మెగా వేలంలో లిస్ట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 15) విడుదల చేసింది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు లిస్ట్ అయ్యారు. ఇందులో 366 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు.
వేలంలో 318 మంది భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.. 12 మంది విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు పాల్గొననున్నారు. మొత్తం 204 స్లాట్లకు వేలం జరుగనుండగా.. 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో మొత్తం 81 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు.
క్యాప్డ్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ల వివరాలు..
భారతీయ క్యాప్డ్ ప్లేయర్లు- 48
విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు- 193
అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్లు- 3
భారతీయ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు- 318
విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు- 12
మొత్తం- 574
వివిధ బేస్ ధర విభాగాల్లో పాల్గొననున్న ఆటగాళ్లు..
రూ. 2 కోట్లు- 81 మంది ఆటగాళ్లు
రూ. 1.5 కోట్లు- 27
రూ. 1.25 కోట్లు- 18
రూ. కోటి- 23
రూ. 75 లక్షలు- 92
రూ. 50 లక్షలు- 8
రూ. 40 లక్షలు- 5
రూ. 30 లక్షలు- 320
మొత్తం- 574
సెట్-1..
జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్, అర్షదీప్ సింగ్
సెట్-2..
యుజ్వేంద్ర చహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
సెట్-3..
హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్, ఎయిడెన్ మార్క్రమ్, దేవ్‌దత్ పడిక్కల్, రాహుల్ త్రిపాఠి, డేవిడ్ వార్నర్
సెట్-4..
అశ్విన్, వెంకటేశ్ అయ్యర్ మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, సోయినిస్
సెట్-5..
బెయిర్‌స్టో, డికాక్, గుర్బాజ్, ఇషాన్‌కిషన్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ
సెట్-6..
బౌల్ట్, హాజిల్‌వుడ్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, నటరాజన్, నోర్జే, ఖలీల్ అహ్మద్
సెట్-7..
నూర్ అహ్మద్, రాహుల్ చాహర్, హసరంగ, సలామ్‌ఖీల్, తీక్షణ, ఆడమ్ జంపా
కాగా, జెద్దా వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment