లంక బోర్డు వ్యాఖ్యలు దారుణం: జయవర్ధనే
కొలంబో: ఇంగ్లండ్ జట్టుకు సలహాదారు డిగా పనిచేయడాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్) తప్పుపట్టడంపై జయవర్ధనే అసం తృప్తి వ్యక్తం చేశారు. తానేమీ జట్టు రహస్యాలు వారికి అందించేందుకు వెళ్లలేదని గుర్తుచేశారు. ‘మైదానంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేను ఇంగ్లండ్ ఆటగాళ్లకు సహాయపడతాను. అలాగే స్పిన్ బౌలింగ్‌ను దీటుగా ఆడేందుకు సలహాలిస్తాను. నేను వారితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రపంచకప్ గ్రూప్‌లు నిర్ణయం కాలేదు. లంక రహస్యాలను చె ప్పేందుకే వారు నన్ను నియమించుకోలేదు. దానికోసం వారికి విశ్లేషకులు, కోచ్‌లున్నారు. బోర్డు నుంచి ఇలాంటి కామెం ట్స్ రావడం నిరాశకు గురి చేసింది. నిజానికి నేను టి20 జట్టు నుంచి వైదొలిగి రెండేళ్లవుతుంది. ఎంతోమంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. అయినా అప్పటి ప్రణాళికలతోనే వారు ఆడుతున్నారా?’ అని జయవర్ధనే ప్రశ్నించారు.