high commissioner to UK
-
లండన్ ఘటనకు భారత్ కౌంటర్
ఢిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలీస్తానీ మద్దతుదారుల దుశ్చర్యకుగానూ.. భారత్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని యూకే హైకమిషన్ బయట ఉన్న బారికేడ్లను బుధవారం తొలగించింది. తద్వారా యూకే తీరుకు గట్టి బదులు ఇచ్చింది. ఖలీస్తానీ-పాక్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా.. ఖలీస్తానీ గ్రూప్‌నకు చెందిన కొందరు లండన్‌లోని భారత హై కమిషన్ వద్ద మువన్నెల జెండాను కిందకి దించేసి.. ఖలీస్తానీ జెండా ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భారత హైకమిషన్ అధికారులు తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది. అయితే.. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసులు, అధికారులు స్పందించలేదు. సకాలంలో స్పందించకపోవడం మాట అటుంచి.. భారత హైకమిషన్‌కు తగినంత భద్రత కల్పించకపోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బారికేడ్లను తొలగించింది. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ దేశ రాయబారిని వివరణ కోరుతూ భారత విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది కూడా. ఇక అక్కడి అధికార యంత్రాంగం, మంత్రులు మాత్రం.. ఖలీస్తానీ మద్దతుదారుల చర్యలను హేయనీయమైన చర్యగా పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ఝండా ఊంచా రహే హమారా -
యూకేలో ఉంటున్న భారతీయులకు హైకమిషన్ సూచన
లండన్: కరోనా నేపథ్యంలో యునైటెడ్‌కింగ్‌డమ్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవల్సిందిగా లండన్‌లో ఉన్న భారత హైకమిషనర్ సూచించింది. ఈ మేరకు ట్వీట్టర్లో దీనికి సంబంధిన వివరాలను ఉంచింది. భారత పౌరులందరూ https://forms.gle/nnWCw2arfpNxguhM7 లేదా http://hcilondon.gov.in ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని భారత హైకమిషన్ తెలిపింది. All Indian citizens stranded in the UK may please register themselves with the High Commission through google sheet available at https://t.co/shBOoJsDvz Or through website https://t.co/jmRzhtor3x You may ignore if already registered. @RuchiGhanashyam @CGI_Bghm @IndiaInScotland — India in the UK (@HCI_London) April 30, 2020 కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో చైనా, ఇటలీ, ఇరాన్లో ఉన్న కొంతమంది భారతీయులను భారత ప్రభుత్వం మన దేశానికి తీసుకు వచ్చింది. అయితే కొంత మంది భారతపౌరులు మాత్రం కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించడంతో లండన్‌లోనే చిక్కుకుపోయారు. అయితే దీనికి సంబంధించి ఏప్రిల్ 7 వతేదీన యూకేలో చిక్కుకున్న భారతీయులందరిని వెంటనే భారత్‌కి తీసుకురావాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు దీనికి భారతప్రభుత్వం సమాధానం ఇస్తూ యూకే పౌరులను కొంతమందిని వారి దేశానికి ప్రత్యేక విమానాల ద్వారా పంపిస్తున్నామని ఇంగ్లాండ్ నుంచి మనదేశానికి రావాలనుకునే వారు ఆ విమానాల ద్వారా రావచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారతహైకమిషన భారత పౌరుల వివరాలు నమోదు చేసుకోమని సూచించింది. చదవండి: ఆ యాప్ ద్వారా భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాక్! -
సంగక్కరకు అత్యున్నత పదవి
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన కాసేపటికే శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరకు అత్యున్నత పదవి వరించింది. ఇంగ్లండ్‌లో శ్రీలంక హైకమిషనర్‌గా సంగక్కరను నియమించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ మేరకు ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సంగా రిటైరయిన సంగతి తెలిసిందే. భారత్‌తో ఈ రోజు ముగిసిన కొలంబో టెస్టే అతనికి చివరిది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సంగక్కర వీడ్కోలు సభలో పాల్గొన్న సిరిసేన ఈ నియామకాన్ని ప్రకటించారు. 15 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్‌కు సంగా అపార సేవలు అందించాడు.