
జైపూర్‌లో రాహుల్‌కు సత్కారం
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రికెట్ పరిభాషను రాజకీయాలకు అనువర్తింపజేశారు. ‘రైతులు, యువత ఏ మాత్రం భయం లేకుండా ఫ్రంట్‌ఫుట్ బ్యాటింగ్ చేయాలి’ అని అన్నారు. ‘మనం ఆడితే ఫ్రంట్‌ఫుట్ ఆడతాం, సిక్స్’ కొడతాం అని పేర్కొన్నారు. ఆయన బుధవారం రాజస్తాన్‌లో ప్రసంగిస్తూ ‘దేశంలోని రైతులు, యువత ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పిచ్‌పై ఫ్రంట్‌ఫుట్ వచ్చి ఆడాలి. ఐదేళ్లుగా ప్రధాని మోదీ బ్యాక్‌ఫుట్ వేసి ఆడుతున్నారు’ అని పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయలేక పోయిందన్నారు. ‘రైతులకు సాయం చేస్తాననీ, యువతకు ఉద్యోగాలిస్తాననీ మోదీ మాట ఇస్తారు. కానీ ఆయనెప్పడు బ్యాక్‌ఫుటే ఆడతారు (వెనకడుగు వేస్తారు)’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment