అమ్ముడుపోని స్టార్స్
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. రూ. 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చినా ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. మైకేల్ హస్సీ (రూ. 2 కోట్లు), జయవర్ధనే (రూ. 1.5 కోట్లు), దిల్షాన్ (రూ. 1.5 కోట్లు), బ్రాడ్ హాడిన్ (రూ. 1.5 కోట్లు), బెయిలీ (రూ. 1 కోటి), ఆమ్లా (రూ. 1 కో టి), డారెన్ స్యామీ (రూ. 50 లక్షలు), అజంతా మెండిస్ (రూ. 50 లక్షలు), ఫిలాండర్ (రూ. 50 లక్షలు), మార్లన్ శామ్యూల్స్ (రూ. 50 లక్షలు)లాంటి అంతర్జాతీయ ఆటగాళ్ల వైపు కనీసం చూసే సాహసం కూడా ఫ్రాంచైజీలు చేయకపోవడం గమనార్హం.
భారత దేశవాళీ స్టార్లలో కూడా కొందరికి అదరణ కరువైంది. ముఖ్యంగా మనోజ్ తివారి (రూ. 1 కోటి), చతేశ్వర్ పుజారా (రూ. 50 లక్షలు), బద్రీనాథ్ (రూ. 50 లక్షలు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 50 లక్షలు), మునాఫ్ పటేల్ (రూ. 50 లక్షలు), రాహుల్ శర్మ (రూ. 30 లక్షలు), అభినవ్ ముకుంద్ (రూ. 30 లక్షలు), అభిషేక్ నాయర్ (రూ. 30 లక్షలు)లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
♦ అత్యధికంగా ఢిల్లీ జట్టులో 27 మంది, పంజాబ్, కోల్‌కతాల్లో
♦ అత్యల్పంగా 22 మంది క్రికెటర్లు ఉన్నారు.