
నిరాశపరిచిన పెరీరా, జయవర్థనే
అహ్మదాబాద్: భారత్ తో గురువారమిక్కడ జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పెరీరా పరుగులేమీ చేయకుండానే ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
దిల్షాన్, సంగక్కర్ 55 పరుగుల వరకు రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 35 పరుగులు చేసిన దిల్షాన్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. 64 పరుగుల వద్ద సీనియర్ బ్యాట్స్మన్ జయవర్థనే(4) మూడో వికెట్ గా అవుటయ్యాడు. 21 ఓవర్లలో 98/3 స్కోరుతో లంక ఆట కొనసాగిస్తోంది.