వారిది సరైన నిర్ణయం | Sanga, Mahela made correct decision to retire: Arjuna Ranatunga | Sakshi
Sakshi News home page

వారిది సరైన నిర్ణయం

Published Fri, Apr 11 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

Sanga, Mahela made correct decision to retire: Arjuna Ranatunga

 సంగక్కర, జయవర్ధనేల రిటైర్మెంట్‌పై రణతుంగ
 
 కొలంబో: శ్రీలంక క్రికెటర్లు సంగక్కర, మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నారు. ఇటీవల శ్రీలంక విజేతగా నిలిచిన టి20 ప్రపంచకప్ సందర్భంగా టోర్నీ మధ్యలోనే వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

అయితే వారు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించారంటూ సంగ, జయవర్ధనేలపై లంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌తో స్వదేశానికి చేరుకున్న అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు మీడియా తో మాట్లాడుతూ.. బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే రణతుంగ మాత్రం బోర్డు అభిప్రాయంతో విభేదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement