భారత్‌తో తొలి టెస్టే ఆఖరిది! | Tests with India its a final! | Sakshi
Sakshi News home page

భారత్‌తో తొలి టెస్టే ఆఖరిది!

Published Mon, Jun 15 2015 1:24 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM

భారత్‌తో తొలి టెస్టే ఆఖరిది! - Sakshi

భారత్‌తో తొలి టెస్టే ఆఖరిది!

ముందే రిటైర్ కానున్న సంగక్కర

 కొలంబో : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనుకున్న సమయంకంటే రెండు టెస్టుల ముందే తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే లంక బోర్డుకు తెలియజేసిన సంగ, మంగళవారం దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలి ప్రపంచకప్‌తో వన్డేలకు వీడ్కోలు పలికిన సంగక్కర... సొంతగడ్డపై రెండు టెస్టు సిరీస్‌ల తర్వాత పూర్తి స్థాయిలో రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. శ్రీలంక జట్టు పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్, భారత్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది.

అయితే ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రేతో కాంట్రాక్ట్ కారణంగా నాలుగు టెస్టులు ఆడిన వెంటనే నిష్ర్కమించాలని భావిస్తున్నాడు. దాంతో పాక్‌తో మూడు టెస్టుల తర్వాత భారత్‌తో గాలేలో జరిగే తొలి టెస్టు సంగక్కర కెరీర్‌లో చివరిది కానుంది. 130 టెస్టుల్లో 12,203 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న సంగక్కర, మరో డబుల్ సెంచరీ చేస్తే బ్రాడ్‌మన్ (12) రికార్డును సమం చేస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement