సంగక్కర డబుల్ సెంచరీ | Kumar Sangakkara's list of double hundreds in Tests | Sakshi
Sakshi News home page

సంగక్కర డబుల్ సెంచరీ

Published Sun, Aug 10 2014 1:16 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

సంగక్కర డబుల్ సెంచరీ - Sakshi

సంగక్కర డబుల్ సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 533/9 డిక్లేర్డ్
రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్  4/1

గాలే: ఇటీవలి కాలంలో పరుగుల యంత్రంగా మారిన శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర బ్యాట్ నుంచి మరో అద్భుత ఇన్నింగ్స్ నమోదైంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సంగక్కర డబుల్ సెంచరీ (425 బంతుల్లో 221; 24 ఫోర్లు)తో చెలరేగాడు. ఇది అతడి కెరీర్‌లో 10వ ద్విశతకం కావడం విశేషం. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (12) మాత్రమే ఇంతకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేశారు. ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను శనివారం 140.5 ఓవర్లలో 533/9 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసి 82 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (188 బంతుల్లో 91; 9 ఫోర్లు; 1 సిక్స్) కొద్దిలో సెంచరీని కోల్పోయాడు.

సయీద్ అజ్మల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. అంతకుముందు 252/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో లంక నాలుగో రోజు ఆట ప్రారంభించగా తొలి బంతికే సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను రెహ్మాన్ వదిలేశాడు. అయితే అదే ఓవర్ నాలుగో బంతికి జయవర్ధనే (112 బంతుల్లో 59; 7 ఫోర్లు) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మాథ్యూస్‌తో కలిసి సంగ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. నాలుగో వికెట్‌కు వీరు 181 పరుగులు జోడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement