IPL 2025: మెగా వేలం డేట్స్‌ ఫిక్స్‌! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక | IPL 2025 Mega Auction Expected To Be Held In Riyadh, Likely Dates: Report | Sakshi
Sakshi News home page

IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక

Published Mon, Nov 4 2024 3:13 PM | Last Updated on Wed, Nov 6 2024 10:23 AM

IPL 2025 Mega Auction Expected To Be Held In Riyadh, Likely Dates: Report

PC: IPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్‌ వేదికగా ఆక్షన్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రైట్‌ టూ మ్యాచ్‌ కార్డు అందుబాటులోకి
కాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్‌ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్‌ టూ మ్యాచ్‌(ఆర్టీఎమ్‌) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.

వదిలించుకున్నాయి
రాజస్తాన్‌ రాయల్స్‌ జోస్‌ బట్లర్‌(ఇంగ్లండ్‌), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐడెన్‌ మార్క్రమ్‌(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(ఆస్ట్రేలియా), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(సౌతాఫ్రికా), లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అ‍య్యర్‌లను రిలీజ్‌ చేయడం ఇందుకు ఉదాహరణ.

ఆ తేదీల్లోనే వేలం!
ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్‌క్యాప్డ్‌ ఇండియన్స్‌ కావడం విశేషం. కాగా ఈ సీజన్‌లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్‌ వేలం జరిగిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌ మెగా వేలం-2025 రిటెన్షన్స్‌ పోనూ ఎవరి పర్సులో ఎంత?
రాజస్తాన్‌ రాయల్స్‌ 
👉సంజూ సామ్సన్‌-భారత్‌-    రూ. 18 కోట్లు 
👉యశస్వి జైస్వాల్‌-    భారత్‌-    రూ. 18 కోట్లు 
👉రియాన్‌ పరాగ్‌-    భారత్‌-    రూ. 14 కోట్లు 
👉ధ్రువ్‌ జురెల్‌-    భారత్‌-    రూ. 14 కోట్లు 
👉హెట్‌మైర్‌-వెస్టిండీస్    రూ. 11 కోట్లు 
👉సందీప్‌ శర్మ-    భారత్‌-    రూ. 4 కోట్లు  
👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం లేదు

గుజరాత్‌ టైటాన్స్‌
👉రషీద్‌ ఖాన్-అఫ్గానిస్తాన్‌-     రూ. 18 కోట్లు 
👉శుబ్‌మన్‌ గిల్‌-    భారత్‌-    రూ. 16.50 కోట్లు 
👉సాయి సుదర్శన్‌-    భారత్‌-    రూ. 8.50 కోట్లు 
👉రాహుల్‌ తెవాటియా- భారత్‌    రూ. 4 కోట్లు 
👉షారుఖ్‌ ఖాన్‌    భారత్‌-    రూ. 4 కోట్లు  
👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక క్యాప్‌డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

ఢిల్లీ క్యాపిటల్స్‌ 
👉అక్షర్‌ పటేల్‌-    భారత్‌-    రూ. 16.50 కోట్లు 
👉కుల్దీప్‌ యాదవ్‌-    భారత్‌    రూ. 13.25 కోట్లు 
👉ట్రిస్టన్‌ స్టబ్స్‌-    దక్షిణాఫ్రికా    రూ. 10 కోట్లు 
👉అభిషేక్‌ పొరెల్‌-    భారత్‌    రూ. 4 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు  
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ఇద్దరు క్యాప్డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు  

లక్నో సూపర్‌ జెయింట్స్‌ 
👉నికోలస్‌ పూరన్‌-    వెస్టిండీస్‌-    రూ. 21 కోట్లు 
👉రవి బిష్ణోయ్‌-    భారత్‌-    రూ. 11 కోట్లు 
👉మయాంక్‌ యాదవ్‌    -భారత్‌-    రూ. 11 కోట్లు 
👉మోహసిన్‌ ఖాన్‌-    భారత్‌-    రూ. 4 కోట్లు 
👉ఆయుష్‌ బదోని-    భారత్‌-    రూ. 4 కోట్లు  
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం లేదు: ఒక క్యాప్‌డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  
👉హెన్రిచ్‌ క్లాసెన్‌-    దక్షిణాఫ్రికా-    రూ. 23 కోట్లు 
👉ప్యాట్‌ కమిన్స్‌-    ఆస్ట్రేలియా-    రూ. 18 కోట్లు 
👉అభిషేక్‌ శర్మ-    భారత్‌-    రూ. 14 కోట్లు 
👉ట్రావిస్‌ హెడ్‌-    ఆస్ట్రేలియా-    రూ. 14 కోట్లు 
👉నితీశ్‌ రెడ్డి-            భారత్‌-    రూ. 6 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

ముంబై ఇండియన్స్‌ 
👉జస్‌ప్రీత్‌ బుమ్రా-    భారత్‌-    రూ. 18 కోట్లు 
👉సూర్యకుమార్‌-    భారత్‌-    రూ. 16.35 కోట్లు 
👉హార్దిక్‌ పాండ్యా-    భారత్‌-    రూ. 16.35 కోట్లు 
👉రోహిత్‌ శర్మ-    భారత్‌-    రూ. 16.30 కోట్లు 
👉తిలక్‌ వర్మ-    భారత్‌-    రూ. 8 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
👉రుతురాజ్‌ గైక్వాడ్‌-    భారత్‌-    రూ. 18 కోట్లు 
👉మతీశా పతిరన-    శ్రీలంక-     రూ. 13 కోట్లు 
👉శివమ్‌ దూబే-    భారత్‌-    రూ. 12 కోట్లు 
👉రవీంద్ర జడేజా-    భారత్‌-    రూ. 18 కోట్లు 
👉ధోనీ    -        భారత్‌-    రూ. 4 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 
👉రింకూ సింగ్‌-    భారత్‌-    రూ. 13 కోట్లు 
👉వరుణ్‌ చక్రవర్తి-    భారత్‌    -రూ. 12 కోట్లు 
👉సునీల్‌ నరైన్‌-    వెస్టిండీస్‌-    రూ. 12 కోట్లు 
👉ఆండ్రె రసెల్‌-    వెస్టిండీస్‌-    రూ. 12 కోట్లు 
👉హర్షిత్‌ రాణా-    భారత్‌-    రూ. 4 కోట్లు 
👉రమణ్‌దీప్‌ సింగ్‌-    భారత్‌-    రూ. 4 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం లేదు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 
👉విరాట్‌ కోహ్లి-    భారత్‌-    రూ. 21 కోట్లు 
👉రజత్‌ పాటిదార్‌-    భారత్‌    -రూ. 11 కోట్లు 
👉యశ్‌ దయాళ్‌-    భారత్‌-    రూ. 5 కోట్లు 
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 
👉ఆర్టీఎమ్‌ అవకాశం: ముగ్గురు క్యాప్‌డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు

పంజాబ్‌ కింగ్స్‌ 
👉శశాంక్‌ సింగ్‌-    భారత్‌-    రూ. 5.5 కోట్లు 
👉ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌    -భారత్‌-    రూ. 4 కోట్లు  
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు  
👉ఆర్టీఎమ్‌ అవకాశం: నలుగురు క్యాప్‌డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు.

చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్‌!.. ఇక చాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement