సంగక్కరకు అత్యున్నత పదవి | sangakkara offered high commissioner to UKs post | Sakshi
Sakshi News home page

సంగక్కరకు అత్యున్నత పదవి

Published Mon, Aug 24 2015 1:41 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

సంగక్కరకు అత్యున్నత పదవి - Sakshi

సంగక్కరకు అత్యున్నత పదవి

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన కాసేపటికే శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరకు అత్యున్నత పదవి వరించింది. ఇంగ్లండ్లో శ్రీలంక హైకమిషనర్గా సంగక్కరను నియమించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ మేరకు ప్రకటించారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి సంగా రిటైరయిన సంగతి తెలిసిందే. భారత్తో ఈ రోజు ముగిసిన కొలంబో టెస్టే అతనికి చివరిది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సంగక్కర వీడ్కోలు సభలో పాల్గొన్న సిరిసేన ఈ నియామకాన్ని ప్రకటించారు. 15 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్కు సంగా అపార సేవలు అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement