Jayawardene
-
కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపా..
న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్‌గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్‌గా కూడా పనిచేశాడు. చదవండి: ఇంగ్లండ్‌లో ఐపీఎల్ నిర్వహణ డౌటే.. -
వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?
కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
తీవ్ర అసహనానికి గురయ్యా: రోహిత్ శర్మ
ముంబై: గాయంతో ఆటకు దూరమైన ఐదు నెలలు తనకు ఎంతో భారంగా గడిచాయని భారత క్రికెటర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సహచరులు మైదానంలో చెలరేగుతుంటే తాను మాత్రం ప్రేక్షకుడిగా ఉండిపోవాల్సి వచ్చిందన్నాడు. పేరుకు ఐదు నెలలే అయినా చాలా సుదీర్ఘ సమయం గడిపినట్లనిపిస్తోందని తెలిపాడు. గాయం గురించి చాలా భయపడ్డానని, కానీ డాక్టర్లు చిన్న గాయమని దైర్యం ఇచ్చారని రోహిత్ అన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో గాయపడిన తర్వాత జట్టంతా మైదానంలో ఉంటే నేను మాత్రం హోటల్లో కూర్చొని మ్యాచ్‌ను చూడాల్సి రావడం చాలా అసహనానికి గురిచేసిందన్నాడు. అయితే ఆటగాడికి గాయాలు సహజమని పేర్కొన్నాడు. దీని వల్ల నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా అని రోహిత్ తెలిపాడు. గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చలేకపోయిందని, ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామని జట్టు కెప్టెన్ రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తమ పేస్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని అతను వెల్లడించాడు. మా ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలమన్నాడు. జట్టు కోచ్, దిగ్గజ క్రికెటర్ జయవర్ధనేతో కలిసి పని చేయడం చాలా బాగుందని చెప్పాడు. కొత్త తరహా ప్రణాళికలతో ఈసారి సన్నద్ధమయ్యామని. సొంత మైదానం వాంఖెడేలో అజేయంగా నిలిచి ఇతర వేదికల్లోనూ రాణిస్తే మాకు దూసుకెళ్లే అవకాశం ఉందని రోహిత్ విశ్లేషించాడు. న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయంతో రోహిత్ ఇంగ్లండ్ టెస్టు, వన్డే సిరీస్‌లు, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. -
ఫటాఫట్ ఫ్యాక్ట్స్
1 కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత ధోని (28) సొంతం 2 ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు ఫైనల్ చేరింది. 3 ప్రపంచకప్‌లలో ‘టై’ అయిన మ్యాచ్‌లు. 4 నలుగురు లంక ఆటగాళ్లు మలింగ, దిల్షాన్, జయవర్ధనే, సంగక్కర టోర్నీలో అత్యధిక (31) మ్యాచ్‌లు ఆడారు. 5 ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లు 6 అంతర్జాతీయ టి20ల్లోఇప్పటివరకూ టై అయిన మ్యాచ్‌లు 7 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు 8 మహిళల తొలి మూడు ప్రపంచకప్‌లలో ఎనిమిదేసి జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 9 ఈ మెగా ఈవెంట్లో భారత మహిళల జట్టుకు అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. 10ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు గేల్ (10) 11ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ రోహిత్ 12మరో 12 వికెట్లు తీస్తే మలింగ ప్రపంచ కప్‌లో 50 వికెట్లు పూర్తి చేస్తాడు. 13 ప్రపంచకప్‌లో 90 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు 13సార్లు వచ్చాయి. 14 మహిళల ప్రపంచకప్‌లో ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, కివీస్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 15 ఎక్కువ పరాజయాలు బంగ్లాదేశ్ (15) 16 ఈసారి టోర్నీలో పాల్గొన్న, పాల్గొంటున్న మొత్తం జట్లు 17 మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 17 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ఉమన్ దియాంద్రా డాటిన్ (వెస్టిండీస్) 18 ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన మ్యాచ్‌లు. మొత్తం 28 మ్యాచ్‌లు ఆడింది. 9 ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 19 చరిత్రలో ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడిన జట్లు 20 మహిళల టి20 ప్రపంచకప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 20 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టు న్యూజిలాండ్. గత విజేతలు సంవత్సరం వేదిక విజేత రన్నరప్ 2007 దక్షిణాఫ్రికా భారత్ పాకిస్తాన్ 2009 ఇంగ్లండ్ పాకిస్తాన్ శ్రీలంక 2010 వెస్టిండీస్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా 2012 శ్రీలంక వెస్టిండీస్ శ్రీలంక 2014 బంగ్లాదేశ్ శ్రీలంక భారత్ ప్రైజ్‌మనీ వివరాలు విజేత : రూ. 23 కోట్ల 44 లక్షలు రన్నరప్ : రూ. 10 కోట్లు సెమీస్‌లో ఓడిన జట్లకు : రూ. 5 కోట్లు లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు : రూ. 33 లక్షల 48 వేలు టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు : రూ. 2 కోట్లు ప్రపంచకప్ హీరోలు అత్యధిక పరుగులు : జయవర్ధనే (1016) అత్యధిక వ్యక్తిగత స్కోరు : బ్రెండన్ మెకల్లమ్ (123) అత్యధిక వికెట్లు : మలింగ (38) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు : అజంతా మెండిస్ (8 పరుగులకు 6 వికెట్లు) ఒక జట్టు అత్యధిక స్కోరు : శ్రీలంక (266- కెన్యాపై) అలా జరిగింది! ►దక్షిణాఫ్రికా క్రికెటర్ వాన్ డెర్ మెర్వ్ టి20 ప్రపంచకప్‌లో రెండు దేశాల తరఫున ఆడాడు. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2009 ప్రపంచకప్‌లో వాన్ డెర్ మెర్వ్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 2016 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో నెదర్లాండ్స్ జట్టు తరఫున ఆడాడు. ►ఇప్పటివరకు ఐదుసార్లు టి20 ప్రపంచకప్ జరిగినా... ఆతిథ్య జట్టుకు టైటిల్ దక్కలేదు. ►డిఫెండింగ్ చాంపియన్ జట్లకు తదుపరి ప్రపంచకప్ కలసిరాలేదు. ఒకసారి విజేతగా నిలిచిన జట్టు తదుపరి టోర్నీలో కనీసం సెమీఫైనల్‌ను దాటలేకపోయింది. -
లంక బోర్డు వ్యాఖ్యలు దారుణం: జయవర్ధనే
కొలంబో: ఇంగ్లండ్ జట్టుకు సలహాదారు డిగా పనిచేయడాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్) తప్పుపట్టడంపై జయవర్ధనే అసం తృప్తి వ్యక్తం చేశారు. తానేమీ జట్టు రహస్యాలు వారికి అందించేందుకు వెళ్లలేదని గుర్తుచేశారు. ‘మైదానంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేను ఇంగ్లండ్ ఆటగాళ్లకు సహాయపడతాను. అలాగే స్పిన్ బౌలింగ్‌ను దీటుగా ఆడేందుకు సలహాలిస్తాను. నేను వారితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రపంచకప్ గ్రూప్‌లు నిర్ణయం కాలేదు. లంక రహస్యాలను చె ప్పేందుకే వారు నన్ను నియమించుకోలేదు. దానికోసం వారికి విశ్లేషకులు, కోచ్‌లున్నారు. బోర్డు నుంచి ఇలాంటి కామెం ట్స్ రావడం నిరాశకు గురి చేసింది. నిజానికి నేను టి20 జట్టు నుంచి వైదొలిగి రెండేళ్లవుతుంది. ఎంతోమంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. అయినా అప్పటి ప్రణాళికలతోనే వారు ఆడుతున్నారా?’ అని జయవర్ధనే ప్రశ్నించారు. -
అమ్ముడుపోని స్టార్స్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. రూ. 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. మైకేల్ హస్సీ (రూ. 2 కోట్లు), జయవర్ధనే (రూ. 1.5 కోట్లు), దిల్షాన్ (రూ. 1.5 కోట్లు), బ్రాడ్ హాడిన్ (రూ. 1.5 కోట్లు), బెయిలీ (రూ. 1 కోటి), ఆమ్లా (రూ. 1 కో టి), డారెన్ స్యామీ (రూ. 50 లక్షలు), అజంతా మెండిస్ (రూ. 50 లక్షలు), ఫిలాండర్ (రూ. 50 లక్షలు), మార్లన్ శామ్యూల్స్ (రూ. 50 లక్షలు)లాంటి అంతర్జాతీయ ఆటగాళ్ల వైపు కనీసం చూసే సాహసం కూడా ఫ్రాంచైజీలు చేయకపోవడం గమనార్హం. భారత దేశవాళీ స్టార్లలో కూడా కొందరికి అదరణ కరువైంది. ముఖ్యంగా మనోజ్ తివారి (రూ. 1 కోటి), చతేశ్వర్ పుజారా (రూ. 50 లక్షలు), బద్రీనాథ్ (రూ. 50 లక్షలు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 50 లక్షలు), మునాఫ్ పటేల్ (రూ. 50 లక్షలు), రాహుల్ శర్మ (రూ. 30 లక్షలు), అభినవ్ ముకుంద్ (రూ. 30 లక్షలు), అభిషేక్ నాయర్ (రూ. 30 లక్షలు)లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ♦ అత్యధికంగా ఢిల్లీ జట్టులో 27 మంది, పంజాబ్, కోల్‌కతాల్లో ♦ అత్యల్పంగా 22 మంది క్రికెటర్లు ఉన్నారు. -
నిరాశపరిచిన పెరీరా, జయవర్థనే
అహ్మదాబాద్: భారత్ తో గురువారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పెరీరా పరుగులేమీ చేయకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దిల్షాన్, సంగక్కర్ 55 పరుగుల వరకు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 35 పరుగులు చేసిన దిల్షాన్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. 64 పరుగుల వద్ద సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్థనే(4) మూడో వికెట్ గా అవుటయ్యాడు. 21 ఓవర్లలో 98/3 స్కోరుతో లంక ఆట కొనసాగిస్తోంది. -
వారిది సరైన నిర్ణయం
సంగక్కర, జయవర్ధనేల రిటైర్మెంట్పై రణతుంగ కొలంబో: శ్రీలంక క్రికెటర్లు సంగక్కర, మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నారు. ఇటీవల శ్రీలంక విజేతగా నిలిచిన టి20 ప్రపంచకప్ సందర్భంగా టోర్నీ మధ్యలోనే వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించారంటూ సంగ, జయవర్ధనేలపై లంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌తో స్వదేశానికి చేరుకున్న అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు మీడియా తో మాట్లాడుతూ.. బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే రణతుంగ మాత్రం బోర్డు అభిప్రాయంతో విభేదించారు. -
జయవర్ధనే సెంచరీ: లంక 318/4
దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహేల జయవర్ధనే (230 బంతుల్లో 106 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి... శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 4 వికెట్లకు 318 పరుగులు చేసింది. జయవర్ధనేతో పాటు మాథ్యూస్ (42 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం లంక 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. 57/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన లంక ఆరంభంలో కాస్త ఇబ్బందిపడింది. స్వల్ప వ్యవధిలో సంగక్కర (26), చండిమాల్ (12) అవుట్ కావడంతో 88 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుశాల్ సిల్వ (221 బంతుల్లో 95; 10 ఫోర్లు), జయవర్ధనేలు నిలకడగా ఆడుతూ క్రమంగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి నాలుగో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో సిల్వను.... హఫీజ్ బోల్తా కొట్టించడంతో తృటిలో సెంచరీని కోల్పోయాడు. తర్వాత వచ్చిన మాథ్యూస్ వికెట్‌ను కాపాడుకుంటూ సమయోచితంగా ఆడాడు. నెమ్మదిగా ఆడినా... జయవర్ధనే కెరీర్లో 32వ సెంచరీ పూర్తి చేశాడు. మాథ్యూస్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. జునైద్ 2, రాహత్ అలీ, హఫీజ్ చెరో వికెట్ తీశారు.