి. పాక్‌తో సిరీస్‌లో విఫలమై ఓటమిలో భాగమైన సంగ ఈ సారి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలగా ఉన్నాడు. మ్యాథ్యూస్ సహా మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. పేసర్ నువాన్ ప్రదీప్ గాయంతో మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో చమీరా లేదా విశ్వ చోటులోకి రావచ్చు. సారా ఓవల్ పిచ్‌ను చూస్తే లంకలో ప్రస్తుతం ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న చమీరాకు అవకాశం దక్కవచ్చు. ఇక గత ప్రదర్శనతో హెరాత్ జోరు మీదుండగా, కౌశల్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహు ల్, రోహిత్, రహానే, సాహా, హర్భజన్/బిన్నీ, అశ్విన్, ఇషాంత్, మిశ్రా, ఆరోన్. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టె న్), కరుణరత్నే, సిల్వ, సంగక్కర, తిరిమన్నె, చండీమల్, ప్రసాద్, హెరాత్, కౌశల్, చమీరా/విశ్వ. ఉ. గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం శ్రీలంకలోని ఇతర మైదానాలతో పోలిస్తే సారా ఓవల్ ప్రతీసారి పేసర్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. అయితే కాస్త బౌన్స్ కూడా ఎక్కువగా ఉండి స్పిన్నర్లు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ జరిగే అన్ని రోజులూ వర్ష సూచన ఉంది. సారా ఓవల్‌లో జరిగిన 18 టెస్టుల్లో 14 మ్యాచ్‌లలో ఫలితం వచ్చింది. ఇక్కడ లంకతో 2 టెస్టుల్లో ఓడి ఒకటి గెలిచిన భారత్... చివరి సారి ఆడిన మ్యాచ్‌లో ప్రత్యర్థిపై గెలుపొందింది. తొలి టెస్టు ఓడి భారత్ సిరీస్ గెలవడం గతంలో రెండు సార్లు (1972, 2001) మాత్రమే జరిగింది. గత పది టెస్టుల్లో ఇక్కడ 7 సార్లు తొలి సారి బ్యాటింగ్ చేసిన జట్టు ఓడింది. -
పుజారాని ఆడించాలి
శ్రీలంకలోని పురాతనమైన వేదికల్లో పి.సారా ఓవల్ కూడా ఒకటి. సంగక్కర సొంత క్లబ్ మైదానం కూడా. అందుకే ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలు ఉంటాయి. ఈ మైదానంలోనే సంగ ఎదిగాడు. కాబట్టి అతనికి ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. అద్భుతమైన కెరీర్‌ను సొంత ప్రేక్షకుల ముందు ముగించే అవకాశం ప్రతి క్రికెటర్‌కు లభించదు. నిస్సందేహంగా సంగక్కర గొప్ప ఆటగాడు. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. సంగ ఫిట్నెస్, సామర్థ్యం, ఆటపై అతనికి ఉన్న మక్కువకు సలాం చేయాల్సిందే. ఓ బౌలర్‌గా నేనూ సంగక్కర నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. అతనికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఓ సవాలే. కాలంతో పాటు అతనూ పరిణతి చెందాడు. ఫలితంగా గత 2-3 ఏళ్ల నుంచి కెరీర్లోనే ఉత్తమ క్రికెట్ ఆడుతున్నాడు. మైదానం లోపలా, బయటా సంగక్కరది చాలా మంచి వ్యక్తిత్వం. మరో పాత్రలో అతను క్రికెట్‌కు తన సేవలందించి రుణం తీర్చుకుంటాడని భావిస్తున్నా. సంగక్కరతో పాటు అతని కుటుంబానికి నా శుభాకాంక్షలు. ఇక రెండో టెస్టు విషయానికొస్తే భారత జట్టు సన్నాహాకాలు అంత బాగా లేవు. తొలి టెస్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ధావన్ గాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. ఆల్‌రౌండర్ బిన్నీ లంక వెళ్లాడు. విరాట్, జట్టు మేనేజ్మెంట్ బిన్నీని బ్యాట్స్‌మన్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఐదో బౌలర్‌గా అతన్ని ఉపయోగించుకోవాలనుకుంటే... తొలి టెస్టులో ఐదో బౌలర్ అవసరం అంతగా రాలేదు. కాబట్టి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉంటే బాగుండేది. మిగతా బౌలర్లు అశ్విన్‌కు సరైన సహకారం అందిస్తే మరింత బాగుంటుంది. జట్టులో ఒక్కరి వ్యక్తిగత ప్రదర్శన వల్ల మ్యాచ్ గెలవలేరు. జట్టు మొత్తం సమష్టిగా రాణించి సిరీస్‌లో పుంజుకోవాలి. మురళీ విజయ్ ఫిట్నెస్ పరీక్ష పాస్ కాకుంటే కచ్చితంగా పుజారాను ఆడించాలి. ఓవల్ వికెట్ చాలా కఠినంగా ఉంటుంది. ఇది లంకకు అనుకూలంగా మారుతుంది. సంగక్కర, మ్యాథ్యూస్‌లు కుదురుకుంటే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇప్పుడు లంకేయులు సంగక్కర రిటైర్మెంట్, విజయం అనే రెండు అంశాలపై దృష్టి పెడతారు. కాబట్టి భారత్ కేవలం ఆటపైనే దృష్టిసారించాలి. గాలెలో మాదిరిగా ఆట ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు బిగించి మంచి ముగింపు ఇవ్వాలి. -
సలామ్ సంగ
భారత్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్న సంగక్కర రెండో టెస్టే ఈ దిగ్గజానికి ఆఖరిది అతనో పరుగుల యంత్రం. దశాబ్దం న్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముక. పోరాట యోధుడు. సహచరులంతా పెవిలియ న్కు క్యూ కడుతున్నా, ఆఖరి బంతి వరకు అభిమా నుల ఆశలను నిలబెట్టడానికి పోరాడతాడు. అందుకే సంగక్కర బ్యాటింగ్ అంటే శ్రీలంక ఊగిపో తుంది. ప్రత్యర్థులు ఒకటికి రెండుసార్లు వ్యూహాలను సరిచూసుకుంటారు. అలాంటి దిగ్గజం అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే వన్డేల నుంచి తప్పుకున్న సంగ... భారత్‌తో రెండో టెస్టు తర్వాత పూర్తిగా రిటైర్ కాబోతున్నాడు. క్రీడావిభాగం సంగక్కరకు పరుగుల దాహం ఎక్కువ. అతను టెస్టుల్లో చేసిన 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడమే దీనికి నిదర్శనం. ఓ మైలురాయిని దాటగానే చాలా మంది క్రికెటర్లలా సంబరపడిపోడు. మరింత బాధ్యతగా ఆడతాడు. ఈ లక్షణమే అతణ్ని శ్రీలంక క్రికెట్లో ‘ఆల్‌టైమ్ గ్రేట్’ లలో ఒకడిగా నిలబెట్టింది. నిజానికి సంగక్కరలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. 37 ఏళ్ల వయసులో 2014లో అతను అసాధారణంగా పరుగులు చేశాడు. 72 సగటుతో ఏకంగా 1438 టెస్టు పరుగులు సాధించాడు. అందుకే అతను మిగిలిన ఫార్మాట్ల నుంచి రిటైరైనా టెస్టుల్లో మాత్రం కొనసాగాలని శ్రీలంక బోర్డు విజ్ఞప్తి చేసింది. అయినా అతను అంగీకరించలేదు. నిస్వార్థుడు... తన కెరీర్లో సంగక్కర ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లని పట్టించుకోలేదు. సొంత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేశాడు. అందుకే రిటైర్మెంట్ విషయంలోనూ ఎవరి మాటా వినలేదు. నిజానికి తను ఏడాది క్రితమే రిటైర్ అవ్వాలనుకున్నాడ ట. బోర్డుకు ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలపాలని భావించాడు. అయితే అనుకోకుండా అదే సమయంలో జయవర్ధనే రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఆ విషయాన్ని మహేళ తొలుత సంగక్కరకే చెప్పాడట. దీంతో సంగక్కర తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. ‘ఒకేసారి ఇద్దరు సీనియర్ క్రికెటర్లు తప్పుకుంటే జట్టుపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మహేళ నిర్ణయం వినగానే నేను ఓ ఏడాది ఆడాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పడం శ్రీలంక క్రికెట్ గురించి అతనెంత ఆలోచిస్తాడో చెప్పడానికి ఉదాహరణ. ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) తర్వాత ఉన్న ముగ్గురూ 13 వేల పైచిలుకు పరుగులు చేశారు. ప్రస్తుతం సంగక్కర ఖాతాలో 12,305 పరుగులు ఉన్నాయి. మరో రెండేళ్లు క్రికెట్ ఆడితే సచిన్‌ను అధిగమించకపోయినా... సచిన్‌కు చేరువలోకి వస్తాడు. ఈ జాబితాలో రెండో స్థానానికి చేరతాడు. అలాగే ఒక్క డబుల్ సెంచరీ కొడితే బ్రాడ్‌మన్ సరసన నిలుస్తాడు. ఈ రికార్డులేవీ తనని ఊరించలేదు. ‘ఓ రెండేళ్లు ఆడితే మహా అయితే మరికొన్ని రికార్డులు వస్తాయి. కానీ వాటికోసం నా కెరీర్‌ను పొడిగించుకోవడం అర్థంలేని విషయం. నేను పూర్తిస్థాయిలో నా జట్టుకు న్యాయం చేసే సత్తాతో ఆడగలనా లేదా అనే విషయం నాకే ఎక్కువగా తెలుస్తుంది. నా సహచరుల కళ్లలోకి ధైర్యంగా చూస్తూ మాట్లాడేలా నా ఆట ఉండాలి. కాబట్టి ఇప్పుడు రిటైర్ కావడమే సరైన నిర్ణయం’ అన్న సంగక్కర మాటలు తనెంత గొప్పగా ఆలోచిస్తాడో చెప్పడానికి నిదర్శనం. మార్కు చూపిస్తాడా! తను వెళ్లే ముందు తన మార్కును చూపించడం సంగకు అలవాటు. టి20 ఫార్మాట్‌కు టైటిల్ సాధించి వీడ్కోలు చెప్పాడు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. తన ఆఖరి టోర్నీ ప్రపంచకప్‌లో వరుస మ్యాచ్‌లలో ఈ నాలుగు శతకాలు చేయడం విశేషం. త నలో ఇంకా చాలా సత్తా ఉందనడానికి ఇది నిదర్శనం. అలాగే టెస్టుల నుంచి కూడా తన మార్కు చూపించే వెళతాడు. మరో రెండు డబుల్ సెంచరీలు కొడితే డాన్ బ్రాడ్‌మన్ (12) రికార్డును అధిగమిస్తాడు. రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టడం తేలికేం కాదు. అయితే అది సంగక్కర లాంటి యోధుడికి అసాధ్యం కూడా కాదు. తన చివరి టెస్టు సిరీస్‌ను చిరస్మరణీయంగా మలచుకోవాలని సంగ కోరుకోవడంలో తప్పు లేదు. అటు శ్రీలంక జట్టు సహచరులు కూడా తమ దిగ్గజం కోసం భారత్‌తో తొలి రెండు టెస్టులు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..! భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం రిటైర్మెంట్ తర్వాత సంగక్కర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కౌంటీలు, ఐపీఎల్ లాంటి టోర్నీలు తను ఇంకా ఆడే అవకాశం ఉంది. అయితే స్వదేశంలో క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించగల సత్తా తనలో ఉందని, బోర్డు అనుమతిస్తే ఆ బాధ్యతలు తీసుకుంటానని అంటున్నాడు. మరోవైపు తన ప్రియ మిత్రుడు జయవర్దనేతో కలిసి ఇప్పటికే ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. ఇద్దరి భాగస్వామ్యంలో మరిన్ని వ్యాపారాలు రాబోతున్నాయి. -
భారత్ సిరీస్‌తో సంగక్కర గుడ్‌బై
కొలంబో : స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర స్పష్టం చేశాడు. ఆగస్టులో జరిగే మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో టెస్టే తనకు ఆఖరిదని చెప్పా డు. ‘ప్రపంచ కప్ తర్వాతే వీడ్కోలు చెబుదామని సిద్ధమయ్యా. కానీ సెలక్టర్ల విజ్ఞప్తి మేరకు కొనసాగా. నాలుగు టెస్టులు ఆడేందుకు ఒప్పుకున్నా. కాబట్టి భారత్‌తో రెండు టెస్టులు మాత్రమే ఆడతా’ అని సంగ పేర్కొన్నాడు. -
భారత్‌తో తొలి టెస్టే ఆఖరిది!
