సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు | narendra Modi praises Sangakkara, says the cricket great will be missed | Sakshi
Sakshi News home page

సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు

Published Tue, Sep 15 2015 5:43 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు - Sakshi

సంగక్కరపై ప్రధాని మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ:ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కరపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సంగక్కర ఒక గొప్ప క్రికెటర్ అని, అతని సేవలను శ్రీలంక క్రికెట్ జట్టు కోల్పోవడం ఒక తీరని లోటేనని మోదీ కొనియాడారు. శ్రీలంక క్రికెట్ ను ఉన్నత స్థాయిలో నిలిపిన సంగక్కర అందరకీ ఆదర్శప్రాయమన్నారు.

 

శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమసింఘే తో సంయుక్తంగా మీడియా సమావేశానికి హాజరైన మోదీ..  సంగక్కరను మరోసారి గుర్తుచేసుకుంటూ ఈ విధంగా స్పందించారు. 'క్రికెట్ లో గొప్ప ఆటగాళ్లలో సంగక్కర ఒకడు. అతను శ్రీలంకకు అందించిన సేవలు మరువలేనివి. వికెట్ కీపర్ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ గా అమోఘమైన రికార్డును సంగా సొంతం చేసుకున్నాడు. సంగాను క్రికెట్ ఫీల్డ్ లో చూసే అవకాశాన్ని మనమందరం కోల్పోతున్నాం'  అని మోదీ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement