T-20
-
టీమిండియా గెలిస్తే సిరీస్ సమం
కుదించిన లక్ష్యంతోనైనా మొదటి మ్యాచ్‌లో ఫలితం తేలింది. కనీసం ఛేదనకు దిగకుండానే రెండోది రద్దయి పోయింది. దీంతో మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి... ఓడినా సిరీస్ చేజారని నిశ్చింత ఆస్ట్రేలియాది. గెలుపుతో... తమ జైత్ర యాత్రకు అడ్డుకట్ట పడకుండా చూసుకోవాల్సిన ఒత్తిడి టీమిండియాది. మరి... చివరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో! సిడ్నీ: ఆట కంటే వరుణుడి అడ్డంకులే ఎక్కువగా వస్తున్న ఆస్ట్రేలియా–భారత్ టి20 సిరీస్... ఆఖరికి వచ్చింది. రెండు జట్ల మధ్య ఆదివారం సిడ్నీ క్రికెట్ మైదానం (ఎస్సీజీ)లో చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 1–0 ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టును ఇందులో ఓడించి... 1–1తో లెక్క సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా ఏడు సిరీస్‌లు నెగ్గిన తర్వాత ఓటమి ఎదురు కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరోవైపు చాన్నాళ్ల తర్వాత ఓ పెద్ద జట్టుపై సిరీస్ విజయం సాధించే అవకాశాన్ని కంగారూలు అంత తేలిగ్గా వదులుకుంటారని భావించలేం. ఈ నేపథ్యంలో మూడో టి20లో ఎవరికి అనుకూల ‘ముగింపు’ దక్కుతుందో చూడాలి. అదే కూర్పా.. లేక మార్పా...? భారత్ రెండో టి20కి ఒక మార్పుతో బరిలో దిగుతుందనుకుంటే అదేమీ లేకుండానే ఆడింది. ఇప్పుడు మరోసారి ఆ ఒక్క స్థానంపైనే ఊగిసలాట నడుస్తోంది. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఆడిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, పరుగులిస్తున్నా పేస్‌లో వైవిధ్యంతో ఖలీల్ మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి, బాగా అవసరం అనుకుంటే తప్ప అతడిని తప్పించకపోవచ్చు. మెల్బోర్న్లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మెరుగ్గా కనిపించాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్, పేసర్లు భువనేశ్వర్, బుమ్రాల బౌలింగ్‌పై బెంగలేదు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే ఆందోళన నెలకొంది. టెస్టు సిరీస్‌కు ఓపెనర్ రేసులో నిలవాలంటే అతడు ఈ మ్యాచ్‌లోనైనా ప్రభావం చూపాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందున జట్టు ఛేదనకే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ధావన్ ఫామ్‌కు, కోహ్లి, రోహిత్ జోరు తోడైతే లక్ష్యాన్ని అవలీలగా అందుకోగలం. మన బౌలర్ల ఫామ్ ప్రకారం చూస్తే... మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆసీస్ అవకాశం వదులుకుంటుందా? వరుణుడి దయతో తొలి మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా... అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి కొంత బయటపడింది. కానీ, రెండో టి20లో ఆ జట్టు బలహీనతలు బయటపడ్డాయి. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ భారత బౌలింగ్‌ను ఎదుర్కొనలేక తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. వారి బౌలింగ్ కూడా ఏమంత గొప్పగా లేనందున ఒకవేళ ఆట పూర్తిగా సాగి ఉంటే మ్యాచ్‌నే కోల్పోయేవారు. ఓపెనర్లు డీయార్సీ షార్ట్, కెప్టెన్ ఫించ్ వైఫల్యంతో లిన్, మ్యాక్స్‌వెల్, మెక్‌డెర్మాట్‌లపై బ్యాటింగ్ భారం పడుతోంది. అయితే, పొట్టి ఫార్మాట్లో ఏ క్షణమైనా విరుచుకుపడే వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. గాయపడిన స్టాన్లేక్ స్థానంలో సిడ్నీ మ్యాచ్‌కు కీలక పేసర్ మిచెల్ స్టార్క్‌ను జట్టుతో చేర్చినా అతడు ఆడేది అనుమానమే. పేసర్లు కూల్టర్‌నీల్, ఆండ్రూ టైతో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా టీమిండియాను ఎంతమేరకు నిలువరిస్తారనే దానిపైనే ఆసీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, బుమ్రా, చహల్/ఖలీల్ ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మాట్, క్యారీ, టై, జంపా, బెహ్రెన్‌డార్ఫ్, కూల్టర్‌నీల్/ స్టార్క్ పిచ్, వాతావరణం ఎస్సీజీ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. పేస్‌కు పెద్దగా అనుకూలం కాదు. ఆదివారం వర్ష సూచన లేదు. ►మధ్యాహ్నం గం.1.20 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఆ రెండు అంశాలు కీలకం
రెండు అత్యుత్తమ టి20 జట్లు తలపడుతున్నప్పుడు 40 ఓవర్ల మ్యాచ్‌లో పరిస్థితులకంటే టాసే కీలకం. పొట్టి ఫార్మాట్లో టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోకపోతేనే భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా టాస్‌పై ఆధారపడి ఉంది. మొత్తానికి ఈ రెండు అంశాలు తుది ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు సురక్షిత లక్ష్యం అంటూ ఉండదు. దీంతో పాటు తొందరపాటులో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారీ స్కోరు నమోదు చేయడం కష్టం. ఆ తర్వాత బరిలో దిగిన జట్టుకు ఈ ఇబ్బంది ఉండదు. సాధించాల్సిన రన్‌రేట్‌ను బట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే వీలు చిక్కుతుంది. కార్డిఫ్‌లో భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. మరోసారి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోవడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగింది. ఇక తొలి మ్యాచ్‌లో కుల్దీప్ స్పిన్‌కు దాసోహమైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత అతన్ని ఎదుర్కొనేందుకు మెర్లిన్ అనే ప్రత్యేక బౌలింగ్ యంత్రంతో ప్రాక్టీస్ చేయడంతో పాటు తమ తప్పుల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకున్నారు. ఎక్కువ మంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్ను బ్యాక్‌ఫుట్‌పై ఎదుర్కొన్న తీరు చూస్తే... వారు అతడి బౌలింగ్‌పై ఎంత కసరత్తు చేశారో అర్థమవుతోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన హేల్స్ ఇక్కడ మోర్గాన్, బట్లర్లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. గత మ్యాచ్‌లో కుల్దీప్కు చిక్కిన ఈ ముగ్గురు బ్యాక్‌ఫుట్ మంత్రంతోనే రాణించగలిగారు. -
ఆస్ట్రేలియాపై 45 పరుగులతో పాక్ గెలుపు
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫకర్ జమాన్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుతో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులే చేయగలిగింది. అలెక్స్ కారీ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేడు జింబాబ్వేతో ఆసీస్ తలపడుతుంది. -
లంక బేల... బంగ్లా హేల...
-
లంక బేల... బంగ్లా హేల...
లంకను బంగ్లా మళ్లీ దెబ్బకొట్టింది. తొలి లీగ్ మ్యాచ్‌లో వారిపై భారీ స్కోరు ఛేదించి ఆశ్చర్యపరిచిన ఈ జట్టు... ఒత్తిడి, ఉత్కంఠ, వివాదం మధ్య సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ జయభేరి మోగించి ఫైనల్‌కు చేరింది. కొలంబో: తమ దేశ 70వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో శ్రీలంక ఫైనల్‌కు చేరలేకపోయింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. భారీ స్కోర్లు నమోదవకున్నా చివరి ఓవర్ వరకు విజయం దోబూచులాడిన ఈ పోరులో మహ్ముదుల్లా (18 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచితంగా ఆడి బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించాడు. అంతకుముందు లంక 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (42 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్), మిడిలార్డర్లో ముష్ఫికర్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు)లకు తోడు మహ్ముదుల్లా కడవరకూ నిలవడంతో బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా... తొలి రెండు బంతులకు పరుగు రాలేదు. రెండో బంతికి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ముస్తఫిజుర్ రనౌట్ కావడంతో మహ్ముదుల్లాకు స్ట్రైకింగ్ వచ్చింది. ఈ దశలో అతడు వరుసగా 4, 2, 6 కొట్టి మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ ఆడుతుంది. షార్ట్‌పిచ్ బంతుల వివాదం... అది బంగ్లా ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్. గెలవాలంటే 12 పరుగులు చేయాలి. క్రీజులో ముస్తఫిజుర్. బౌలర్ ఉదాన. తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్’ ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు. మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్ చేయలేకపోయిన ముస్తఫిజుర్ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, శ్రీలంక ఆటగాళ్ల మధ్య వాదన మొదలైంది. అంపైర్లు కలగజేసుకుని బ్యాట్స్‌మెన్‌తో మాట్లాడారు. ఈలోగా కెప్టెన్ షకీబ్ సహా బంగ్లా ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చేశారు. షకీబ్ అంపైర్లతోనూ తీవ్ర వాదులాటకు దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్‌మెన్‌ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్ ముగిశాక సైతం ఆటగాళ్ల మధ్య ఇదే ఉద్రిక్తత కనిపించింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) షబ్బీర్ (బి) షకీబుల్ హసన్ 4; కుశాల్ మెండిస్ (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 11; కుశాల్ పెరీరా (సి) మెహదీ హసన్ (బి) సౌమ్య సర్కార్ 61; తరంగ (రనౌట్) 5; షనక (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 0; జీవన్ మెండిస్ (సి) ముస్తఫిజుర్ (బి) మెహదీ హసన్ 3, తిసారా పెరీరా (సి) తమీమ్ (బి) రూబెల్ 58; ఉడాన (నాటౌట్) 7; ధనంజయ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–5, 2–22, 3–31, 4–32, 5–41, 6–138, 7–154. బౌలింగ్: షకీబుల్ 2–0–9–1, రూబెల్ 4–0–41–1, ముస్తఫిజుర్ 4–1–39–2, మెహదీ 4–0–16–1, మహ్ముదుల్లా 4–0–29–0, సౌమ్య సర్కార్ 2–0–21–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) పెరీరా (బి) గుణతిలక 50; లిటన్ దాస్ (సి) పెరీరా (బి) ధనంజయ 0; షబ్బీర్ (స్టంప్డ్) పెరీరా (బి) ధనంజయ 13; ముష్ఫికర్ (సి) పెరీరా (బి) అపోన్సొ 28; సౌమ్య సర్కార్ (సి) పెరీరా (బి) మెండిస్ 10; మహ్ముదుల్లా (నాటౌట్) 43; షకీబుల్(సి) ధనంజయ (బి) ఉడాన 7; మెహదీ హసన్ (రనౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; రూబెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–11, 2–33, 3–97, 4–105, 5–109, 6–137, 7–148, 8–148. బౌలింగ్: నువాన్ ప్రదీప్ 1–0–10–0, ధనంజయ 4–0–37–2, అపోన్సొ 3–0–19–1, తిసారా పెరీరా 2–0–20–0, గుణతిలక 3–0–24–1, జీవన్ మెండిస్ 4–0–24–1, ఉడాన 2.5–0–26–1. -
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
-
శ్రీలంక గడ్డపై భారత్ సంపూర్ణ విజయం
►ఏకైక టి20లో 7 వికెట్లతో ఘన విజయం ►గెలిపించిన కోహ్లి, మనీశ్ పాండే ►ఆతిథ్య జట్టుకు శూన్యహస్తం మూడు ఫార్మాట్లు... ఆటగాళ్లు మారారు... వేదికలు మారాయి... కానీ ఫలితం మాత్రం మారనే లేదు. శ్రీలంక గడ్డపై భారత జట్టు దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆడిన తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా సంపూర్ణ విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్న టీమిండియా సగర్వంగా పర్యటన ముగించింది. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేని అశక్తతతో, అవమాన భారంతో ఆతిథ్య శ్రీలంక ఖాతాలో అతి పెద్ద శూన్యం చేరింది. 171 పరుగుల విజయలక్ష్యం... 42 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వేటగాడు విరాట్ కోహ్లి ఆడుతూ పాడుతూ ఫినిషింగ్ లైన్ దిశగా జట్టును నడిపించాడు. అతనికి మనీశ్ పాండే అండగా నిలవడంతో భారత్ ఏ దశలోనూ ఆందోళన చెందాల్సిన అవసరమే రాలేదు. మూడో వికెట్‌కు వీరిద్దరు 119 పరుగులు జోడించడంతో జట్టుకు సునాయాస గెలుపు దక్కింది. 48 రోజుల లంక టూర్ అమితానందంతో ముగిసింది. ముఖ్యంగా ఈ పర్యటన మాజీ కెప్టెన్ ధోనికి తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సిరీస్ మొత్తంలో ధోని ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం విశేషం. కొలంబో: విరాట్ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన జట్టు పొట్టి క్రికెట్లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దిల్షాన్ మునవీరా (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్ ప్రియాంజన్ (40 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోగా... మనీశ్ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతనికి సహకరించాడు. తాజా విజయంతో మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ 9–0 తేడాతో లంకను ఓడించినట్లయింది. మునవీరా జోరు... తొలి 10 ఓవర్లలో 90 పరుగులు...తర్వాతి 8 ఓవర్లలో 54 పరుగులు...చివరి 2 ఓవర్లలో 26 పరుగులు... సంక్షిప్తంగా శ్రీలంక ఇన్నింగ్స్ సాగిన తీరు ఇది. భారత్‌తో రెండు వన్డేల్లో విఫలమైన మునవీరా టి20లో సత్తా చాటగా... ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రియాంజన్ లంక ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి శుభారంభం అందించిన డిక్వెలా (17) చివరకు అతని బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అంతకుముందు భువనేశ్వర్ ఓవర్లో తరంగ (5) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. మరోవైపు మునవీరా తన ధాటిని ప్రదర్శించాడు. చహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతను, అక్షర్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ధోని అద్భుత స్టంపింగ్‌తో మాథ్యూస్ (7)ను వెనక్కి పంపించగా, చహల్ మరో ఓవర్లో మునవీరా 2 సిక్సర్లు, ఫోర్‌తో పండగ చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. చివరకు కుల్దీప్, మునవీరా ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆ తర్వాత చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టి పడేయడంతో లంక పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. అయితే చివరి 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టిన ఆ జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. అదే జోరు... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రోహిత్ (9) వికెట్ కోల్పోయింది. రాహుల్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే కోహ్లి, పాండే భాగస్వామ్యం భారత్‌ను విజయం వైపు నడిపించింది. శ్రీలంక బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌కు మొదట్లో పరుగులు తీయడంలో వీరిద్దరు కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు కూడా ఎదుర్కొన్నారు. ఫలితంగా పవర్‌ప్లేలో స్కోరు 43 పరుగులకే పరిమితమైంది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత ఈ జంట సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా కోహ్లి ఏ బౌలర్‌నూ వదల్లేదు. పెరీరా ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టిన భారత్... మాథ్యూస్ వేసిన ఓవర్లో మరో 17 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లు నియంత్రణ తప్పడంతో టీమిండియాకు సునాయాసంగా పరుగులు లభించాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపునకు చేరువైన దశలో కోహ్లి వెనుదిరిగినా... పాండే మిగతా పనిని పూర్తి చేశాడు. -
విజయంతో ముగిస్తే...
టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో మిగిలిన ఏకైక టి20లోనూ సహజంగా టీమిండియానే ఫేవరెట్. ఇందులోనూ గెలిస్తే భారత్‌కు ఈ పర్యటన చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఏ రకంగా చూసినా శ్రీలంక కంటే భారతే అత్యంత పటిష్టంగా ఉంది. దీనికి కొలమానం చెప్పాలంటే అడుగు కాదు ఏకంగా ఓ మైలు దూరమంత మెరుగైన స్థితిలో ఉంది భారత్. లంక మేటి జట్టునే బరిలోకి దించినా కోహ్లి సేనను ఓడించడం అంత ఆషామాషీ కాదు. గాయాలు, నిషేధాలు (తరంగ) చాలవన్నట్లు కెప్టెన్ల మార్పు లంక కొంపముంచింది. ఇలాంటి అనిశ్చితి వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో జవాబుదారీతనం ఉండదు. ఆటగాళ్ల ఆత్మస్థైర్యం, విశ్వాసం సన్నగిల్లుతాయి. వెన్నుతట్టి ప్రోత్సహించే సమర్థ నాయకుడు లేక మైదానంలో ఒత్తిడి పెరుగుతుంది. మొత్తానికి ఈ క్లీన్‌స్వీప్ విజయాల క్రెడిట్ అంతా భారత ఆటగాళ్లదే. వాళ్లు ఏ దశలోనూ పట్టు సడలించలేదు. లంకను ఓడించేందుకు అన్ని రకాల ప్రయోగాల్లో సఫలమయ్యారు. అయితే 50 ఓవర్ల మ్యాచ్ కంటే టి20 చాలా భిన్నమైంది. కొన్ని అద్భుతమైన డెలివరీలు చాలు మ్యాచ్ చేజారడానికి... చేజిక్కించుకోడానికి! ఇక్కడ ఏదైనా వేగంగానే జరుగుతుంది. పుంజుకోవడానికి ఆస్కారమూ తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏకైక టి20 మ్యాచ్ ఎవరిదైనా కావొచ్చు. అయితే లంక నుంచి భారత్‌కు కొత్తగా వచ్చే ఆశ్చర్యకర ఉత్పాతలేవీ లేవనే అనుకుంటున్నా. రెండో వన్డేలో ధనంజయ మ్యాజిక్‌ను తట్టుకుని కూడా భారత్ గెలిచింది. ఆటగాళ్ల ఫామ్ అసాధారణంగా ఉంది. కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దంచేస్తున్నారు. మిగతావారు సహాయక పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత ఛేజింగ్‌కు దిగినా ఎలాంటి సమస్య ఉండబోదు. బౌలింగ్‌లో భువనేశ్వర్ లంకేయుల్ని కట్టడి చేసిన తీరు... స్పిన్నర్లు ఆక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తిప్పేసిన వైనం బాగుంది. దీంతో టెస్టులు, వన్డేల కంటే మరింత రాటుదేలిన బృందంతో టీమిండియా టి20ని ఆడబోతుంది . - సునీల్ గావస్కర్ -
తొలి టి20 ఇంగ్లండ్‌దే
సౌతాంప్టన్: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డివిలియర్స్ (65), బెహర్దీన్ (64) రాణించడంతో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (60), హేల్స్ (47) ఇంగ్లండ్‌ను గెలిపించారు -
ఆఖరి బంతికి శ్రీలంక గెలుపు
ఆస్ట్రేలియాతో తొలి టి20 మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరింతంగా జరిగిన తొలి టి20 క్రికెట్ మ్యాచ్‌లో శ్రీలంకకు విజయం దక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గుణరత్నే (37 బంతుల్లో 52; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా చమర కపుగెడెర (7 బంతుల్లో 10 నాటౌట్) ఫోర్ కొట్టి లంకకు విజయాన్ని అందించాడు. ఫలితంగా మూడు టి20ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉంది. ఆదివారం గీలాంగ్‌లో రెండో టి20 జరుగుతుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ (43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్లింగర్ (38; 4 ఫోర్లు) రాణించారు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన మలింగ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 172 పరుగులు చేసి నెగ్గింది. -
‘ఫినిషింగ్’ ఎవరిదో?
నేడు భారత్, ఇంగ్లండ్ చివరి టి20 గెలిస్తే సిరీస్ సొంతం హోరాహోరీ పోరు ఖాయం భారత్, ఇంగ్లండ్ పోరు తుది అంకానికి చేరింది. మధ్యలో కొన్ని రోజులు విరామం మినహా దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఈ సమరంలో ఆఖరి పంచ్ విసిరేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. టెస్టు సిరీస్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి, వన్డేల్లో కాస్త తడబడ్డా సిరీస్ గెలుచుకోగలిగిన టీమిండియా మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక కఠినంగా సాగిన పర్యటనను విజయంతో ముగించి పొట్టి ఫార్మాట్లోనైనా తమ ఆధిక్యం చూపించాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. పరుగుల వరదకు నిలయం, పరిమాణంలో పేరుకు తగ్గట్లే ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మరో ధనాధన్ వినోదం మాత్రం ఖాయం. బెంగళూరు: ఇంగ్లండ్‌తో గత టి20 మ్యాచ్‌లో ఓటమి అంచుల్లోంచి విజయాన్ని అందుకున్న భారత్ కొండంత ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టి20 నేడు (బుధవారం) ఇక్కడ జరుగుతుంది. సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా, ఆఖరి మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. భారత గడ్డపై సుదీర్ఘంగా సాగిన ఇంగ్లండ్ పర్యటనకు కూడా ఈ మ్యాచ్‌తో ముగింపు లభించబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే టి20ల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే తొలి సిరీస్ విజయం అవుతుంది. బ్యాటింగ్‌లో చెలరేగేనా? సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు నమోదు చేసిన స్కోర్లు 147, 144. సాధారణంగా భారత బ్యాట్స్‌మెన్ మెరుపు ప్రదర్శనే జట్టుకు విజయాలు అందిస్తుంది. ఈ సిరీస్‌లో మాత్రం ఆశ్చర్యకరంగా మన బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా నాగ్‌పూర్ మ్యాచ్ గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లకే చెందుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా సీనియర్ ఆశిష్ నెహ్రాతోపాటు జస్ప్రీత్ బుమ్రా పేస్ కీలకం కానుంది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా, యజువేంద్ర చహల్ కూడా తమ స్థానాలు నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఈ వేదికపై అనేక మ్యాచ్‌లు ఆడిన చహల్ ఇక్కడా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ కోహ్లి ఈసారి ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. బ్యాటింగ్‌లో మాత్రం మనవాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లోనైనా వారు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆర్సీబీ కెప్టెన్ కోహ్లితో పాటు కర్ణాటక ఆటగాళ్లు రాహుల్, మనీశ్ పాండేలకు ఇది సొంత మైదానం. ముఖ్యంగా కోహ్లి నుంచి అభిమానులు ఒక దూకుడైన ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన యువరాజ్‌తో పాటు రైనా, ధోని కూడా ధాటిగా ఆడాల్సి ఉంది. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కావడంతో రిషభ్ పంత్‌కు స్థానం లభించడం అసాధ్యం. ఇంగ్లండ్ ఆశలు... సిరీస్ విజయానికి చేరువగా వచ్చి అనూహ్యంగా రెండో మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లండ్ ఆ షాక్ నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. రెండు సార్లు కూడా భారత్‌ను కట్టడి చేయగలిగిన మోర్గాన్ సేన మరోసారి అదే ఆధిక్యం ప్రదర్శించి చివరి మ్యాచ్‌లో నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆఖరి ఓవర్లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో రూట్ అవుటయ్యాడని సమర్థించుకున్నా, ఇప్పుడు మ్యాచ్‌కు ముందు దానికి విలువ లేదు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖరి వరకు కూడా హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు ప్రధాన బలం. రాయ్, బిల్లింగ్స్, రూట్, మోర్గాన్, స్టోక్స్‌లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. అలీ, డాసన్ కూడా వేగంగా ఆడగల సమర్థులు. పేసర్ జోర్డాన్ కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తూ భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుండగా, స్టోక్స్, అలీ కూడా ఆకట్టుకున్నారు. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లను చూస్తే నాగ్‌పూర్‌లో చివరి ఓవర్ వైఫల్యం మినహా ఇంగ్లండ్ మనకంటే మెరుగైన జట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే జట్టు సమష్టిగా చెలరేగి కనీసం ఒక ట్రోఫీతో స్వదేశం తిరిగి వెళ్లాలని ఆశపడుతోంది. మరోవైపు ఈనెల 4న జరగనున్న ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి డిమాండ్ వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో చెలరేగిన ప్లేయర్లు ఫ్రాంచైజీల దృష్టిలో పడటం ఖాయం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, రైనా, యువరాజ్, పాండే, ధోని, పాండ్యా, మిశ్రా, బుమ్రా, నెహ్రా, చహల్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బిల్లింగ్స్, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, జోర్డాన్, డాసన్/ప్లంకెట్, మిల్స్, రషీద్. పిచ్, వాతావరణం గత ఏడాది 400కు పైగా పరుగులు నమోదైన ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఈ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే. అవుట్ ఫీల్డ్‌ను మాత్రం కొత్తగా తీర్చిదిద్ది అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారు. పిచ్ మాత్రం ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు అనుకూలం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ షాట్లకు అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయంపై ఇంగ్లండ్ చేసిన విమర్శల గురించి మేం ఇప్పుడు పట్టించుకోనవసరం లేదు. కొన్నిసార్లు నిర్ణయాలు మనకు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా రావడం ఆటలో సహజం. రాబోయే మ్యాచ్‌పైనే మా దృష్టి ఉంది. అనుభవజ్ఞుడైన నెహ్రా ఇస్తున్న సూచనలు నాకెంతో ఉపయోగ పడుతున్నాయి. మేం ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి గెలుస్తామనే నమ్మకం ఉంది. –బుమ్రా, భారత బౌలర్ -
'ఢమాకా'కు వేళాయే
► టి20ల్లో తలపడనున్న భారత్, ఇంగ్లండ్ ► నేడు తొలి మ్యాచ్ ► రిషభ్ పంత్‌కు అవకాశం దక్కేనా! ఏకపక్షంగా సాగిన టెస్టు సిరీస్, వన్డేల్లో హోరాహోరీ మ్యాచ్‌ల తర్వాత భారత్, ఇంగ్లండ్ సుదీర్ఘ పోరు ఇప్పుడు చివరి అంకానికి చేరింది. ఇకపై ఇరు జట్లు పొట్టి ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాయి. ధనాధన్ ఆటతో అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు ఒకవైపు కోహ్లి సేన, మరోవైపు మోర్గాన్ బృందం ‘సై’ అంటున్నాయి. అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో భారత జట్టు కాస్త కొత్తగా కనిపిస్తుండగా, స్పెషలిస్ట్‌లతో ఇంగ్లండ్ బరిలో నిలిచింది. మూడు మ్యాచ్‌ల ధమాకా క్రికెట్‌కు నేడు కాన్పూర్‌లో తెర లేస్తోంది. భారత టి20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. కాన్పూర్: భారత గణతంత్ర దినోత్సవాన క్రికెట్ అభిమానుల కోసం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టి20 సిరీస్‌లో భాగంగా నేడు (గురువారం) జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా, ఈ ఫార్మాట్లోనూ తమ ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తుండగా, ఒక్క సిరీస్ విజయంతోనైనా తిరిగి వెళ్లాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వన్డేల్లోనే రికార్డు స్థాయిలో పరుగుల వరద పారిన నేపథ్యంలో టి20ల్లో కూడా అదే జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇటీవలే 500వ టెస్టుకు వేదికగా నిలిచిన గ్రీన్ పార్క్ మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఉత్తరాదిన మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ సమయాన్ని ముందుకు మార్చారు. ఓపెనర్‌గా కోహ్లి! భారత వన్డే జట్టుతో పోలిస్తే కొన్ని కీలక మార్పులు టి20 టీమ్‌లో కనిపించనున్నాయి. సురేశ్ రైనా, ఆశిష్ నెహ్రాలాంటి సీనియర్లు మ్యాచ్ బరిలోకి దిగుతుండగా, మిడిలార్డర్లో మనీశ్ పాండేకు అవకాశం దక్కనుంది. వన్డేల్లో చోటు కోల్పోయి ఈ ఒక్క ఫార్మాట్‌కే పరిమితమైన రైనా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్‌లో రాణించడం తప్పనిసరి. వన్డేల్లో ఎక్కువగా రిజర్వ్‌కే పరిమితమవుతున్న పాండే కూడా తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్, జడేజాలకు విశ్రాంతినివ్వడంతో ప్రధాన స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా బరిలోకి దిగడం ఖాయమైంది. లెగ్‌స్పిన్ ఆడటంలో ఇంగ్లండ్ బలహీనతను బట్టి చూస్తే మిశ్రా కీలకం కానున్నాడు. అదే విధంగా ఆఫ్‌స్పిన్నర్‌గా పర్వేజ్ రసూల్ కూడా తుది జట్టులో ఉంటాడు. డెత్ ఓవర్లలో మన బౌలర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం. మరోవైపు సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి కెప్టెన్‌గా తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో మరో బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తాను ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని అతను పరోక్షంగా వెల్లడించాడు. ఐపీఎల్లో ఓపెనింగ్‌కు దిగినా... భారత్ తరఫున గతంలో రెండుసార్లు మాత్రం అతను ఓపెనర్ స్థానంలో ఆడాడు. కోహ్లిలాంటి స్టార్ ఆటగాడు ఎక్కువ ఓవర్లు ఆడేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. అయితే అతనికి జోడిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరం. ఈ విషయంలో లోకేశ్ రాహుల్‌కు అనుకూలతలు ఉన్నా, మన్దీప్ సింగ్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. మరోవైపు రంజీల్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికైన వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా అవకాశం ఇవ్వాలంటే ఓపెనింగ్ మినహా మరో స్థానం ఖాళీ లేదు. జట్టులో అందరికీ తగినంత టి20 అనుభవం ఉండటంతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. యార్కర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు మ్యాచ్‌కు ముందు రోజు ధోని, బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యేకంగా సాధన చేయడం విశేషం. నలుగురు పేసర్లతో... ఇంగ్లండ్ జట్టు వన్డే సిరీస్ ఓడినా, తొలి రెండు మ్యాచ్‌లలో కూడా గట్టి పోటీ ఇచ్చింది. టెస్టు టీమ్‌తో పోలిస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లుగా జట్టులోకి వచ్చిన వారంతా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. చివరి వన్డేలో సాధించిన విజయంతో మోర్గాన్ సేన కొత్త ఉత్సాహంతో టి20లకు సిద్ధమైంది. దాదాపు పది నెలల క్రితం భారత గడ్డపై ప్రపంచకప్ ఆడిన జట్టు నుంచే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ టీమ్‌లోనూ ఉండటం వారికి కలిసొచ్చే అంశం. ఓపెనర్‌గా జేసన్ రాయ్ మెరుపు ఆరంభం ఇవ్వగల సమర్థుడు. గాయంతో హేల్స్ దూరమైనా, అతని స్థానంలో వచ్చిన బిల్లింగ్స్‌కు కూడా చెలరేగే సత్తా ఉంది. సీనియర్లు మోర్గాన్, రూట్లతో పాటు ఆల్‌రౌండర్లు స్టోక్స్, అలీ ఆ జట్టు బలం. టి20ల్లో దూకుడైన ఆటగాడు, ఐపీఎల్ అనుభవం ఉన్న బట్లర్ కూడా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గంటకు 90 మైళ్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న టైమల్ మిల్స్‌పై కూడా ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ తుది జట్టులో నలుగురు పేసర్లకు అవకాశం ఇవ్వనుండటం విశేషం. అయితే అనుభవం తక్కువగా ఉన్న బౌలింగ్‌తో పోలిస్తే తమ బ్యాటింగ్‌పైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్/పంత్, రైనా, యువరాజ్, ధోని, పాండే, పాండ్యా, రసూల్, మిశ్రా, నెహ్రా, బుమ్రా/భువనేశ్వర్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బిల్లింగ్స్, రూట్, బట్లర్, స్టోక్స్, అలీ, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్, బాల్. టి20ల్లో స్పెషలిస్ట్‌లుగా నిరూపించుకునేందుకు రసూల్లాంటి బౌలర్లకు ఈ సిరీస్ మంచి అవకాశం. భారత్‌కు మరిన్ని విజయాలు అందించగల సత్తా ఇంకా రైనాలో ఉందని నమ్ముతున్నా. అవసరమైతే నేను ఓపెనింగ్ చేస్తా. టెస్టులు, వన్డేల జోరును ఇక్కడా కొనసాగిస్తాం. మిల్స్ బౌలింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు కానీ 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసే చాలా మంది బౌలర్లను నా కెరీర్లో ఎదుర్కొన్నాను. – కోహ్లి, భారత కెప్టెన్ కోల్‌కతా వన్డే విజయం తర్వాత మా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎంత కష్టపడినా గెలుపు దక్కలేదనే నిస్పృహ నుంచి అంతా దూరమయ్యారు. ఈ సిరీస్‌లోనూ గట్టి పోటీ తప్పదు కానీ విజయం సాధించగలమని నమ్ముతున్నాం. – మోర్గాన్, ఇంగ్లండ్ కెప్టెన్ పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. చిన్నగ్రౌండ్ కూడా కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు వల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు దిగవచ్చు. సా.గం. 4.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
బంగ్లాదేశ్ ‘హ్యాట్రిక్’ వైట్‌వాష్
2–0తో న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్ క్రైస్ట్‌చర్చ్: ఇప్పటికే టి20, వన్డే సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్‌కు టెస్టు సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 0–2తో ఓడిన బంగ్లా తమ పర్యటనను ఘోర పరాజయాలతో ముగించింది. సోమవారం ముగిసిన చివరి టెస్టులో కివీస్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా... నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 260/7తో తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ 354 పరుగులకు ఆలౌటై 65 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. నికోల్స్ (98; 12 ఫోర్లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 52.5 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. బౌల్ట్, సౌతీ, వాగ్నర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. 109 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి అందు కుంది. లాథమ్ (41 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రాండ్‌హోమ్ (33 నాటౌట్; 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. -
టి20లోనూ కివీస్ క్లీన్‌స్వీప్
అండర్సన్ మెరుపు ఇన్నింగ్స్ ∙41 బంతుల్లో 94 నాటౌట్ మూడో మ్యాచ్‌లోనూ బంగ్లా ఓటమి మౌంట్ మాంగనూ (న్యూజిలాండ్): బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20లో కోరె అండర్సన్ విధ్వంసకర ఆటతీరుతో 41 బంతుల్లోనే అజేయంగా 94 పరుగులు (2 ఫోర్లు, 10 సిక్సర్లు) చేయడంతో కివీస్ 27 పరుగుల తేడాతో నెగ్గింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకున్న కివీస్ ఈనెల 12 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ కేన్ విలియమ్సన్ (57 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. 41 పరుగులకు మూడు వికెట్లు పడిన దశలో అండర్సన్, విలియమ్సన్ జోడి బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించారు. ముఖ్యంగా అండర్సన్ మోర్తజా బౌలింగ్‌లో 4,6,6తో పాటు సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 124 పరుగులు జత చేరాయి. తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 79 పరుగులతో ఉన్న అండర్సన్ రెండు సిక్సర్లు బాది కెరీర్లో తొలి శతకానికి మరో ఆరు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అలాగే కివీస్ తరపున టి20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రూబెల్ హŸస్సేన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. సౌమ్య సర్కార్ (28 బంతుల్లో 42; 6 ఫోర్లు), షకీబ్ (34 బంతుల్లో 41; 4 ఫోర్లు) మాత్రమే ఆడగలిగారు. బౌల్ట్, సోధిలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
తొలి టి20లో కివీస్‌దే విజయం
నేపియర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించింది. ఇటీవలి వన్డే సిరీస్‌ను కివీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 141 పరుగులు చేసింది. మహ్ముదుల్లా (47 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ఫెర్గూసన్‌కు మూడు, వీలర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లకు 143 పరుగులు చేసి గెలిచింది. అయితే 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (55 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్వితీయంగా రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 47 బంతుల్లోనే 81 పరుగులను జోడిం చారు. ఈనెల 6న రెండో టి20 జరుగుతుంది. -
టెస్టు క్రికెట్ అందమే వేరు...
అభిమాని కాలమ్ ప్రస్తుత తరం కుర్రాళ్లు వన్డేలు, టి20లు అంటేనే ఎక్కువ మోజు చూపుతున్నారు. అరుునా విశాఖలో జరిగిన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌కు కాలేజీ విద్యార్థులు భారీగా వచ్చారు. వీళ్లకి ప్రవేశం ఉచితంగా కల్పించడం వల్ల తమ అభిమాన క్రికెటర్లను చూడటానికి మైదానానికి వచ్చారు. అరుుతే అక్కడక్కడా నిజమైన టెస్టు అభిమానులూ ఉన్నారు. టిక్కెట్ కొనుక్కుని ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయాన్నే వచ్చి, రోజంతా మ్యాచ్ చూసి వెళ్లిన వారూ కొందరు ఉన్నారు. వారిలో ఒకరు విష్ణుభట్ల రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేసిన ఆయనకు టెస్టు క్రికెట్ అంటే బాగా ఇష్టం. టెస్టు క్రికెట్ గొప్పతనం, అందం గురించి, నగరంలో తొలిసారి టెస్టు మ్యాచ్ అనుభవం తదితర అంశాలు ఆయన మాటల్లోనే... ‘నేను 20 ఏళ్ల వయసులో టెస్టు మ్యాచ్ చూడటానికి మద్రాస్ వెళ్లాను. అది కూడా భారత్, ఇంగ్లండ్‌ల మ్యాచ్. వైజాగ్ వచ్చిన కొత్తలో టీవీలు లేని రోజుల్లో రేడియోలో కామెంటరీ వినేవాడిని. మధ్యలో గుర్ అంటూ వచ్చే సౌండ్‌తో కొన్నిసార్లు అర్థం అయ్యేది కాదు. అరుునా సిగ్నల్ సరిగా వచ్చే వరకూ అలాగే పెద్ద రేడియో పట్టుకునే వాళ్లం. ఇప్పుడు టెక్నాలజీ చూసిన తర్వాత ఆ రోజులు గుర్తు వస్తే నవ్వుకుంటున్నాం. టెస్టు మ్యాచ్ టీవీలో వస్తే ఏ రెండు దేశాలు ఆడినా చూస్తాను. నిజానికి ఇదో అద్భుతమైన ఫార్మాట్. తెల్ల దుస్తుల్లో ఆటగాళ్లు... పిచ్ చుట్టూ మోహరించిన . ఫీల్డర్లు... ఎర్రగా మెరిసిపోయే బంతి... చూడటానికి ఎంతో బాగుంటుంది. వన్డేలు, టి20లకు నేను వ్యతిరేకం కాదు. కానీ టెస్టు క్రికెట్ అసలైన క్రికెట్ అని నా ఉద్దేశం. బ్యాట్స్‌మెన్ నైపుణ్యం, ప్రతిభ అన్నీ దీని ద్వారానే బయటకు వస్తారుు. బౌలర్లు వికెట్లు తీయడం కోసం బంతులు వేస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం అందంగా ఉంటుంది. బ్యాట్స్‌మన్ చుట్టూ గొడుగులా ఫీల్డర్లు నిలబడితే.. ఆ సమయంలో బ్యాట్స్‌మన్ చూపించే టెక్నిక్‌ను చూడటం అసలైన వినోదం. వైజాగ్‌లో టెస్టు మ్యాచ్ అని తెలియగానే చాలా సంతోషపడ్డాను. టిక్కెట్లు అమ్మడం మొదలైన తొలిరోజే స్టేడియంలో మ్యాచ్ బాగా కనిపించే స్టాండ్సలో కొనుక్కున్నాను. ఇదే స్టాండ్‌లో బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్ అభిమానులు ఉన్నారు) చేసే హడావుడి, వారి ఉత్సాహం చాలా బాగుంది. టెస్టు క్రికెట్ చూడటం కోసం వాళ్లు అక్కడి నుంచి అంత ఖర్చు చేసుకుని వచ్చి మరీ తమ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే ఆట నిలబడుతుంది. ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తూ వారితో ఆట గురించి చర్చిస్తూ ఉంటే మరింత ఆనందంగా ఉంది. వైజాగ్‌లో టెస్టు మ్యాచ్ నిర్వహించినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నగరానికి టెస్టు హోదా వచ్చినందున ఇకపై తరచుగా మ్యాచ్‌లు చూడగలుగుతాను.’ -
ఆట ముఖ్యమా... టీవీలో ప్రసారమా!
ముంబై: వర్షం లేదు... వెలుతురు కూడా బ్రహ్మాండం... పిచ్ కూడా ఆటకు అనుకూలంగా ఉంది... ఐసీసీ నిబంధనల ప్రకారం అన్నీ బావున్నారుు. అరుునా సరే గత నెల 28న భారత్, వెస్టిండీస్ రెండో టి20 మ్యాచ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక కారణాల వల్లే అని వివరణ ఇచ్చుకున్నా... చివర్లో వాన రావడంతో దాని ప్రభావం కనిపించింది. మనం గెలవాల్సిన మ్యాచ్‌ను వర్షం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. సిరీస్‌ను సమం చేసే అవకాశం భారత్ కోల్పోవడం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆగ్రహం తెప్పించింది. ఈ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూ బీసీసీఐకి ధోని అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందంటే... భారత్, విండీస్ మధ్య లాడర్ హిల్ (ఫ్లోరిడా)లో రెండో టి20 మ్యాచ్ జరిగింది. అరుుతే సాంకేతిక కారణాలతో మ్యాచ్ నిర్ణీత సమయంకంటే దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స అరుునా మ్యాచ్‌ను షూట్ చేసే ప్రొడక్షన్ బాధ్యతలు సన్‌సెట్ అండ్ వైన్ అనే కంపెనీవి. అరుుతే అసలు సమయంలో మ్యాచ్ ఫీడ్‌ను స్టార్‌కు అప్ లింకింగ్ చేయడంలో ఆ కంపెనీ విఫలమైంది. సమస్య ఏమిటంటూ ధోని పదే పదే అడిగిన మీదట టెక్నికల్ సమస్యలు సరి చేస్తున్నామంటూ, కాస్త ఓపిక పట్టాలంటూ వారు జవాబిచ్చారు. ఎలా ఆపుతారు?: ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షం, వెలుతురు లేకపోవడం, మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడమనే మూడు కారణాలతో మాత్రమే ఆటను ఆలస్యంగా ప్రారంభించవచ్చు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరగడం ఇదే మొదటి సారి. ‘నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను సరైన సమయంలో ప్రారంభించాల్సింది. శాటిలైట్ సిగ్నల్స్ లేవని ఆటను ఆపుతారా. మరి మైదానంలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి. భారీ ధరకు టికెట్ కొని వచ్చినవారికి ఎవరు జవాబు చెప్పాలి. ప్రొడక్షన్ సంస్థ చేసింది క్షమించరాని తప్పు‘ అని ధోని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ధోనిపై కేసు కొట్టివేత విష్ణుమూర్తి అవతారంలో వేర్వేరు ప్రకటనలకు ప్రచారం చేస్తున్నట్లు ఓ పత్రికలో ప్రచురితమైన చిత్రానికి సంబంధించిన కేసులో ధోనికి విముక్తి లభించింది. ధోనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులు న్యాయంగా లేవని జస్టిస్ రంజన్, పీసీ పంత్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయ పడింది. -
లెక్క తప్పుతోంది!
⇒ లక్ పోతుంది ⇒ ధోనికి దూరమవుతున్న ఫినిషింగ్ టచ్ ⇒ ఇకపై ఆ ‘మ్యాజిక్’ ముగింపులు చూడలేమా? ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు..? ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రశ్నకు వినిపించే సమాధానం ధోని. అతను క్రీజులో ఉన్నాడంటే భారత్‌కు విజయం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉండేది. చివరి ఓవర్లో ఎన్ని పరుగులు అవసరమైనా... చివరికి రెండు బంతుల్లో 12 పరుగులు కావాలన్నా ధోని ఆడుతున్నాడంటే విజయం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ క్రమంగా ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. అదృష్టాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతాడనే పేరున్న ధోనిని... ఇప్పుడు అదే అదృష్టం వెక్కిరిస్తోంది. ఇటీవల కాలంలో తరచుగా అతను ఆఖరి ఓవర్ల ‘మ్యాజిక్’ను మిస్ అవుతున్నాడు. తాజాగా అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆఖరి బంతికి విజయానికి కావాల్సిన రెండు పరుగులను చేయలేక అవుటయ్యాడు. ఎందుకిలా..? రెండో ఎండ్‌లో క్రీజులో ఎంత పేరున్న బ్యాట్స్‌మన్ అరుునా... ధోని సింగిల్స్ తీయకుండా భారీ షాట్లతో మ్యాచ్‌లు ముగించడం చాలాసార్లు చూశాం. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన టి20లో రెండో ఎండ్‌లో అంబటి రాయుడు రూపంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా ధోని కనీసం సింగిల్స్ తీయకుండా ఒక్కడే మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. ధోని గత చరిత్ర తెలిసిన వాళ్లకు ఇది కొత్తగా అనిపించలేదు. గతంలో ఇదే తరహాలో మ్యాచ్‌లు గెలిపించినందున... ఒక్క మ్యాచ్ ఓడిపోతే విమర్శలు చేయడం కరెక్ట్ కాదని అందరూ సరిపెట్టుకున్నారు. తర్వాత కాస్త తడబడ్డా మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్లో వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ఒక్కడే బాదేశాడు. ముఖ్యంగా చివరి మూడు బంతులకు 16 పరుగులు అవసరం కాగా... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రెండు నెలల క్రితం జింబాబ్వే సిరీస్‌లో ఆఖరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా... ధోని క్రీజులో ఉన్నా భారత్ ఓడిపోరుుంది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలిచే స్థితిలో ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వెస్టిండీస్‌తో టి20 మ్యాచ్‌లో 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం అయ్యారుు. ఇంత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఎనిమిది పరుగులు విషయమే కాదు. రెండో ఎండ్‌లో కేఎల్ రాహుల్ అప్పటికే సెంచరీ చేసి సంచలనాత్మకంగా హిట్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ధోని రెండో ఎండ్‌లో ఉన్న రాహుల్‌ను నమ్ముకోవచ్చు. అరుుతే వెస్టిండీస్ బౌలర్ బ్రేవో చాలా తెలివిగా వ్యవహరించాడు. ధోనితో కలిసి చెన్నై తరఫున ఆడిన బ్రేవోకు భారత కెప్టెన్ ఏం చేస్తాడో తెలుసు. ఇలాంటి ఓవర్లలో సహజంగా తొలి బంతిని బౌండరీకి పంపి బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. కాబట్టి బ్రేవో తెలివిగా వ్యవహరించడం తొలి నాలుగు బంతులకు నాలుగు సింగిల్స్ మాత్రమే వచ్చారుు. చివరి రెండు బంతుల్లో విజయానికి నాలుగు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి రెండు పరుగుల తీసి, ఆఖరి బంతికి భారత కెప్టెన్ అవుటయ్యాడు. తన జీవితంలోనే మరచిపోలేని ఇన్నింగ్స ఆడి సెంచరీ చేసిన రాహుల్ ఆ క్షణంలో పడిన బాధను చూస్తే... ధోని కూడా కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు. బౌలర్లు హోమ్‌వర్క్ చేస్తున్నారు ధోని మంచి ఫినిషర్ అని ప్రపంచంలో ఉన్న బౌలర్లందరికీ తెలుసు. బంతి వేసేది తెలివైన బౌలర్ అరుుతే ధోనిని నియంత్రించవచ్చని గతేడాది దక్షిణాఫ్రికా బౌలర్ రబడ ప్రపంచానికి చూపించాడు. కాన్పూర్‌లో జరిగిన వన్డేలో ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... రబడ భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ధోని కదలికలను బట్టి బంతుల్లో వైవిధ్యం చూపించాడు. ఈసారి వెస్టిండీస్ బౌలర్ బ్రేవో కూడా అదే చేశాడు. ధోని క్రీజులో కదులుతున్న విషయాన్ని గమనించి స్లో బంతితో బోల్తా కొట్టించాడు. అంటే... అన్ని జట్ల బౌలర్లు హోమ్ వర్క్ చేసే బరిలోకి దిగుతున్నారు. విశ్రాంతి వల్ల ఇబ్బందా? ధోని కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకోలేదు. అన్ని ఫార్మాట్లలోనూ అలుపెరగకుండా ఆడాడు. దీంతో ఎప్పుడూ ‘టచ్’ కోల్పోలేదు. కానీ ఇప్పుడు ధోని టెస్టులు ఆడటం లేదు. కేవలం వన్డేలు, టి20లకు పరిమితమయ్యాడు. వాస్తవానికి జింబాబ్వే పర్యటన తర్వాత భారత్‌కు అన్నీ టెస్టు మ్యాచ్‌లే ఉన్నారుు. అనుకోకుండా అమెరికాలో రెండు టి20లు ఆడాల్సి రావడం వల్ల ధోని వచ్చాడు. లేదంటే దాదాపు మరో రెండు మూడు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగానే ఉండేవాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ఫిట్నెస్ కోసం శ్రమించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉన్న ఆటగాళ్లే మెరుగ్గా రాణిస్తారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దీనిని ధోని ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఆర్డర్ మారడం మేలేమో..! ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, అంచనాల ప్రకారం ధోని ఇంగ్లండ్‌లో వన్డే ప్రపంచకప్ (2019) వరకు కొనసాగాలని అనుకుంటున్నాడు. గతంతో పోలిస్తే ధోనిలో ఫినిషింగ్ పవర్, భారీ హిట్టింగ్ పవర్ తగ్గిందనేదీ వాస్తవం. ఈ నేపథ్యంలో మరో మూడేళ్లు క్రికెట్ ఆడాలంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడం మేలు. ఆఖరి ఓవర్లలో హిట్టింగ్ చేయగల ఆటగాడిని చూసుకుని ధోని మిడిలార్డర్లో నాలుగు, ఐదు స్థానాల్లో ఆడటం వల్ల క్రీజులో కుదురుకోవడానికి సమయం దొరుకుతుంది. వెస్టిండీస్‌తో ఆఖరి బంతికి అవుటైనా ఆ మ్యాచ్‌లో ధోని బాగా ఆడాడు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన ధోనిని విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ గతంలోలాగా ఆఖరి ఓవర్లలో ఒక్కడే షో చేయడం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. అదృష్టం కూడా ప్రతిసారీ వెంట ఉండదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది. -
టి20ల్లోనూ చిక్కులు ఉన్నాయి: ద్రవిడ్
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌ను ఎవరు ఎన్ని విధాలుగా పోల్చినా... టి20లకే పరిమితమైన కొన్ని సంక్లిష్టతలు, చిక్కులు ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. ఇవేమీ సాధారణ ప్రజానికానికి అర్థం కావన్నారు. ‘ఐపీఎల్ జట్ల గురించి అప్పుడప్పుడు కొన్ని సంభాషణలు వింటుంటాం. ఇవేమీ బయటగానీ, టీవీ స్టూడియోల్లోగానీ జరగవు. ఈ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేనూ టీవీ చర్చల్లో పాల్గొన్నా. అయితే టి20ల గురించి లోతైన చర్చ కేవలం జట్టులో మాత్రమే జరుగుతుంది. దీనిపై బయటి వ్యక్తులకు అవగాహన లేదని నేను చెప్పను. కానీ సరిపడినంత అవగాహన మాత్రం ఉండదు. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అలా ఎందుకు చేయడం లేదు? అని కొంత మంది కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఎందుకలా జరుగుతుందో అర్థం మాత్రం చేసుకోరు. వాస్తవంగా లోపల ఏం జరిగిందనేదాన్ని ఎవరూ పట్టించుకోరు’ అని ద్రవిడ్ పేర్కొన్నారు. టి20 జట్లలో సమతుల్యం తెచ్చేందుకు చాలా శోధన చేయాల్సి వచ్చిందన్నారు. -
ప్రతీకారం తీర్చుకుంటారా!
► విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్ ► ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే నేడు రెండో టి20 మ్యాచ్ వన్డేల తరహాలోనే టి20లను చుట్టేస్తామని భావించిన భారత్‌కు జింబాబ్వే అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఇప్పుడు దానినుంచి కోలుకొని సిరీస్‌ను సమం చేయాల్సిన స్థితిలో ధోని సేన నిలిచింది. తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా టీమిండియా తమ అసలు ఆట ప్రదర్శిస్తుందా... లేక జింబాబ్వే గత మ్యాచ్ జోరును కొనసాగిస్తుందా చూడాలి. హరారే: పేరుకు పూర్తి స్థాయి జట్టు కాకపోరుునా, ఇదే జట్టు వన్డే ఫామ్‌ను చూస్తే జింబాబ్వే చేతిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20ల్లో జింబాబ్వే సంచలనం నమోదు చేసింది. అయితే తొలి మ్యాచ్‌కు ప్రతీకారంపై టీమిండియా దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెట్టి తమ స్థాయి ప్రదర్శనతో సిరీస్‌లో నిలబడాలని భారత్ పట్టుదలగా ఉంది. గతంలో ఒక్కసారి కూడా ఏ జట్టుపైనా టి20 సిరీస్ నెగ్గని జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. భారత్‌పై తొలిసారి సిరీస్ నెగ్గాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు (సోమవారం) రెండో టి20 మ్యాచ్ జరగనుంది. మార్పులు ఉంటాయా... తొలి మ్యాచ్‌లో భారత్ ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు తొలి మ్యాచ్ అవకాశం ఇచ్చింది. వీరిలో మన్దీప్ సింగ్ ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్ ప్రదర్శనను బట్టి రాహుల్, చహల్‌లకు కూడా మరో అవకాశం దక్కవచ్చు. ఉనాద్కట్, రిషి ధావన్ మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క మ్యాచ్‌కే వీరిని పరిమితం చేస్తారా, లేక మరో అవకాశం ఇస్తారా చూడాలి. వీరి స్థానంలో బరీందర్ లేదా ధావల్ కులకర్ణి రావచ్చు. భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే ప్రధాన బ్యాట్స్‌మెన్ నుంచి మరింత మంచి ప్రదర్శన రావాలి. జట్టు బ్యాటింగ్ ప్రధానంగా మనీశ్ పాండేతో పాటు అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లపై ఆధార పడి ఉంది. ఐపీఎల్లో మెప్పించిన రాహుల్ తొలి మ్యాచ్ వైఫల్యం నుంచి బయటపడి మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. జింబాబ్వే పర్యటనలో ఇప్పటివరకు మ్యాచ్ అవకాశం దక్కని ఒకే ఒక ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్. అయితే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ధోని మరో కొత్త ఆటగాడిపై నమ్మకం ఉంచే అవకాశం లేదు. ఒక మార్పుతో... తొలి మ్యాచ్ గెలిచిన జింబాబ్వేలో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. గత ఏడాది భారత్‌పై టి20 మ్యాచ్ విజయం స్ఫూర్తిగా ఈసారి కూడా శుభారంభం చేసిన ఆ జట్టు మరొక్క విజయం సాధిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఓపెనింగ్ జోడి చిబాబా, మసకద్జా మరోసారి శుభారంభం ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. మరో టాపార్డర్ బ్యాట్స్‌మన్ ముతుంబామి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కాగా, అతని స్థానంలో పీటర్ మూర్ జట్టులోకి రానున్నాడు. ఇక తొలి మ్యాచ్‌తో హీరోగా మారిన చిగుంబురా మళ్లీ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఈ పర్యటనలో ఇప్పటి వరకు ఆకట్టుకోని మరో ప్రధాన బ్యాట్స్‌మన్ సికందర్ రజా ఫామ్‌లోకి వచ్చేందుకు ఇది మంచి అవకాశం. బౌలింగ్‌లో ముజరబని, తిరిపానోలు కీలకం కానున్నారు. ముఖ్యంగా జింబాబ్వేను గెలిపించిన చివరి ఓవర్ బౌలర్ మద్జివ మరోసారి రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రాహుల్, మన్దీప్, రాయుడు, పాండే, జాదవ్, అక్షర్, ధావన్/ధావల్, చహల్, బుమ్రా, ఉనాద్కట్/బరీందర్. జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), మసకద్జ, చిబాబా, మూర్/మరుమా, రజా, వాలర్, చిగుంబురా, ముతుంబోజి, మద్జివ, ముజరబని, తిరిపానో. సా.గం. 4.30 నుంచి టెన్-2, డీడీ నేషనల్లో ప్రత్యక్ష ప్రసారం -
ఎందుకీ అసహనం..?
► అదుపు తప్పుతున్న భారత క్రికెటర్లు ► అర్థం లేని స్పందనలు ఓటమి గురించి అడిగితే మా కుక్క పిల్లకు జ్వరం వచ్చిందనే క్రికెటర్ ఒకరు... రాజకీయాల గురించి అడిగితే నీకు బుద్ధి లేదనేవారొకరు... కోచ్ గురించి అడిగితే పెళ్లామా, పక్కింటావిడా అని ప్రశ్నించేదొకరు... రిటైర్మెంట్ గురించి ప్రశ్నిస్తే మీ ఇంట్లో ఎవరున్నారు అనేదొకరు... ఇవన్నీ చూస్తుంటే మన క్రికెటర్లలో ఇటీవలి కాలంలో అసహనం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైన ‘ట్రెండ్’ను వీరు మొదలు పెడుతున్నారు. ప్రశ్న ఒకటి అయితే దానికి పొంతన లేని సమాధానం ఇస్తూ తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా లేక ఏం చెప్పినా చెల్లుతుందనే అహంతో అలా ప్రవర్తిస్తున్నారా! ఆటతోనే కాదు మాటలతో కూడా గారడీ చేయడం భారత వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వెన్నతో పెట్టిన విద్య. చాలా సందర్భాల్లో అతని మాటలు త్రివిక్రమ్ డైలాగుల్లా పేలతాయి. సూటిగా తన అభిప్రాయం చెబుతూనే, సరదాగా నవ్వులు తెప్పించే విధంగా కూడా ఆ మాటలు ఉండేవి. అయితే అతనిలో కూడా అసహనంపాలు పెరిగినట్లే అనిపిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ గురించి అడిగితే కాస్త ఆగ్రహంగానే ‘నేను ఒక్కసారి చెబితే కొన్ని రోజులు, నెలల కోసం చెప్పినట్లే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత అయితే అతడిని చూస్తే అసలు ధోనియేనా అనిపించింది. ఆటతీరును విశ్లేషించమని అడిగిన పాపానికి మేం గెలవాలని మీకు లేనట్లుంది అంటూ ఎదురుదాడికి దిగాడు. వెస్టిండీస్‌తో ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి అడిగిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు క్లాస్ పీకడమే కాదు...ఇదే ప్రశ్న భారత విలేకరి అడిగితే సమాధానం భిన్నంగా ఉండేది అంటూ లేని అసహనం ప్రదర్శించాడు. దేనినైనా ‘లైట్’ తీసుకుంటూ కూల్‌గా కనిపించే కెప్టెన్ ఇలా గట్టు దాటడం కొత్తగా అనిపించింది. అదే బాటలో తమ్ముళ్లు...: ధోనికి క్రికెట్లో రైనా, అశ్విన్ అత్యంత ఆత్మీయులు. తాజాగా వారి సమాధానాలు వింటే అసహనంతో, ఒకదానితో మరొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పడాన్ని కూడా అతడిని చూసే నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం గురించి అడిగితే అశ్విన్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ‘నేను తర్వాతి రోజునుంచి పత్రికలు చదవలేదు. మా కుక్కకు బాగా జ్వరం వచ్చింది. దానికి స్ట్రోక్ తగిలింది. జీవితంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆ రోజు తెలుసుకున్నా’ అంటూ తలతిక్కగా మాట్లాడటమే కాదు, ఆ తర్వాత ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌తో వాదన కూడా పెట్టుకున్నాడు. రైనా అయితే పరిధి దాటి ‘భార్యతో సౌకర్యమా, ప్రియురాలితో సౌకర్యమా’ అంటూ కోచ్ గురించి తలాతోక లేకుండా మాట్లాడాడు. వీరు కనీసం తాము చేసిన వ్యాఖ్యలపై ఆ తర్వాత కూడా కనీస వివరణ ఇవ్వలేదు. భజ్జీ రూటే వేరు: ఇక హర్భజన్ సింగ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో వాదనకు దిగాడు. వరల్డ్ కప్‌లో మ్యాచ్ అవకాశం రావడం లేదంటూ వ్యాఖ్యానించిన ఒక వ్యక్తిని చెడామడా తిట్టేశాడు. తాజాగా ఒక పోలీసు అధికారి మహిళపై దాడి చేస్తున్న ఫోటోను ట్విట్టర్లో పెట్టి ప్రధానికి ట్యాగ్ చేశాడు. దాంతో రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ఒక అభిమాని అడగడంతో భజ్జీ చెలరేగిపోయాడు. ‘నువ్వు పెద్ద వెధవవు. ప్రధాని కాబట్టి ట్యాగ్ చేశాను. కానీ ఒక పార్టీపై అభిమానంతో కాదు. మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది. నేనే గనక పోలీస్‌ను అయితే ముందు నిన్ను లోపలేసేవాడిని. నోర్మూసుకో’ అంటూ తన పంజాబీ ఆగ్రహాన్ని చూపించాడు. సమాధానమివ్వలేరా...: మన క్రికెటర్లంతా ఇంతగా అసహనం, ఆగ్రహం ప్రదర్శించేందుకు అవన్నీ ఏమైనా వివాదాస్పద ప్రశ్నలా లేక సమాధానం సరిగ్గా ఇస్తే పరువు పోతుందా! అవును, కాదు అంటూ పొడిగా బదులిచ్చి దానికి అక్కడే ఫుల్స్టాప్ పెట్టవచ్చు. ధోనిలాంటి మాటకారి అయితే దీనిపై సమాధానం చెప్పలేను అంటూ సులువుగా తప్పించుకోవచ్చు. కానీ వీరెవరూ తమ ‘లోపలి మనిషి’ని దాచుకోవడం లేదు. మామూలు సమాధానంతో ముగించాలని కోరుకోవడం లేదు. లెక్కలేని తనం, స్టార్లం కాబట్టి ఏమైనా చెప్పవచ్చు అన్న ధోరణే ఇందులో కనిపిస్తోంది. ఒక రకమైన తప్పుడు సంప్రదాయానికి వీరు బీజం వేస్తున్నారు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన ఆటగాళ్లు చీటికిమాటికీ అసహనంతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మున్ముందు ఆటగాళ్లు తమ మాటల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. లేదంటే ఆటకంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే ప్రమాదం ఉంది. -
టి20 కెప్టెన్సీకి ఆఫ్రిది గుడ్‌బై
కరాచీ: డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్లో ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ఆఫ్రిది తెలిపాడు. ‘టి20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నానని పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు తెలియజేస్తున్నా. మూడు ఫార్మాట్లలో నా దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు జట్టులో చోటుపై ఆఫ్రిదికి ఎలాంటి హామీ ఇవ్వలేమని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ పునరుద్ఘాటించినప్పటికీ తాను ఆటగాడిగా కొనసాగుతానని ఆల్‌రౌండర్ స్పష్టం చేశాడు. -
టి20ల్లో ఉత్తమ ఇన్నింగ్స్ రోహిత్‌దే...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డులు న్యూఢిల్లీ: భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా మూడోసారి ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో అవార్డును సాధించాడు. 2013, 2014ల్లో వన్డేల్లో చేసిన డ బుల్ శతకాలు ఆ ఫార్మాట్లో ఉత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచాయి. ఈసారి దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో తను సెంచరీ (106) చేయడంతో పొట్టి ఫార్మాట్లో ఉత్తమ ఇన్నింగ్స్ అవార్డును దక్కించుకున్నాడు. ఇయాన్ చాపెల్, వాల్ష్, జాన్ రైట్, జయవర్ధనే, అగార్కర్, మంజ్రేకర్, రస్సెల్ ఆర్నాల్డ్, మార్క్ నికోలస్‌లతో కూడిన ప్యానెల్ క్రిక్ఇన్ఫో అవార్డులను ప్రకటించింది. న్యూజిలాండ్‌ను ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చిన మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌కు ‘కెప్టెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. ఈ విభాగంలో అవార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అలాగే ‘ఉత్తమ టెస్టు బౌలింగ్’ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), ‘ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్’ కేన్ విలియమ్సన్ (కివీస్), ‘ఉత్తమ వన్డే ఇన్నింగ్స్’ డి విలియర్స్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ వన్డే బౌలింగ్’ టిమ్ సౌతీ (కివీస్), ‘ఉత్తమ టి20 బౌలింగ్’ డేవిడ్ వీస్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ అరంగేట్రం’ ముస్తాఫిజుర్ రహమాన్ (బంగ్లాదేశ్)లకు దక్కాయి. -
ఆసీస్ సూపర్ షో
వార్నర్, మ్యాక్స్‌వెల్ మెరుపులు దక్షిణాఫ్రికాపై రెండో టి20లో విజయం జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ చివరి బంతికి గెలిచింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో 1-1తో పోటీలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 79; 5 ఫోర్లు; 5 సిక్సర్లు), డి కాక్ (28 బంతుల్లో 44; 8 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (18 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడి భారీ స్కోరుకు సహాయపడ్డారు. ఫాల్క్‌నర్‌కు మూడు, హేస్టింగ్స్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. అయితే 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా డేవిడ్ వార్నర్ (40 బంతుల్లో 77; 6 ఫోర్లు; 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 75; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రొటీస్‌ను వణికించారు. వీరిద్దరి జోరుతో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 161 పరుగులు వచ్చాయి. దీంతో ఆసియా కప్ టి20లో ఇదే వికెట్‌కు ఉమర్ అక్మల్, షోయబ్ మధ్య నెలకొన్న ప్రపంచ రికార్డు కనుమరుగైంది. మ్యాక్స్ 19వ ఓవర్ తొలి బంతికి, వార్నర్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా ఆసీస్ ఇబ్బంది పడకుండా నెగ్గింది. రబడా, స్టెయిన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
మిల్లర్ మెరుపులు
తొలి టి20లో ఆసీస్‌పై దక్షిణాఫ్రికా విజయం డర్బన్: డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 95కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్ వీరోచిత ప్రదర్శన చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడి మూడు టి20ల సిరీస్‌లో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. జాన్ హేస్టింగ్స్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో స్క్వేర్ లెగ్‌లో మిల్లర్ కొట్టిన సిక్సర్ అయితే బంతి స్టేడియం బయటపడింది. క్రీజులో చివరికంటా నిలిచిన మిల్లర్ ఆటతో దక్షిణాఫ్రికా 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. డు ప్లెసిస్ (26 బంతుల్లో 40; 4ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కౌల్టర్ నైల్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 157 పరుగులు చేసింది. ఫించ్ (18 బంతుల్లో 40; 2 ఫోర్లు; 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. వేగంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. అయితే 114 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో మిషెల్ మార్ష్ (25 బంతుల్లో 35; 1 ఫోర్; 2 సిక్సర్లు) రాణించడంతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. తాహిర్‌కు మూడు, రబడా.. వీజ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. నేడు (ఆదివారం) జొహన్నెస్‌బర్గ్‌లో రెండో టి20 జరుగుతుంది. -
లంక బోర్డు వ్యాఖ్యలు దారుణం: జయవర్ధనే
కొలంబో: ఇంగ్లండ్ జట్టుకు సలహాదారు డిగా పనిచేయడాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్) తప్పుపట్టడంపై జయవర్ధనే అసం తృప్తి వ్యక్తం చేశారు. తానేమీ జట్టు రహస్యాలు వారికి అందించేందుకు వెళ్లలేదని గుర్తుచేశారు. ‘మైదానంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నేను ఇంగ్లండ్ ఆటగాళ్లకు సహాయపడతాను. అలాగే స్పిన్ బౌలింగ్‌ను దీటుగా ఆడేందుకు సలహాలిస్తాను. నేను వారితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ప్రపంచకప్ గ్రూప్‌లు నిర్ణయం కాలేదు. లంక రహస్యాలను చె ప్పేందుకే వారు నన్ను నియమించుకోలేదు. దానికోసం వారికి విశ్లేషకులు, కోచ్‌లున్నారు. బోర్డు నుంచి ఇలాంటి కామెం ట్స్ రావడం నిరాశకు గురి చేసింది. నిజానికి నేను టి20 జట్టు నుంచి వైదొలిగి రెండేళ్లవుతుంది. ఎంతోమంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. అయినా అప్పటి ప్రణాళికలతోనే వారు ఆడుతున్నారా?’ అని జయవర్ధనే ప్రశ్నించారు. -
తొలి టి20లో భారత మహిళల గెలుపు
34 పరుగులతో ఓడిన లంక రాంచీ: అనూజా పాటిల్ (17 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు; 3/14) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో... శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (36), సృ్మతి మందన (35) రాణించారు. ఓపెనర్లు మిథాలీ రాజ్ (3), వనిత (12) నిరాశపర్చడంతో భారత్ 4 ఓవర్లలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కౌర్, మందన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో అనూజా వేగంగా ఆడటంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సుగందిక 3, కౌసల్య 2 వికెట్లు తీశారు. తర్వాత లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 96 పరుగులకే పరిమితమైంది. సురంగిక (41 నాటౌట్) టాప్ స్కోరర్. అనూజ ధాటికి లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. సిరివర్ధనే (18), కరుణరత్నే (14) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. అనూజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది. -
ఇంకా ఎన్ని సార్లు చెప్పాలి?
రిటైర్మెంట్ ప్రశ్నపై ధోని అసహనం బంగ్లాదేశ్‌కు బయలుదేరిన భారత జట్టు కోల్‌కతా: తన రిటైర్మెంట్ గురించి పదే పదే ప్రశ్నలు అడగటంపై భారత వన్డే, టి20 కెప్టెన్ ఎమ్మెస్ ధోని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న వేస్తున్నారని, 15 రోజులు లేదా ఒక నెల వ్యవధిలో తన సమాధానం ఏమీ మారిపోదని అతను గట్టిగా చెప్పాడు. ‘ప్రశ్న ఎక్కడ అడిగినా పక్షం రోజుల్లో నా జవాబు మారిపోదు. నా పేరు ఏమిటి అనేంత సులభమైన ప్రశ్న అది. ఎప్పుడైనా ధోని అనే చెబుతాను. ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒకటి అడిగేస్తే ఎలా. ఈ కాలంలో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అలాంటప్పుడు అదే ప్రశ్న పదే పదే ఎందుకు అడుగుతున్నారు. అసలు ఇదంతా అవసరమా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి’ అని కుండబద్దలు కొట్టాడు. భారత్‌లో ప్రతీదానిని ప్రశ్నిస్తారని, ప్రపంచకప్‌లో తాము గెలిచినా, ఓడినా వేర్వేరు ప్రశ్నలు సిద్ధంగా ఉంటాయన్న ధోని... మెరుగైన ప్రశ్నలు వేస్తే తాను కూడా 100 శాతం సమాధానం ఇస్తానని స్పష్టం చేశాడు. అందరికీ అవకాశమిస్తాం... టి20 ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం అదృష్టమని, మన జట్టు వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని ధోని అన్నాడు. ఆసియా కప్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ఆదివారం ఢాకా బయల్దేరి వెళ్లింది. ఈ నెల 24న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ‘పెద్ద టోర్నీలు గెలిచే సత్తా మా జట్టుకు ఉంది. అందరికీ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని నేనూ ప్రయత్నిస్తున్నా. అందరూ ఫిట్‌గా ఉండటం కూడా కీలకం. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుంది. అయితే పరిస్థితులను బట్టి ఇతర ఆటగాళ్లను కూడా పరీక్షించేందుకు ప్రయత్నిస్తాం’ అని ధోని వ్యాఖ్యానించాడు. ఐదో స్థా నం వరకు తమ బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా ఉం దని, వారంతా నిలకడగా రాణిస్తున్నారు కాబట్టి తాను ఆరుకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం లేదని ధోని వెల్లడించాడు. అంతా వారి చలవే... దేశంలో అంతా ఇప్పుడు భావప్రకటన స్వేచ్ఛ గురించి చర్చ జరుగుతోందని, కానీ సరిహద్దులోని సైనికుల వల్లే అందరూ ఇంత నిబ్బరంగా మాట్లాడగలుగుతున్నారని ధోని అభిప్రాయపడ్డాడు. ‘స్పెషల్ ఫోర్స్‌లు, కమాండోలు తమ వ్యక్తిగత అంశాలకంటే జాతి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. మనల్ని వారు భద్రంగా కాపాడుతుండటం వల్లే ఈ రోజు చాలా మంది భావప్రకటన స్వేచ్ఛపై చర్చలు కొనసాగించగలుగుతున్నారు’ అని సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని తన మనోగతం వెల్లడించాడు. -
ఆఖరి బంతికి నెగ్గిన దక్షిణాఫ్రికా
గెలిపించిన మోరిస్ ఠ 3 వికెట్లతో ఓడిన ఇంగ్లండ్ కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా లక్ష్యం 135 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 19 ఓవర్లలో 120/7.. ఇక గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి. ఈ దశలో టోప్లే బౌలింగ్‌లో తొలి ఐదు బంతుల్లో మోరిస్ 13 పరుగులు రాబట్టాడు. ఇక మిగిలింది ఒక బంతి... రెండు పరుగులు... ఈ సమయంలో ఆఖరి బంతిని లాంగాఫ్‌లోకి కొట్టిన మోరిస్ రెండో రన్ కోసం ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ వెంటనే స్పందించి బంతిని బౌలర్ వైపు విసిరినా.. టోప్లే దాన్ని అందుకోలేకపోయాడు. దీంతో రనౌట్ మిస్సయింది. మ్యాచ్ సఫారీల సొంతమైంది. ఫలితంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టి20లో ప్రొటీస్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో నిలిచారు. న్యూలాండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. బట్లర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు), హేల్స్ (27) రాణించారు. తాహిర్ 4, అబాట్ 2 వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25), డుమిని (23), ఆమ్లా (22), రోసోవ్ (18) తలా కొన్ని పరుగులు చేశారు. జోర్డాన్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 జొహన్నెస్‌బర్గ్‌లో నేడు (ఆదివారం) జరగనుంది. -
సరికొత్త కోహ్లియేటర్
టీ20ల్లో కోహ్లి పరుగుల వరద లోపాలను తగ్గించుకున్న భారత స్టార్ నిరంతరం నేర్చుకోవడమే గెలుపు మంత్రం ‘ఫీల్డర్ లేని చోటును గమనించే కోహ్లి బంతిని బాదుతాడు.. అలాంటప్పుడు ఫీల్డర్‌ను ఎక్కడ ఉంచినా ఒక్కటే’ ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లి ఆట గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ చెప్పిన మాటలు ఇవి. నిజమే గతంలో కోహ్లి మ్యాచ్‌లో ఎప్పటికైనా అవుటయ్యేవాడు.. కానీ ప్రస్తుతం ఎప్పుడెప్పుడు అవుటవుతాడా అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెరీర్ ప్రారంభించిన కొత్తలో కొన్ని షాట్లు ఆడడంలో బలహీనతలు ఉన్నా సరే స్టార్‌గా మారిన కోహ్లి.. వాటిని తగ్గించుకుంటూ మరోమెట్టు పైకి ఎదిగాడు. విరాట్ కోహ్లి వన్డే, టెస్టుల్లో సూపర్‌స్టార్. అయితే ఇప్పుడు టీ20ల్లో కూడా ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్‌గా మారాడు. భారీకాయుడు కాకపోయినా.. కొందరు ఆటగాళ్లలా వైవిధ్యమైన షాట్లు ఆడకపోయినా.. బంతిని బలంగా బాదకపోయినా అవలీలగా పరుగులు సాధిస్తున్నాడు. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్లో కాస్త వెనుపడ్డట్టు కనిపించినా.. ఈ ఏడాది ముగిసిన ఒక నెలలోనే వన్డే, టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శనతో తనేంటో మరోసారి నిరూపించాడు. దీనికంతటికి కారణం అతని లోపాలను తగ్గించుకొని.. ఎప్పటికప్పుడు మెరుగవుతుండడమే. షార్ట్ పిచ్ బంతులు.. కోహ్లి రంజీ ఆడే రోజుల నుంచే షార్ట్‌పిచ్ బంతులను పుల్‌షాట్ ఆడడానికి ఇష్టపడేవాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ తరహా షాట్లు ఆడడంలో అతడి లోపం బయటపడింది. ఎప్పుడో 2008లోనే వన్డే అరంగేట్రం చేసినా.. 2011 వరకు టెస్టుల్లో అవకాశం కోసం ఎదురుచూశాడు. వెస్టిండీస్‌తో ఆడిన తొలిసిరీస్‌లో బలహీనత బయటపెట్టుకొని టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. దాంతో షార్ట్ బంతుల్ని ఎదురుకోవడంలో తన పంథా మార్చుకున్నాడు. లోపాన్ని సరిదిద్దుకోవడానికి చాలా శ్రమించాడు. పుల్‌షాట్ ఆడేటప్పుడు బంతిని వీలైనంతగా కిందకి కొట్టడం ప్రారంభించాడు. ప్రస్తుతం చాలా తక్కువ సందర్భాల్లోనే బౌన్సర్లకు వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. స్వీప్షాట్లో ప్రావీణ్యం.. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే బౌలర్లు స్వీప్ షాట్లు ఆడడం తరచుగా చూస్తుంటాం. కానీ కోహ్లి స్వీప్ షాట్లు ఆడడం తక్కువ సందర్భాల్లోనే చూస్తాం. మరోవైపు స్పిన్ ఎదుర్కొవడంలోనూ కోహ్లి దిట్టే. అయినా సరే స్వీప్‌షాట్ ఆడడం నేర్చుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్లో టెస్టు సిరీస్ సందర్భంగా లియోన్ బౌలింగ్ ఆడిన చక్కటి స్వీప్షాట్లే అందుకు నిదర్శనం. ఆ టూర్లో సూపర్‌సక్సెస్ కా వడానికి ఇది కూడా ఒక కారణం. ‘ఆఫ్ సైడ్’ మాస్టర్.. 2014లో టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన ఘోరం. ముఖ్యంగా విరాాట్ కోహ్లి వైఫల్యం అందుకు ఒక కారణం. ఆఫ్‌స్టంప్ అవతల పడిన బంతులను ఎదుర్కొవడంలో తన లోపాన్ని బయటపెట్టిన కోహ్లి వికెట్‌ను సమర్పించుకున్నాడు. అంతే 2015 వచ్చేసరికి ఆఫ్‌సైడ్ బంతులను ఆడడంలో మాస్టర్‌గా మారిపోయాడు. క్రీజ్‌కు కొంచెం ముందు నిలబడి ఆడడం మొదలుపెట్టాడు. అంతే ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. బ్యాక్‌ఫుట్ ఆడడంలో కూడా కొన్ని మార్పులు చేసుకున్న కోహ్లి ఈ సారి పర్యటనలో పరుగుల వరద పారించాడు. గతంలో అతని పరుగులు సాధించిన ఏరియాలను గమనిస్తే మైదానం నలువైపులా ఉండేవి. ఇప్పుడు సగానికి కంటే ఎక్కువ పరుగులు ఆఫ్సైడే బాదుతున్నాడు. లోపాల్ని సరిదిద్దుకుని.. నిజానికి ఏ ఆటగాడికైనా కెరీర్ మొదట్లో కొన్ని లోపాలు ఉంటాయి. కోహ్లికి కూడా ఉన్నాయి. అయినప్పటికీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. తన లోపాల్ని సరిదిద్దుకోకపోయినా.. పరుగుల వరద పారించే టాలెంట్ కోహ్లి సొంతం. అయితే ఇక్కడే కోహ్లి సక్సెస్ మంత్రం బయటపడుతుంది. తన ఆటకు ఎప్పటికప్పుడు మెరుగుపెట్టుకుంటూ లోపాల్ని సరిదిద్దుకొని ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంలా మారాడు. వీరబాదుడు లేదు.. క్రిస్ గేల్, పొలార్డ్, ధోని, డివిలియర్స్ వంటి భారీ హిట్టర్లు ఉన్నా ఎవరికి సాధ్యం విధంగా టీ20ల్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడి కోహ్లి నిలిచాడు. టీ20ల్లో వేగంగా పరుగులు సాధించడమే లక్ష్యం అయినా.. అందుకు వెరైటీ షాట్లు అవసరం లేదని కోహ్లి నిరూపించాడు. అతని ఇన్నింగ్‌లో స్విచ్ షాట్లు, రివర్స్ స్విప్లు, దిల్ స్కూప్‌లు, అప్పర్ కట్లు కనిపించవు. సంప్రదాయ షాట్లే ఉంటాయి. కళాత్మక షాట్లతోనే వేగం పరుగులు సాధించవచ్చని చూపించాడు. ఫీల్డర్ లేని ప్రదేశంలో బంతి పడేట్లు ఆడితే చాలు అన్నట్లు ఉంటుంది కోహ్లి ఆట. ఇటీవలే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారీ షాట్లు లేవు. కవర్స్ వైపు షాట్లే ఎక్కువ. తొలి మ్యాచ్‌లో అతడు చేసిన పరుగుల్లో 47 శాతం కవర్స్, ఎక్స్ట్రా కవర్స్ మధ్య ఆడడం ద్వారానే వచ్చాయంటే కోహ్లి కళాత్మక ఇన్నింగ్స్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే.. ఆసీస్ పర్యటనలో కోహ్లి ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏకంగా ఏడు సార్లు 50కి పైగాస్కోర్లు చేశాడు. పైగా టీ20ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్థసెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. కోహ్లి ఈ స్థాయిలో పరుగుల చేయడానికి మరోకారణం. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడడం. ప్రతి మ్యాచ్‌లో గమనిస్తే కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రాగానే బౌలర్లపై ఒత్తిడి పెంచే విధంగా బ్యాటింగ్ చేసి విజయవంతమయ్యాడు. ఇక టీ20ల్లో తన బలాన్ని అంచనా వేసుకొని భారీషాట్ల కోసం ప్రయత్నించకుండా క్రికెటింగ్ షాట్లతోనే అలరించాడు. ఈ టీ20 సిరీస్‌లో 199 సగటుతో 199 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి టీ20 క్రికెట్ చరిత్రలో 50 సగటును అందుకున్న ఏకైక ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. -
జింబాబ్వే సంచలన విజయం
బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్ సమం మిర్పూర్: బంగ్లాదేశ్‌తో రెండో టి20... చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 18 పరుగులు కావాలి. తొలి బంతికే ప్రధాన బ్యాట్స్‌మన్ వాలర్ వెనుదిరిగాడు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నెవెల్లే మద్జివా (19 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. నాసిర్ హొస్సేన్ వేసిన తర్వాతి మూడు బంతుల్లో 6, 2, 4 పరుగులు తీసిన అతను, ఐదో బంతికి మరో భారీ సిక్సర్ బాది జింబాబ్వేకు ఈ టూర్లో తొలి విజయాన్ని అందించాడు. జింబాబ్వే సంచలన విజయంతో సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఆదివారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనాముల్ హక్ (51 బంతుల్లో 47; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. పన్యాగర 3, మద్జివా, క్రీమర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసింది. వాలర్ (27 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అమిన్ హుస్సేన్‌కు 3 వికెట్లు దక్కాయి. వాలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. -
టి20లో 313 పరుగుల విజయం
దుబాయ్: ఓ టి20 మ్యాచ్‌లో 300 పరుగులు చేయడమే కష్టం. అలాంటిది ఓ జట్టు 313 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేస్తే ఆశ్చర్యమే. ఈ అద్భుతం షార్జాలో జరిగింది. బుఖాతిర్ టి20 లీగ్‌లో భాగంగా యునికాన్ క్రికెట్ క్లబ్ 313 పరుగులతో ముసాఫిర్ క్లబ్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యునికాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 364 పరుగులు చేయగా... ముసాఫిర్ క్లబ్ 10.3 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌటయింది. క్రికెట్ రికార్డుల్లోకి ఇది చేరకపోయినా... క్లబ్‌స్థాయి క్రికెట్లో ఇంత పెద్ద విజయం అద్భుతమే. -
డచ్ ఢమాల్!
నెదర్లాండ్స్ 39 ఆలౌట్ అంతర్జాతీయ టి20ల్లో అత్యల్ప స్కోరు 9 వికెట్లతో శ్రీలంక ఘన విజయం సరిగ్గా మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ జట్టు టి20 క్రికెట్లో పలు ప్రపంచ రికార్డులు తిరగరాసింది. సోమవారం ఆ జట్టు మళ్లీ రికార్డు పుస్తకాల్లో మరోసారి తమ పేరును లిఖించుకుంది. అయితే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్! అనూహ్య రీతిలో అత్యంత చెత్త ప్రదర్శనతో నెదర్లాండ్స్ రికార్డులకెక్కింది. ఘోరమైన ఆటతీరుతో టి20 చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసి శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. గత మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై తొలి 63 బంతుల్లో 150 పరుగులు చేసిన డచ్ బృందం ఇప్పుడే అదే 63 బంతుల్లో 39 పరుగులకే చేతులెత్తేసింది. భళా... శ్రీలంక ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడంలో శ్రీలంకకు మంచి రికార్డే ఉంది. వన్డేల్లో తొలి మూడు అత్యల్ప స్కోర్లు లంకపైనే రావడం విశేషం. జింబాబ్వే (35), కెనడా (36), జింబాబ్వే (38)...జట్లు శ్రీలంక చేతిలోనే కుప్పకూలాయి. చిట్టగాంగ్: సున్నాకు తొలి వికెట్... 1/2... 1/3... 9/4... ఈ తరహాలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సాగింది. లంక పదునైన బౌలింగ్ ముందు ఒక్క డచ్ బ్యాట్స్‌మన్ కూడా నిలబడలేకపోయాడు. ప్రమాదకరమైన బంతులు లేకపోయినా నిర్లక్ష్యంగా ఆడి ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ముగిసేసరికి డచ్ 4 వికెట్లు కోల్పోయి 15 పరుగులే చేయగలిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫ్లడ్‌లైట్లు పని చేయకపోవడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. బహుశా ఆ సమయమే హాలండ్ వికెట్ల పతనానికి విరామం లభించింది. ఆ తర్వాత దాదాపు ప్రతీ ఓవర్లో హాలండ్ వికెట్ కోల్పోతూనే ఉంది. ఐర్లాండ్‌పై చెలరేగి ఆడిన జట్టు ఇదేనా అనిపించేంత దారుణంగా ఆ జట్టు ప్రదర్శన కనబర్చింది. మాథ్యూస్, మలింగ, మెండిస్... ముగ్గురూ ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టి నెదర్లాండ్స్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌటైంది. టామ్ కూపర్ (18 బంతుల్లో 16; 2 ఫోర్లు) మినహా అంతా ఒక్క అంకెకే పరిమితం కాగా...ఐదుగురు బ్యాట్స్‌మెన్ సున్నాతోనే సరిపెట్టారు. 40 పరుగుల విజయలక్ష్యాన్ని శ్రీలంక సరిగ్గా 5 ఓవర్లలో పెరీరా (14) వికెట్ కోల్పోయి ఛేదించింది. దిల్షాన్ (12 నాటౌట్), జయవర్ధనే (11 నాటౌట్) అజేయంగా నిలిచారు. అంతర్జాతీయ టి20ల్లో ఇదే (39) అత్యల్ప స్కోరు. 2013లో కెన్యా (56) జట్టు అఫ్ఘానిస్థాన్‌పై చేసిన రికార్డును హాలండ్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2009లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర 30 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ టి20ల్లో అతి తక్కువ బంతుల్లో (63) ముగిసిన ఇన్నింగ్స్ ఇదే. లక్ష్యఛేదనలో మిగిలిన బంతుల (90) ప్రకారం చూస్తే శ్రీలంకదే అతి పెద్ద విజయం. 2012లో ఐర్లాండ్ మరో 76 బంతులు మిగిలి ఉండగానే కెన్యాను ఓడించింది. -
ఆసీస్ అదుర్స్
డర్బన్: డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాడ్ హాడ్జ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 6.4 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్‌పై విండీస్ గెలుపు
బ్రిడ్జ్‌టౌన్: టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ సరైన సమయంలో సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టి20లో శామ్యూల్స్ (46 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్; 2/21) ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచడంతో 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టులో శామ్యూల్స్‌కు తోడు గేల్ (35 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. శామ్యూల్ బద్రీ (3/17) ఆరంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. బొపార (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), బ్రెస్నన్ (29 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించగలిగారు. శామ్యూల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.