ముందే రిటైర్ కానున్న సంగక్కర కొలంబో : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనుకున్న సమయంకంటే రెండు టెస్టుల ముందే తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే లంక బోర్డుకు తెలియజేసిన సంగ, మంగళవారం దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలి ప్రపంచకప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన సంగక్కర... సొంతగడ్డపై రెండు టెస్టు సిరీస్‌ల తర్వాత పూర్తి స్థాయిలో రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. శ్రీలంక జట్టు పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్, భారత్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రేతో కాంట్రాక్ట్ కారణంగా నాలుగు టెస్టులు ఆడిన వెంటనే నిష్ర్కమించాలని భావిస్తున్నాడు. దాంతో పాక్‌తో మూడు టెస్టుల తర్వాత భారత్‌తో గాలేలో జరిగే తొలి టెస్టు సంగక్కర కెరీర్లో చివరిది కానుంది. 130 టెస్టుల్లో 12,203 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న సంగక్కర, మరో డబుల్ సెంచరీ చేస్తే బ్రాడ్‌మన్ (12) రికార్డును సమం చేస్తాడు. -
దిగ్గజాల వీడ్కోలు
ఒకటి, రెండేళ్లు కాదు... సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆ ఇద్దరు శ్రీలంక క్రికెట్ బాధ్యతలు మోశారు. విజయాల్లో, పరాజయాల్లో అండగా, తోడుగా నిలిచారు. రికార్డు భాగస్వామ్యాల్లో కలిసి సాగారు. సీనియర్లు తప్పుకున్న దశలో జట్టును నిలబెట్టి...ఆ తర్వాత జూనియర్లకు దిశానిర్దేశం చేశారు. గత పదిహేనేళ్ల కాలంలో సంగక్కర, జయవర్ధనే లేని లంక జట్టును ఊహించలేము. మైదానం బయట కూడా ‘బెస్ట్ ఫ్రెండ్స్’, వ్యాపార భాగస్వాములు అయిన సంగక్కర, మహేల బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికారు. టెస్టులనుంచి గత ఆగస్టులోనే తప్పుకున్న జయవర్ధనే కెరీర్ ఇప్పుడు పూర్తిగా ముగియగా... ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో టెస్టు సిరీస్ తర్వాత సంగక్కర కూడా పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నాడు. కళాత్మక బ్యాటింగ్ నైపుణ్యమే కాదు... పోరాటపటిమకు, పట్టుదలకు మారుపేరుగా వీరు లంక క్రికెట్ స్థాయిని పెంచారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తమ అద్భుత ఆటతో ఆదుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సమఉజ్జీలుగా నిలిచారు. ఇద్దరు దిగ్గజాలు తప్పుకోవడం లంకకే కాదు ప్రపంచ క్రికెట్‌కూ తీరని లోటు. ఇకపై ఆ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టునుంచి రావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ దిగ్గజాలు ఓటమితో నిరాశగా కెరీర్‌ను ముగించడం బాధాకరం. రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఆటగాళ్లు అభినందలు తెలిపారు. ఇటు వన్డేలు, అటు టెస్టుల్లోనూ ఇద్దరు ఆటగాళ్లు జంటగా నెలకొల్పిన భాగస్వామ్యాలు చూస్తే సంగక్కర, జయవర్ధనేలు రెండో అత్యుత్తమ జోడీగా నిలుస్తారు. వన్డేల్లో వీరిద్దరి మధ్య 151 ఇన్నింగ్స్‌లలో 41.61 సగటుతో 5992 పరుగులు వచ్చాయి. ఇందులో 15 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. టెస్టుల్లో ఈ ఇద్దరు కలిసి 120 ఇన్నింగ్స్‌లలో 56.50 సగటుతో 6554 పరుగులు జత చేశారు. వీటిలో 19 శతక భాగస్వామ్యాలు ఉండటం విశేషం. - సాక్షి క్రీడావిభాగం వన్డే కెరీర్ రికార్డ్ వన్డేలు పరుగులు సగటు అత్యధిక స్కోరు 100 50 సంగక్కర 404 14234 41.98 169 25 93 జయవర్ధనే 448 12650 33.37 144 19 77 -
సంగక్కర ‘డబుల్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కర (306 బంతుల్లో 203; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ మోత మోగించడంతో... ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాథ్యూస్ సేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. చండిమల్ (143 బంతుల్లో 67; 8 ఫోర్లు) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. లాథమ్ (9 బ్యాటింగ్), రూథర్‌ఫోర్డ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఇంకా 113 పరుగులు వెనుకబడి ఉంది. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్ సెంచరీలతో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకుముందు 78/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఆట కొనసాగించిన లంక ఇన్నింగ్స్‌కు సంగక్కర వెన్నెముకగా నిలిచాడు. అటాకింగ్‌ను పక్కనబెట్టి ఓపికగా ఏడు గంటల పాటు బ్యాటింగ్ చేసి కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చండిమల్ కూడా నిలకడను చూపడంతో ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. అయితే చండిమల్ అవుటైన తర్వాత లంక ఇన్నింగ్స్‌లో తడబాటు మొదలైంది. సహచరులు అవుటవుతున్నా... సంగక్కర మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. -
సంగక్కర డబుల్ సెంచరీ
►తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 533/9 డిక్లేర్డ్ ►రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 4/1 గాలే: ఇటీవలి కాలంలో పరుగుల యంత్రంగా మారిన శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర బ్యాట్ నుంచి మరో అద్భుత ఇన్నింగ్స్ నమోదైంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సంగక్కర డబుల్ సెంచరీ (425 బంతుల్లో 221; 24 ఫోర్లు)తో చెలరేగాడు. ఇది అతడి కెరీర్లో 10వ ద్విశతకం కావడం విశేషం. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (12) మాత్రమే ఇంతకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేశారు. ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను శనివారం 140.5 ఓవర్లలో 533/9 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసి 82 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (188 బంతుల్లో 91; 9 ఫోర్లు; 1 సిక్స్) కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. సయీద్ అజ్మల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. అంతకుముందు 252/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో లంక నాలుగో రోజు ఆట ప్రారంభించగా తొలి బంతికే సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను రెహ్మాన్ వదిలేశాడు. అయితే అదే ఓవర్ నాలుగో బంతికి జయవర్ధనే (112 బంతుల్లో 59; 7 ఫోర్లు) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మాథ్యూస్‌తో కలిసి సంగ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. నాలుగో వికెట్‌కు వీరు 181 పరుగులు జోడించారు. -
కోలుకున్న శ్రీలంక
హెడింగ్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే (55 బ్యాటింగ్), కెప్టెన్ మ్యాథ్యూస్ (24 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సంగక్కర (55), కరుణ రత్నే (45) రాణించారు. మొయిన్ అలీ, ప్లంకెట్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. చేతిలో 4 వికెట్లు ఉన్న లంక ప్రస్తుతం 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 320/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో మ్యాథ్యూస్, ఎరాంగ చెరో 4 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో భారీ స్కోరు దిశగా పయనమైనా...లంక కట్టడి చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 108 పరుగులకే పరిమితమైంది. -
వారిది సరైన నిర్ణయం
సంగక్కర, జయవర్ధనేల రిటైర్మెంట్పై రణతుంగ కొలంబో: శ్రీలంక క్రికెటర్లు సంగక్కర, మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నారు. ఇటీవల శ్రీలంక విజేతగా నిలిచిన టి20 ప్రపంచకప్ సందర్భంగా టోర్నీ మధ్యలోనే వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించారంటూ సంగ, జయవర్ధనేలపై లంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌తో స్వదేశానికి చేరుకున్న అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు మీడియా తో మాట్లాడుతూ.. బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే రణతుంగ మాత్రం బోర్డు అభిప్రాయంతో విభేదించారు.